‘స్కై’ ని ఎందుకు కెప్టెన్ గా చేశామంటే? అగార్కర్, గంభీర్ ల...

హర్ఢిక్ పాండ్యా ఫిట్ నెస్ రికార్డు, డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశామని కోచ్ గంభీర్, అజిత్..

Update: 2024-07-22 11:28 GMT

శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎంపిక చేయడం, టీ20లకు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ నియామకం విషయంలో చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కొత్త కోచ్ గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో వివరించారు. ఫిట్ నెస్, డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే టీ20లకు కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశామని వివరించారు. హర్ధిక్ పాండ్యా తరుచుగా గాయాలపాలు కావడంతో కెప్టెన్ విషయంలో పునరాలోచన చేయాల్సి వచ్చిందని అగార్కర్ వివరించారు.

సూర్యను కెప్టెన్‌గా ఎందుకు నియమించారు? అని విలేకరుల సూటిగా అడిగిన ప్రశ్నకు.. ‘‘అతను అర్హులైన అభ్యర్థులలో ఒకడు. మాకు తెలిసిన వ్యక్తి గత ఏడాది కాలంగా డ్రెస్సింగ్ రూమ్ చుట్టూ తిరుగుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మాకు ఫీడ్‌బ్యాక్ వస్తుంది. అతనికి మంచి క్రికెట్ నైపుణ్యం ఉంది. అలాగే అతను ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకడు, ”అని సంయుక్త విలేకరుల సమావేశంలో అగార్కర్ అన్నారు. తమకు ఫిట్‌నెస్ రికార్డు ఉన్న కెప్టెన్ కావాలనీ, పాండ్యాలా తరుచూ గాయాలకు గురయ్యే వ్యక్తి కాదని సెలక్టర్ల ఛైర్మన్ చెప్పారు.
హార్దిక్ పాండ్యా - చాలా ముఖ్యమైన ఆటగాడు
"కానీ హార్దిక్ విషయంలో మా వైఖరి మారలేదు. అతను చాలా కీలక ఆటగాడు. అతను లేకుండా జట్టు వైవిధ్యం తీసుకురాలేము." అని అగార్కర్ చెప్పాడు. కొన్ని సంవత్సరాలుగా హర్ఢిక్ ఫిట్ నెస్ విషయంలో ఆందోళనలు ఉన్నాయి. అందుకే కెప్టెన్ గా వద్దనుకున్నామని వివరించారు.
"తదుపరి T20 ప్రపంచకప్ వరకు మాకు కొంచెం సమయం ఉంది. మేము కొన్ని విషయాలను పరిశీలిస్తాము. ప్రస్తుతానికి తొందరపడటం లేదు. హార్దిక్ ప్రదర్శనలు చాలా ముఖ్యమైనవి. కెప్టెన్ వెనుక ఉన్న ఆలోచన ఇదే. మ్యాచ్ కు అందుబాటులో ఉండే ఆటగాడినే మేము ఎంచుకున్నాం" అని అగార్కర్ చెప్పారు. మరో రెండేళ్లలో మరో టీ20 ప్రపంచకప్ స్వదేశంలో ఉంది.దీనికి ఇప్పటి నుంచి జట్టును సన్నద్దం చేయాల్సి ఉంది. మాకు కొంచెం ఎక్కువ సమయం ఉంది. అందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
జడేజాను వదులుకోలేదు
టీ20 ప్రపంచకప్ తరువాత టీ20లకు సీనియర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే తాజాగా శ్రీలంక పర్యటనకు ప్రకటించిన వన్డే జట్టులో అతడి పేరు లేదు. దీనితో జడేజా కేవలం టెస్ట్ లకే పరిమితమా? అన్న చర్చ మొదలైంది. అయితే దీనిపై సెలక్టర్లు క్లారిటీ ఇచ్చారు.
జడేజాను వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పించలేదని వివరణ ఇచ్చారు. శ్రీలంకతో జరిగే చిన్న సిరీస్ కు జడేజా, అక్షర్ లను తీసుకోవడం సబబుకాదని అనిపించింది. జడ్డూ ప్రతిభ మాకు తెలుసు. అతను నాణ్యమైన స్పిన్ ఆల్ రౌండర్. అతన్ని జట్టు నుంచి తప్పించలేదని పేర్కొన్నారు.
