బోర్డర్ - గవాస్కర్ సిరీస్ లో ఆ ఆటగాళ్లే ఆధిపత్యం చెలాయిస్తారు: హెడెన్

ఈ సారి జరగబోయే బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ ఆధిపత్యం చెలాయిస్తారని ఆసీస్ మాజీ ఒపెనర్ హెడెన్ అభిప్రాయపడ్డారు

Update: 2024-08-22 09:58 GMT

రాబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తమ ఆటతీరుతో ఆధిపత్యం చెలాయిస్తారని ఆసీస్ లెజెండరీ బ్యాట్స్ మెన్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ కాలాల్లో అత్యుత్తమ ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాలను మార్చి వేశారని, ఇప్పుడు అలాగే చేస్తారని అభిప్రాయపడ్డారు. వారు ఇద్దరు ఈ సిరీస్ ను ఎలా ముగిస్తారో చూడాలని తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని హేడెన్ అన్నారు.

" టెస్ట్ క్రికెట్ అనేది మెల్లిగా ఊపందుకునే ఆట. ఆ ఇద్దరు ఆటగాళ్లు(కోహ్లి, స్మిత్) ఇప్పుడు తమ క్రికెట్ కెరీర్‌లోని తరువాతి స్టేజీకి వస్తున్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను, వేసవిలో( ఆసీస్ లో నవంబర్ - ఫిబ్రవరి వేసవి కాలం) స్టేడియాల్లో ఎవరూ ఆధిపత్యం చెలాయిస్తారో నేను చూడాలని అనుకుంటున్నాను. " అని సియాట్ క్రికెట్ రేటింగ్‌లో హేడెన్ అన్నాడు.
నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భారత్ - ఆసీస్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడబోతున్నాయి. 1991-92 తరువాత ఇరు దేశాలు ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఈ సంవత్సరం నుంచే ఆడబోతున్నాయి. ఇంతకుముందు రెండు దేశాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో కేవలం నాలుగు టెస్ట్ లు మాత్రమే నిర్వహించేవారు.
రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయని, నిజంగా ఎవరికి ఎక్కువ అవకాశం ఉందో చెప్పడం చాలా కష్టమని హేడెన్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు ఆసీస్ లో పుజారా, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి వారు ఆధిపత్యం చెలాయించారని అన్నారు.
2014-15లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్‌ను ఆసీస్ గెల్చుకుంది. ఆ తరువాత జరిగిన అన్ని బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను ఇండియా గెలుచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఆసీస్ లో జరిగిన గత రెండు సిరీస్ ల్లోనూ ఇండియా విజయదుందుభి మోగించింది. ఇది ఒకప్పుడు స్టీవ్ వా యుగం కాదు. మ్యాచ్ లు ఎవరి చేతుల్లో ఉంటాయో, ఎలా మలుపు తిరుగుతాయో చెప్పడం కష్టం. నేను అయితే ఆసీస్ గెలవాలని కోరుకుంటున్నాను.
"... (ప్రపంచ) టెస్ట్ ఛాంపియన్‌షిప్ (ఫైనల్) ఆడే అవకాశాన్ని మాత్రమే కాకుండా, ఎవరు పై చేయి సాధిస్తారో వారికి అక్కడ పూర్తి ఎడ్జ్ ఉంటుంది’’ అని హెడెన్ అన్నారు.
నాథన్ లియోన్ vs యశస్వి జైస్వాల్
యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు నాథన్ లియాన్‌ సిద్ధంగా ఉన్నాడని, అయితే జైస్వాల్ తాను భారత క్రికెట్ భవిష్యత్ ఆస్థిని నిరూపించుకోవాలని ఆడతాడని అన్నారు. అయితే ఆసీస్ లో బౌండరీలు ఎక్కువ దూరంగా ఉంటాయని, వాటికి అనుగుణంగా జైస్వాల్ తన షాట్లను ఎంపిక చేసుకోవాలని సూచించాడు.
"అతను బౌన్సీ ట్రాక్‌లలో తన షాట్లను ఎలా సర్దుబాటు చేస్తాడో చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. అతను బంతిని చాలా బలంగా బాదుతాడు. ముఖ్యంగా పుల్ షాట్‌లు బాగా ఆడుతాడని మేము ఐపీఎల్‌లో గమనించాము. కానీ అతడిని ముగ్గురు ప్రపంచ స్థాయి స్పీడ్‌స్టర్లు సవాలు చేస్తారు. వారందరూ ఫిట్‌గా ఉన్నారు.
వార్నర్ ను మిస్ అవుతాం
జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను ఆస్ట్రేలియా మిస్ అవుతుందని హేడెన్ అన్నాడు. "మొదటిసారి, ఇది (ఓపెనింగ్ స్లాట్) అంత సురక్షితంగా అనిపించదు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు గొప్ప సేవను అందించాడు. అతను చాలా పోటీతత్వంతో, అద్భుతంగా డైనమిక్‌గా సేవను అందించాడు," అని హెడెన్ చెప్పాడు.
"నేను 2000లలో సృష్టించిన వారసత్వాన్ని అతను నిజంగా కొత్త స్థాయికి తీసుకువెళ్లాడు, 80 ల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌లు, టాప్ ఆర్డర్‌కు గొప్ప ఊపునిచ్చాడు, లేకుంటే అది చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అతని స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే’’ అని హేడెన్ అన్నారు.
స్మిత్ ఓపెనర్ స్లాట్‌కు ఎంపిక కావడంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని హేడెన్ చెప్పాడు. స్మిత్ తన కెరీర్‌లో ఎక్కువ కాలం నం. 4 లో ఆడాడు, అయితే వార్నర్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత ఓపెనింగ్ స్లాట్‌కు స్మిత్ ప్రమోషన్ పొందాడు.
Tags:    

Similar News