తెలంగాణకి నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్

తమిళిసై సౌందరరాజన్ రాజీనామాని రాష్ట్రపతి ఆమోదించారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కి అదనపు బాధ్యతలు.

Update: 2024-03-19 06:18 GMT

తమిళిసై సౌందరరాజన్ రాజీనామాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణకి రెగ్యులర్ గవర్నర్ ని నియమించేవరకు రాధాకృష్ణన్ అదనపు గవర్నర్ గా కొనసాగనున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపగా.. నేడు ఆమోదం లభించింది. తమిళిసై స్థానంలో సీపీ రాధాకృష్ణన్ కి అదనపు బాధ్యతలు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. సీపీ రాధాకృష్ణన్ బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి ఆమెని పోటీ చేయించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై సెంట్రల్‌ స్థానాల్లో ఒక స్థానం నుంచి తమిళిసై పోటీచేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News