తిరుమల : బ్రహ్మోత్సవాల భద్రతపై దృష్టి... ఎంతమంది పోలీసులో తెలుసా... !
తిరుమల శ్రీవారి బ్రహ్మెత్సవాలకు అసాధరణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పోలీసులను రప్పించనున్నారు.
తిరుమల శ్రేవేంకటేశ్వరస్వామి బ్రహ్మత్సవాలకు ఈ నెల నాల్గవ తేదీ అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ నెల రోజుల నుంచి ఏర్పాట్లలో ఉంది. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా అనేక వసతులపై దృష్టి సారించింది. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రకులకు కూడా ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తోంది. వారి భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసులను కూడా బందోబస్తు విధుల్లో నియమించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. టీటీడీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు తోడుగా పోలీస్ శాఖ కూడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉండే రీతిలో భద్రతపై కన్నేసింది.
తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గోకులం సమావేశ మందిరంలో సమీక్ష సమీక్షించారు. మంగళవారం ఆయన తిరుమల కొండపై టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగంతో పాటతు లా అండ్ ఆర్డర్ అధికారులతో సమీక్షించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముషిబాజ్ పాయ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు., టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి అదనపు ఎస్పీ వెంకటరావు (పరిపాలన), తిరుమల అదపు ఎస్పీ రామకృష్ణ ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, టీటీడీ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం..
డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో 5,145 మందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారికి ఈ నెల నాల్గవ తేదీ సీఎం ఎన్. చంద్రబాబు పట్టుస్త్రాలు సమర్పించడానికి రానున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..