తెలంగాణలో మాక్ పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో సోమవారం తెల్లవారుజామున అయిదు గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సాగిన మాక్ పోలింగ్ అనంతరం అసలు పోలింగ్ ఆరంభించనున్నారు.

Update: 2024-05-13 00:17 GMT
తెలంగాణలో మాక్ పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు.

- తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఆరున్నర గంటల దాకా మాక్ పోలింగ్ జరిపి అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్లాపూర్ పోలింగ్ కేంద్రం అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- తెలంగాణ వ్యాప్తంగా
3,32,32,318 మంది ఓటర్లు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల బరిలో 535 మంది అభ్యర్థులు
తెలంగాణలో పార్లమెంట్ పోరులో 535 మంది అభ్యర్థులు నిలిచారు. భారీ పోలీసుల పహరా మధ్య పార్లమెంట్ పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 535 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 50 మంది మహిళా అభ్యర్థులు ఈ సారి పార్లమెంట్ బరిలో నిలిచారు.

భారీ బందోబస్తు మధ్య పోలింగ్
164 కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు 73,414 మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించారు. తెలంగాణలో పలు మోడల్, మహిళ, పిడబ్లుడి, యూత్ మేనేజెడ్ పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 12 థిమెటిక్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పలు అసంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ముస్తాబు చేశారు.

గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతి
ఆదివారం రాత్రి గుండెపోటుతో ఓ ఎన్నికల అధికారి మరణించారు. హైదరాబాద్ నగరంలోని రెడ్ హిల్స్ బూత్ నంబర్ 151 లో ముషీరాబాద్ తెలంగాణ మైనారిటీ బాలుర స్కూల్ కి చెందిన ప్రిన్సిపాల్ నర్సింహ ఎలక్షన్ డ్యూటీలో గుండెపోటు, డీహైడ్రేషన్‌తో మరణించారు. ఎన్నికల అధికారులు అప్రమత్తమై మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా రెడ్ హిల్స్ పోలింగ్ కేంద్రానికి మరో ఎన్నికల అధికారిని నియమించారు.


Tags:    

Similar News