న్యూజిలాండ్ ఆశలపై స్లో ఓవర్ రేట్ దెబ్బ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్..
రెండో సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫిని దక్కించుకోవాలని ఉవ్విళ్లురుతున్న కివీస్ ఆశలపై ఇంగ్లండ్ జరిగిన తొలి టెస్ట్ లో..
By : The Federal
Update: 2024-12-04 12:59 GMT
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ లో చేరాలనుకునే కివీస్ ఆశలపై స్లో ఓవర్ రేట్ నీళ్లు చల్లింది. ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో ఓటమికి తోడు, స్లో ఓవర్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో కోత పడింది. భారత్ పై జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్బుతంగా రాణించి 3-0 తో రాణించి అగ్రస్థానానికి చేరుకున్న కివీస్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరువైంది.
ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో న్యూజిలాండ్ నిర్ణీత సమయానికి కోటాను పూర్తి చేయలేకపోయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కు పాల్పడిన జట్ల పాయింట్ల నుంచి మూడు పాయింట్లను కోత విధిస్తారు. తాజాగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ నుంచి మూడు పాయింట్లు కోత విధించారు.
దీనివల్ల న్యూజిలాండ్ ర్యాంకింగ్ టేబుల్ లో పడిపోయిందని ఐసీసీ తెలిపింది. ఈ విషయం భారత్ లాభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా 61. 11 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఇప్పుడు 47.92 శాతం పాయింట్లతో ఉంది.
ఇంగ్లండ్ తో జరిగే మరో రెండు మ్యాచ్ లు సైతం ఓడితే..కివీస్ 55. 36 శాతానికి చేరగలదు. అప్పుడు పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా (59.26), ఆస్ట్రేలియా (57.26), శ్రీలంక (50) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయి. క్రైస్ట్ చర్చ్ లో జరిగిన తొలి టెస్టులో ఇరు జట్లు స్లో ఓవర్ రేట్ కు పాల్పడ్డాయని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. "రెండు జట్లకు వారి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించాం.
మూడు కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పోటీ పాయింట్‌ల నుంచి జరిమానా విధించామని ప్రకటించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు మూడు ఓవర్లు తక్కువ వేశారని గుర్తించింది. అందుకే ఇరు జట్లకు చెరో మూడు పాయింట్లలలో కోత విధించింది.
ఇంగ్లండ్ కు అవకాశం లేదు..
తొలి టెస్ట్ లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించినప్పటికీ, వచ్చే ఏడాది లార్డ్స్ లో జరిగే ఫైనల్ కు చేరుకునే అర్హత లేదు. చాలా సిరీస్ లు కోల్పోవడం, డ్రాలు చేసుకోవడంతో పాయింట్ల పట్టికలో ఎక్కడో ఇంగ్లీష్ టీమ్ ఉంది. అయితే తాజాగా మాత్రం ఈ ఓటమి పెద్ద దెబ్బ, ఫలితంగా న్యూజిలాండ్ నాలుగు నుంచి ఐదో స్థానంలోకి పడిపోయింది.
ఇద్దరు కెప్టెన్లు - న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లాథమ్ - ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ స్టోక్స్ - స్లో ఓవర్ రేట్ ను అంగీకరించారు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు అహ్సన్ రజా, రాడ్ టక్కర్, థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్ కిమ్ కాటన్ అభియోగాలు మోపారు, ఎమిరేట్స్ ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన డేవిడ్ బూన్ ఆంక్షలు విధించారు.