పాకిస్తాన్ నుంచి చాంఫియన్స్ ట్రోఫి తరలిపోతుందా?

ఐసీసీ చాంఫియన్స్ ట్రోఫి పాకిస్తాన్ వేదికగా జరగబోతుందా లేదా అనుమానాలు మొదలయ్యాయి. కొత్తగా ఆఫ్రికా దేశంలో టోర్నిని నిర్వహించాలని ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి..

Update: 2024-11-12 10:21 GMT

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి విషయంలో పాకిస్తాన్(Pakistan) కు షాక్ తగిలే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి ఆ దేశ మీడియా. వచ్చే ఏడాది మార్చి లో దాయాదీ దేశంలో క్రికెట్ పండగ జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ భారత జట్టు అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి సమాచారమిచ్చింది. ఇదే నిజమైతే టోర్నిని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తప్పించి దక్షిణాఫ్రికా వేదికగా ప్రకటించవచ్చని డాన్ పత్రిక కథనం ప్రచురించింది.

పాకిస్తాన్ ప్రభుత్వం ..
భారత జట్టు పాకిస్తాన్ రావడానికి మోదీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున ఇకముందు జరగబోయే అన్ని ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ భారత జట్టుతో క్రికెట్ ఆడకూడదనే షరతు విధించబోయే అవకాశం ఉందని ఓ అధికారిక నివేదిక ను ఉటంకిస్తూ అక్కడి వార్తా పత్రికలు కథనాన్ని ప్రచురించాయి.
హైబ్రిడ్ మోడల్ కు ఐసీసీ ప్రతిపాదన..
ఐసీసీ చాంఫియన్ ట్రోఫి సజావుగా జరగాలంటే పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ ను పరిశీలించాలని, దానిపై మీ అభిప్రాయం చెప్పాలని ఐసీసీ కోరినట్లు కూడా తెలుస్తోంది. భారత్ టోర్నికి రావట్లేదని తమకు అధికారికంగా మెయిల్ వచ్చిందని ఐసీసీ వెల్లడించింది.
తమ దేశంలో ట్రోఫి నిర్వహించాలని భావిస్తే ఇండియా ఆడబోయే మ్యాచ్ లను దుబాయ్ లేదా యూఏఈ లో నిర్వహించాలని, ఫైనల్ మాత్రం దుబాయ్ లో జరగాలని ఇది ప్రస్తుత ప్రణాళికను పరిశీలించాలని ఐసీసీ కోరినట్లు అని సోమవారం పిటీఐ కూడా కథనం ప్రచురించింది.
"ఫైనల్‌ను పాకిస్తాన్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహిస్తేనే హైబ్రిడ్ మోడల్ తమకు ఆమోదయోగ్యమని భారత క్రికెట్ బోర్డు కూడా ఐసిసికి తెలిపినట్లు సమాచారం.
పీసీబీ మాత్రం మొండిగా..
భారత జట్టు పాకిస్తాన్ రావట్లేదని సమాచారం అందినప్పటికీ పీసీబీ మాత్రం ఎలాంటి స్పందన తెలియజేయకుండా మౌనంగా ఉంది. మ్యాచ్ ఫీజులు, హోస్టింగ్ ఫీజుల్లో ఎక్కువ భాగం పాకిస్తాన్ కు ఎక్కువ ఇస్తామని ఐసీసీ చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.
భారత్ ఆడబోయే అన్ని మ్యాచులను లాహోర్ లో నిర్వహిస్తామని, మీరు అమృత్ సర్ లో ఉండమని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే బీసీసీఐ దీనికి కూడా ఒప్పుకోలేదని సమాచారం.
ఈవెంట్‌ని దక్షిణాఫ్రికాకు మారుస్తున్నారా?
భారతదేశం నిరాకరించిన కారణంగా టోర్నమెంట్‌ను నిర్వహించకుండా PCB వైదొలగాలని నిర్ణయించుకుంటే, ICC మొత్తం ఈవెంట్‌ను దక్షిణాఫ్రికాకు తరలించడానికి సిద్ధంగా ఉందని డాన్ తెలిపింది. హైబ్రిడ్ మోడల్ గురించి పాకిస్తాన్ అసలు చర్చించలేదని, ఐసీసీ ఈ విషయంపై స్పష్టత కోరుతోందని తెలుస్తోంది.
"ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ సిస్టమ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని కలిగి నిర్వహించడం గురించి ఎటువంటి చర్చ లేదు" అని విశ్వసనీయ పిసిబి వర్గాలు పిటిఐకి తెలిపింది.
పాకిస్థాన్‌లో ఊహాగానాలు..
"ప్రస్తుతం మొత్తం పరిస్థితిని పిసిబి అంచనా వేస్తోంది. తదుపరి దశపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’. ఇంతలో, పాకిస్తాన్ ప్రభుత్వం పిసిబికి భారత్‌తో ఆడకుండా ఉండమని సలహా ఇవ్వడం లేదా జెనీవాలోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో ఐసిసి, బిసిసిఐకి వ్యతిరేకంగా కేసు దాఖలు చేసి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్థాన్‌కు వెళ్లలేదు. ICC టోర్నమెంట్లలో మాత్రమే రెండు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.
Tags:    

Similar News