టెస్ట్ జట్టు కెప్టెన్ గా యువ ఆటగాడు శుభ్ మన్ గిల్

ఇంగ్లాండ్ లో పర్యటించబోయే జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ;

Update: 2025-05-24 12:20 GMT
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్

ఇంగ్లాండ్ తో ప్రారంభం అయ్యే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు కొత్త కెప్టెన్ గా యువ ఒపెనర్ శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇతనికి డిప్యూటీగా రిషబ్ పంత్ గా నియమించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ నుంచి రిటైర్ అవడంతో ఏర్పడిన గ్యాప్ ను పూరించడానికి సెలక్టర్లు ఊహించిన విధంగానే వ్యవహరించారు.

చాలాకాలం తరువాత కరుణ్ నాయర్ ను మరోసారి జట్టులోకి తీసుకున్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత నాయర్ జట్టులోకి ప్రవేశించాడు. అలాగే శార్ధూల్ ఠాకూర్ సైతం తిరిగి జట్టులోకి వచ్చాడు. వీరు ఇద్దరు దేశీయ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు, వికెట్లు సాధించారు.
కరుణ్ నాయర్ కౌంటీ క్రికెట్ లో కూడా చాలా బాగా పరుగులు సాధించడం, విరాట్, రోహిత్ రిటైర్ అవడంతో మరోసారి జట్టులోకి వచ్చాడు. చెన్నైలో 2017 లో ఇదే ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్ట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దేశంలో సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ మాత్రమే కావడం గమనార్హం.
సాయి సుదర్శన్ తొలిసారిగా టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అలాగే లెప్ట్ ఆర్మీ పేసర్ అర్ష్ దీప్ సింగ్ కూడా టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్ కు ఫిట్ గా లేని షమీని ఎంపిక చేయలేదు.
అద్భుతమైన ఆటగాడు..
‘‘గత సంవత్సరం నుంచి మేము శుభ్ మన్ గిల్ నాయకత్వం చూశాము. అతను జట్టును ముందుకు నడిపిస్తాడని మేము ఆశిస్తున్నాము. ఇది ఒత్తిడితో కూడుకున్న పని, కానీ అతను అద్భుతమైన ఆటగాడు. మేము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము’’ అని జట్టును ఎంపిక చేసిన తరువాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో చెప్పారు.
పేసర్ షమీ గురించి మాట్లాడుతూ... అతని పనిభారం, మెడికల్ ఫిట్ నెస్ దృష్ట్యా అందుబాటులో ఉంటాడని ఆశించాము. కానీ దురదృష్టకరం ప్రస్తుతానికి ఫిట్ గా లేడని చెప్పారు.
ఆసీస్ పర్యటనలో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్ లకు ఇంగ్లాండ్ పర్యటనలో చోటు దక్కించుకోలేదు. అలాగే శ్రేయస్ పేరు కూడా టెస్ట్ జట్టులోకి పరిగణలోకి తీసుకోలేదు.
అలాగే ఇషాన్ కిషన్ పేరు ను కూడా జట్టులోకి తీసుకోలేదు. వీరు ఇంతకుముందు బీసీసీఐ ఆదేశాల ప్రకారం దేశీయ క్రికెట్ ఆడాలనే నిబంధన పట్టించుకోకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారు. కానీ తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది.  
జట్టు: శుభ్ మన్ గిల్,(కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్ దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్
ఇంగ్లాండ్ పర్యటన వివరాలు..
జూన్ 20-24: మొదటి టెస్ట్: లీడ్స్
జూలై 2-6 : రెండో టెస్ట్: బర్మింగ్ హామ్
జూలై 10-14: మూడో టెస్ట్: లార్డ్స్
జూలై 23-27 : నాలుగో టెస్ట్: మాంచెస్టర్
జూలై 31- ఆగష్టు 5: ఐదో టెస్ట్: ఓవల్
Tags:    

Similar News