తిరుపతి : వారాహి డిక్లరేషన్ లీక్ ..? పవన్ అడుగులు ఎటు?
జనసేన ప్రస్థానం ఇకపై ఎటు? ఆ అజెండా మారబోతోందా? తిరుపతిలో పవన్ కల్యాణ్ ఇంకొన్ని గంటల్లో వారాహి డిక్లరేషన్ -2024 ప్రకటించనున్నారు. అందులో అంశం లీక్ చేశారా?
సేన అంటే ప్రజాసైన్యం. ప్రశ్నించే గొంతుక. ఆ లక్ష్యంతో పార్టీ ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చాక మాట మారింది. హిందూత్వ అజెండాను భుజానికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం ఇంకొన్ని గంటల్లో తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించే అంశాలు స్పష్టం చేయనున్నాయి.2014 ఎన్నికల నుంచి బీజేపీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. జనసేన ఆవిర్భావం నుంచి పదేళ్ల ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే పవన్ కళ్యాణ్ ప్రశ్నించే గొంతుకగా నిలిచారు.ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన "టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు" అని వైసీపీ సూటిగా ప్రశ్నించింది. వాటికి కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో దీటుగానే సమాధానం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇరకాటంలో కూడా పడ్డారు.
2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ 21 సీట్లకు పోటీ చేసి, అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ఆయన స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నోట హిందుత్వం, సనాతన ధర్మం, ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో .. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన మూడు నెలల తర్వాత
"వారాహి డిక్లరేషన్" ను చాలా సీరియస్గా తీసుకోవాలని మరియు భారతదేశం అంతటా దాని గురించి అవగాహన పెంచుకోవాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను... APలో హిందువులు & హిందూ సంప్రదాయాలు వేగంగా తగ్గుముఖం పట్టాయి. వారాహి డిక్లరేషన్ హిందూ స్పృహ యొక్క పునరుజ్జీవనం (ప్రారంభం) మరియు దానిని అట్టడుగు స్థాయి నుంచి రక్షించే దిశగా మొదటి అడుగు" అని ఎక్స్ వేదిక గా ట్వీట్ చేశారు.