కరీంనగర్ రోడ్లపై వరిసాగు

దుంపేటి రాము కుటుంబం చుట్టుపక్కల వాళ్ళతో కలిసి రోడ్డుపై బైఠాయించటమే కాకుండా రోడ్లలోని గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు;

Update: 2025-09-18 07:54 GMT
Paddy sowing on Karimnagar Corporation roads

రోడ్లతీరును బట్టి రాష్ట్రాభివృద్ధిని చెప్పచ్చు. ఇపుడు విషయం ఏమిటంటే తమ డివిజన్లో రోడ్లు సరిగా లేవని, రిపేర్లు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్న కోపంతో ఒక కుటుంబం రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపింది. ఈఘటన ఎక్కడ జరిగిందంటే కరీంనగర్(Karimnagar) కార్పొరేషన్ తొమ్మిదివ డివిజన్లోని అల్కాపురిలో జరిగింది. అల్కాపురిలో కాపురం ఉంటున్న దుంపేటి రాము కుటుంబం చుట్టుపక్కల వాళ్ళతో కలిసి రోడ్డుపై బైఠాయించటమే కాకుండా రోడ్లలోని గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. వీళ్ళ నిరసన చుట్టుపక్కల వారిని ఆకర్షించటంతో రోడ్డుపై వెళ్ళే వాళ్ళు బహుశా బాధితులే అయ్యుంటారు అంతా మద్దతుగా నిలిచారు.త

అల్కాపురిలోని రాము దంపతులు వారి ఇద్దరి పిల్లలు కూడా రోడ్డుపైన రోడ్లరిపేర్లు చేయించాలనే డిమాండున్న ప్ల కార్డులను ప్రదర్శిస్తు గుంతల్లోనే కూర్చున్నారు. అలాగే పెద్ద గుంతలో తనకుటుంబంతో కలిసి వరినాట్లు వేశారు. రోడ్లపైన గుంతలను పూడ్చాలని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదని రాము వాపోయారు. గుంతలవల్ల తమకు చాలా అనారోగ్యసమస్యలు వస్తున్నాయని మండిపోయారు. ఆస్తిపన్నులు, నీటిపన్ను వసూళ్ళల్లో ఉన్న శ్రద్ధ రోడ్ల రిపేర్లపై అధికారులకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెల్లిస్తున్న పన్నులతో పౌరసకార్యలు కల్పించనపుడు తాము ఇక పన్నులు ఎందుకుకట్టాలని మున్సిపల్ అధికారులను నిలదీశారు.


తాముంటున్న ప్రాంతమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో చాలాచోట్ల రోడ్లపై పెద్ద గుంతలున్నట్లు రాము ఆరోపించారు. రోడ్లను రిపేర్లు చేయాలని ఎన్నిసార్లు కలిసి అడిగినా ఎలాంటి ఉపయోగం కనబడలేదన్నారు. అందుకనే రోడ్డుపై బైఠాయించటంతో పాటు వరినాట్లు వేసి నిరసన తెలుపుతున్నట్లు అక్కడివాళ్ళు చెప్పారు. రోడ్లకు వెంటనే రిపేర్లయినా చేయాలి లేదా తాము కట్టిన పన్నులను వెంటనే వాపసైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలు పడినపుడు రోడ్లపైన ప్రయాణం కూడా చేయలేకపోతున్నట్లు రాముతో పాటు చుట్టుపక్కలవాళ్ళు ఫిర్యాదుచేశారు. రాము కుటుంబంతో పాటు అల్కాపురి వాసుల నిరసనను మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News