తేజ సజ్జా ‘మిరాయ్’ ఆరవ రోజు కలక్షన్లు
ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లు దాటి 'మిరాయ్రి' రికార్డు సృష్టించింది
తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం మిరాయ్ థియేటర్లలో విడుదలైనతర్వాత ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లు దాటి రికార్డు సృష్టించింది. 2025లోని వేఎక్కువ వసూళ్ళు తెచ్చిన సినిమాగా నిలిచింది. సినిమా వెబ్సైట్ సాక్‌నిల్‌క్ సమాచారం ప్రకారం, మిరాయ్ ఆరవ రోజు (బుధవారం)లో భారత దేశంలో ₹4.5 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఇది ఇప్పటివరకూ ఒక్కరోజులో వచ్చిన తక్కువ కలక్షన్. ఆరు రోజులలో మొత్తం భారతీయ కలెక్షన్ ₹61.50 కోట్లు నెట్ కు చేరింది. వారం మధ్యన కలెక్షన్లు కొద్దిగా తగ్గడం కనిపించినా, ఇంకా ట్రెండ్ లోనే ఉంది ‘మిరాయ్.’
థియేటర్ ఆక్యుపెన్సీ
తెలుగు రాష్ట్రాల్లో సగటు 20.69% ఆక్యుపెన్సీ నమోదైంది.
ఉదయం షోలు: 13.96%, మధ్యాహ్నం: 21.02%, సాయంత్రం: 20%, రాత్రి: 27.1%.
మహబూబ్‌నగర్ ప్రాంతం అత్యధిక ఆక్యుపెన్సీ చూపిస్తూ సినిమా ప్రాధాన్యతను రుజువు చేసింది.
హిందీ మార్కెట్లలో కూడా 11.58% ఆక్యుపెన్సీ నమోదు, సినిమా ఇతర భాషా ప్రేక్షకుల మధ్య కూడా ఆకర్షణను సాధిస్తోంది.
రోజు వారీ కలెక్షన్ (భారతీయ నెట్)
మొదటి రోజు : ₹13 కోట్లు
రెండవ రోజు : ₹15 కోట్లు
మూడవ రోజు : ₹16.6 కోట్లు
నాలుగవ రోజు : ₹6.4 కోట్లు
ఐదవ రోజు : ₹6 కోట్లు
ఆరవ రోజు : ₹4.5 కోట్లు
మొత్తం: ₹61.50 కోట్లు
కార్తీక్ ఘట్టమనేని రచన, దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ ఒక ఫ్యాంటసీ యాక్షన్‑అడ్వెంచర్ సినిమా. పురాణ కథనాలను సూపర్‌హీరో థీమ్‌తో కలిపి తీసిన సినిమా ఇది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మనోజ్ మంచు, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్, రితిక నాయక్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫాక్టరీ ద్వారా ఈ సినిమా సెప్టెంబర్ 12న బహుభాషాలలో విడుదలై, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రేక్షకుల నుండి వచ్చిన వర్డ్ ‑ఆఫ్‑మౌత్ ప్రభావం ,అలాగే భవిష్యత్తులో సీక్వెల్ వల్ల ఏర్పడిన ఆసక్తితో, మిరాయ్ బాక్స్‌ఆఫీస్ చర్చల్లో నిలిచే ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కొంత డ్రాప్ రేట్ కనిపిస్తున్నా, రెండవ వీకెండ్‌లో ప్రేక్షకులు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పెరిగితే మాత్రం ఈ సినిమా 2025లో టాప్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
* * *