ద ఫెడరల్ సర్వే.. మీరు ఇష్టపడే భారతదేశ ప్రధాని ఎవరు?
నరేంద్ర మోదీకి మొదటి స్థానం ఆ తర్వాతి స్థానాల్లో వాజ్‌పేయి, ఇందిరా గాంధీ ఉన్నారని ఫెడరల్-పుతియ తలైమురై-ఆప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే పేర్కొంది.;
లోక్‌సభ ఎన్నికలకు ముందు కుల గణన కీలకంగా మారింది. దానికి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తుంది.
ఇక వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే అంశం. దీన్ని అమలు చూసేందుకు కేంద్రం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు దెబ్బతింటుందని అభిప్రాయం ఉంది.
వీటిపై భారతీయ ఓటరు ఏమనుకుంటున్నాడు. పార్టీ నాయకుల ప్రతిభా పాటవాలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయా? 76 ఏళ్ల భారతావనిలో మీరు ఇష్టమైన నాయకుడు ఎవరు?
ఫెడరల్ దాని అనుబంధ సంస్థ పుతియ తలైమురై దేశం నాడిని అంచనా వేయాలనుకుంది. అందులో భాగంగా అడిగిన కొన్ని ప్రశ్నలకు జనం ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న 1: కుల గణన
ప్రతిపక్ష పార్టీలు సూచించే కుల గణనను మీరు ఆమోదిస్తారా?
స్పందించినవారిలో దాదాపు 37 శాతం మంది అవునని చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో దాదాపు 55 శాతం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నారు. కుల గణనను సమర్థించిన వారిలో అత్యధికంగా 43 శాతం మంది తూర్పు భారతంలో ఉన్నారు. 63 శాతం మంది దక్షిణాది నుంచి ‘నో’ అని సమాధానం ఇచ్చారు.
ప్రశ్న 2: ఒక దేశం, ఒకే ఎన్నికలు
వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదనను అమలు చేయాలన్న కేంద్రం ఆలోచనను మీరు ఆమోదిస్తున్నారా?
అఖిల భారత స్థాయిలో స్పందించిన వారిలో దాదాపు 62 శాతం మంది ఇందుకు ఆమోదం తెలిపారు. 30 శాతం కంటే తక్కువ మంది వద్దని చెప్పారు.
కేవలం దక్షిణాదిలో కొన్ని రిజర్వేషన్లు కనిపిస్తున్నాయని, 51 శాతం మంది మాత్రమే ఇందుకు ఓకే చెబుతున్నారు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలో రెండు - కర్ణాటక, తెలంగాణ.
అయితే పశ్చిమ రాష్ట్రాల నుంచి గరిష్ట మద్దతు దాదాపు 71 శాతం లభిస్తోంది.
ప్రశ్న 3: ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు?
మీ అభిప్రాయం ప్రకారం ప్రతిపక్ష నేతల్లో ఎవరు మంచి ప్రధాని అభ్యర్థి?
ఇక్కడ చెప్పలేను/తెలియదు అని గరిష్ఠంగా 27 శాతం ఓట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ సరైన అభ్యర్థి అని దక్షిణాది నుంచి 25 శాతం మంది పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో అరవింద్ కేజ్రీవాల్‌కు దాదాపు 17 శాతం మద్దతు తెలిపారు.
మిగిలిన వారికి ఆయా రాష్ట్రాలు/ప్రాంతాల నుంచి కొంత మద్దతు లభించినట్లు కనిపిస్తోంది.
ప్రశ్న 4: ఆల్ టైమ్ ఫేవరెట్ పీఎం
భారతదేశంలో మీకు ఇష్టమైన ముగ్గురు ప్రధానుల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రధాని ఎవరు?
దాదాపు 62 శాతం అధికారంలో ఉన్ననరేంద్ర మోదీ తమ ఫేవరేట్ పీఎం అని చెప్పారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల నుంచి ఆయనకు 60 శాతానికి పైగా మద్దతు లభించింది.
మోదీ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయికి 48 శాతం, ఇందిరా గాంధీకి 42 శాతం మద్దతు తెలిపారు.
రాష్ట్రాల వారీగా సంఖ్యలు
మేము రోజూ ఈ సర్వే గురించి చర్చలను నిర్వహిస్తున్నాం. వీటిని మీరు చూడవచ్చు.
రేపటి నుంచి మేము 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా చేసిన సర్వే ఫలితాలను ఉంచబోతున్నాం. వాటిని మీరు చూడొచ్చు.