‘రాహుల్ ఓటు ఆప్‌కు, కేజ్రీవాల్ ఓటు కాంగ్రెస్‌కు’

’’ఆప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రజలు విద్యుత్, మందులు, నీరు, పాఠశాల ఫీజులపై నెలకు రూ. 18,000 ఆదా చేశారు.’’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.

Update: 2024-05-22 06:30 GMT

దేశ రాజధానిలో పోలింగ్ వేళ..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు, అలాగే రాహుల్ గాంధీ ఆప్‌కు ఓటు వేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.

కంటి శస్త్రచికిత్స చేయించుకుని యుకె నుంచి తిరిగి వచ్చిన చద్దా.. తమ పార్టీ లోక్‌సభ అభ్యర్థి సాహిరామ్ పహల్వాన్‌కు మద్దతుగా దక్షిణ ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ప్రసంగించారు.

“ఈ ఎన్నికలు దేశ, రాజ్యాంగ పరిరక్షణకు చాలా ముఖ్యమైనవి. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నా సోదరుడు మంచి వ్యక్తి. అందుకే ఆయనకు మద్దతు తెలిపేందుకు ఇక్కడకు వచ్చా. మీ ఓటుపైనే మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని’’ అన్నారు.

ఆప్‌కు మద్దతివ్వండి..

“ఆప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రజలు విద్యుత్, మందులు, నీరు, పాఠశాల ఫీజులపై నెలకు రూ. 18,000 ఆదా చేశారు. అలాగే మహిళలు బస్సు ప్రయాణ ఖర్చులను కూడా ఆదా చేశారు. అందుకు ప్రతిగా మేం అడుగుతున్నది ఒక్కటే. 25వ తేదీన ఆప్ ఎన్నికల గుర్తు చిరుపుపై బటన్ నొక్కి కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా.’’ అని అభ్యర్థించారు.

25న ఎన్నికలు..

2019లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చద్దా బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్-ఆప్ కూటమి విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్నివ్యక్తం చేసిన చద్దా ..ఈసారి దక్షిణ ఢిల్లీలో అత్యధిక మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి

Tags:    

Similar News