ఫెడరల్‌ సర్వే: మహారాష్ట్ర, గుజరాత్‌లలో బీజేపీదే పైచేయి

ఫెడరల్‌-పుతియతలైమురై-యాప్ట్‌-2024 ప్రీ-పోల్‌ సర్వే: 2019 కంటే ఈ ఏడాది రెండు పశ్చిమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మరికొన్ని సీట్లు కోల్పోవచ్చని సూచించింది.

Update: 2024-02-14 13:54 GMT






గుజరాత్‌, మహారాష్ట్రలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన బీజేపీకి.. రాబోయే ఎన్నికల్లో అదే ఫలితాలు రిపీట్‌ అయ్యేలా ఉన్నాయి. ఓట్ల శాతం, గెలిచిన సీట్లు రెండిరటిలోనూ పార్టీ లాభపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

మహారాష్ట్ర: ఐదేళ్ల మథనం

రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితుల తర్వాత మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 2019-2024 మధ్య రెండు ప్రధాన పార్టీలు నిలువుగా చీలిపోయాయి. శివసేన` ఉద్ధవ్‌ థాకరే, ఏక్నాథ్‌ షిండే వర్గాలుగా, శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్పీపీ) రెండుగా చీలిపోయింది.


ఇప్పటి రాజకీయ పరిస్థితులు 2019 సార్వత్రిక ఎన్నికలకు చాలా భిన్నంగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌తో జతకట్టిన శివసేన, ఎన్‌సీపీ కీలక మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపీఏ) మధ్య హోరాహోరీ పోరు జరిగింది. శివసేన ఒక వర్గం, అలాగే ఎన్‌సీపీలో ఒక్కో వర్గం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి.


సర్వే చెబుతున్నట్లుగా ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ మూల్యం చెల్లించుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ఓట్ల శాతం 36 కాగా, కాంగ్రెస్‌ ఓట్ల శాతం 17 కంటే రెండిరతలు ఎక్కువ. మిత్రపక్షాలైన శివసేన యూబీటీ (10 శాతం), శరద్‌ పవార్‌ ఎన్‌సీపీ (6.4)ల ఓట్ల శాతాన్ని జోడిరచినా కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో 40 స్థానాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కైవసం చేసుకుంటుందని, మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ) బ్యాలెన్స్‌ సీట్లను కైవసం చేసుకుంటుందని ఫెడరల్‌ సర్వే అంచనా వేసింది. ఎంవీఏ అనేది కాంగ్రెస్‌ కూటమి. శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ థాకరే ఒక వర్గం కాగా.. ఎస్పీపీ, శివసేన మరో వర్గం.

గుజరాత్‌: యథాస్థితి కొనసాగే అవకాశం ఉంది

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ఫెడరల్‌-పుతియాతలైమురై ప్రీ-పోల్‌ సర్వే సూచిస్తుంది. ఓట్‌ షేర్‌ పరంగా చూస్తే.. 2019లో సాధించిన 63 శాతం కంటే ఎక్కువగా సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.


అలాగే.. కాంగ్రెస్‌ ఈ సారి ఓట్‌ షేర్‌ శాతం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2019లో 33 శాతం నుంచి ఇప్పుడు 23 పడిపోవచ్చని సర్వే ద్వారా తెలుస్తుంది.


2019లో గుజరాత్‌ రాష్ట్రంలో విస్తరించాలని ప్రయత్నించిన ఆప్‌ ఇంకా ఆ దిశగా పురోగతి సాధించలేదని తెలుస్తోంది. 2019లో 26 లోక్‌సభ స్థానాలను బీజేపీకి ఇచ్చిన గుజరాత్‌ ఈ ఏడాది కూడా ఆ గౌరవాన్ని పునరావృతం చేయనుందని సర్వే చెబుతోంది.

Tags:    

Similar News