ఈ సిరీస్ తరువాత వరుసగా పది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో జడ్డూ కీలకం కానున్నాడు. అతనికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వడం కోసమే ఈ సిరీస్ నుంచి తప్పించామనే అర్థంలో గంభీర్, అగార్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పాండ్యా, రాహుల్, పంత్ లకు నాయకత్వ తలుపులు మూసుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పంత్ గాయం తరువాత కోలుకుని మునపటి ఫామ్ ను అందుకున్నాడు. అతని ప్రతిభ మాకు తెలుసు. ఒక సంవత్సరం తరువాత వచ్చి క్రికెట్ ఆడుతున్నఆటగాడిపై మేము భారం పెట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. రాహుల్ కొంత కాలంగా టీ20 టీమ్ లో ఆడట్లేదని వివరించారు
గిల్ నేర్చుకునే అవకాశం
వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనుభవంతో పాటు సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా నేర్చుకోవాలని సెలక్టర్లు కోరుకుంటున్నారని అగార్కర్ అన్నాడు.
"శుభ్ మన్ మూడు-ఫార్మాట్ ఆటగాడిగా మేము భావిస్తున్న ఒక వ్యక్తి. గత సంవత్సరంలో చాలా బాగా ఆడాడు. అది డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం." అని అగార్కర్ అన్నారు. ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్ల నుంచి శుభ్ మన్ అనేక విషయాలు నేర్చుకుంటాడని చెప్పారు.
"అతను కొన్ని మంచి నాయకత్వ లక్షణాలను కనబరిచాడు. మేము అతనిని ముందుకు తీసుకు వెళ్లి ప్రయత్నించాలనుకుంటున్నాము. జీవితంలో ఎటువంటి హామీలు లేవు, కానీ ఈ సమయంలో, అదే ఆలోచన," అని అగార్కర్ చెప్పాడు.
భవిష్యత్ పేస్ బౌలింగ్ కలయిక
భారత్‌లో టెస్టులు ఆడుతున్నప్పుడు, జట్టుకు ముగ్గురు సీమర్లు అవసరం ఉండకపోవచ్చని, అయితే ఫాస్ట్ బౌలింగ్ లైనప్ గురించి కూడా చర్చిస్తామని అగార్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. "కొందరు ఫాస్ట్ బౌలర్లు NCAలో ఉన్నారు. వచ్చే నెలలోపు వారు తిరిగి ఆడతారని మేము ఆశిస్తున్నాము" అని చెప్పాడు.
"మహ్మద్ షమీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ఇది మాకు మంచి సంకేతం. సెప్టెంబర్ 19న జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కు అతను ఫిట్ నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే దీనిపై ఎలాంటి డెడ్ లైన్ లేదని వివరించారు. భారత్ లో ఆడబోయే టెస్ట్ లకు ముగ్గురు సీమర్లు అవసరం లేదని అన్నారు.
కోహ్లితో గంభీర్ అనుబంధం
విరాట్ కోహ్లీ- ప్రధాన కోచ్ గౌతం గంభీర్ మధ్య సంబంధాలు సరిగా లేవని అని అడిగిన ప్రశ్నకు వారు సమాధానమిస్తూ అవన్నీ మీడియా అపోలే అని కొట్టిపారేశారు. వారు ఇద్దరు ఇప్పుడు ఒకే జట్టులో ఉన్నారని, అభిప్రాయ బేధాలు ఉండే ప్రశ్నే లేదని అన్నారు.
“పుకార్లు టిఆర్‌పికి మంచివి, కానీ అతనితో నా సంబంధం బాగానే ఉంది. ముఖ్యమైనది ఏమిటంటే మనం 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేము ఫోన్ మాట్లాడుకున్నాం. అభిప్రాయాలను పంచుకున్నాము. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు, అతనిపై నాకు చాలా గౌరవం ఉంది' అని గంభీర్ అన్నాడు.
Tags:    

Similar News