హోరెత్తుతున్న సంబరాలు.. అభినందించిన ప్రధాని మోదీ
‘‘అసాధారణ మ్యాచ్ అపూర్వ విజయం’’ అని మోదీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.;
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచింది. ఆఖరి పోరులో న్యూజిల్యాండ్‌ను భారత్ చిత్తు చేయడంతో ఇండియా అంతటా టపాసుల మోత మార్పోగిపోతోంది. తెలంగాణలోని ప్రతి వీధిలో బాణాసంచా కాలుస్తున్నారు. అభిమానుల సంబరాలను ఆకాశమే హద్దుగా మారింది. పాకిస్థాన్ హోస్ట్ చేసిన ఈ టోర్నీలో తొలుత దాయాది దేశాన్ని ఇంటికి పంపేయడంలో టీమిండియా కీలక పాత్ర పోషించడమే కాకుండా పరాజయం అనేది తెలియని జట్టుగా ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో తెలంగాణలోని క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమిండియా విజయాన్ని ప్రతి వీధిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీమిండియాకు అభినందనలు తెలిపారు.
‘‘అసాధారణ మ్యాచ్ అపూర్వ విజయం’’ అని మోదీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. టోర్నమెంట్ సాంతం అద్భుతమైన ప్రదర్శనను భారత ప్లేయర్లు కనబరిచారని ప్రశంసించారు. ‘వన్ టీమ్.. వన్ డ్రీమ్.. వన్ ఎమోషన్’’ అని తెలిపారు.