తెలంగాణలో 200కుపైగా జాతుల పక్షులు కనిపించిన వేళ...
తెలంగాణలో 200కు పైగా స్థానిక జాతుల రంగురంగుల పక్షులున్నాయని పక్షుల దినోత్సవం సందర్భంగా వెల్లడైంది. పక్షుల కిలకిల రావాలతో హైదరాబాద్ బర్డ్ వాచర్స్ పరవశించిపోయారు.
By : The Federal
Update: 2024-05-16 13:17 GMT
మన దేశంలో స్థానిక పక్షుల దినోత్సవాన్ని పక్షిప్రేమికులు ఘనంగా జరుపుకున్నారు. ఎండిమిక్ పక్షుల దినోత్సవం సందర్భంగా మన తెలంగాణలోని హైదరాబాద్ నగరం నలుమూలలా స్థానిక పక్షులః డాక్యుమెంట్ కార్యక్రమం జరిగింది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షుల పరిశీలకులు 24 గంటల వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ జాతుల పక్షులను డాక్యుమెంట్ చేశారు. గ్లోబల్ బిగ్ డేతో సమానంగా పక్షిప్రేమికులు మన హైదరాబాద్ రెసిడెంట్ బర్డ్స్ ను లెక్కించి వాటి ఫొటోలు తీసి ఈబర్డ్ లో అప్ లోడ్ చేసి గ్లోబల్ బిగ్ డేకు జోడించారు.
- పక్షుల గణన బర్డింగ్ ఈవెంట్ లో వేలాదిమంది బర్డ్ వాచర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక పక్షుల దినోత్సవంలో పాల్గొని వాటిని చిత్రాలు తీసిన బర్డ్ వాచర్స్ మే 31వతేదీలోగా ఈబర్డ్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు.
స్థానిక పక్షుల దినోత్సవం
ఎండిమిక్ డే సందర్భంగా హిమాలయన్ బర్డ్ కౌంట్ భారతదేశం, భూటాన్, నేపాల్ దేశాల హిమాలయ ప్రాంతాల్లో పక్షుల వైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేశారు. మే 11వతేదీన దేశవ్యాప్తంగా ఉన్న పక్షి పరిశీలకులు రంగురంగుల పక్షులను లెక్కించి వాటి ఛాయాచిత్రాలను తీశారు. తీసిన పక్షుల ఫొటోలను ఈబర్డ్ మొబైల్ యాప్ ద్వారా అప్ లోడ్ చేశారు. ఎండమిక్ బర్డ్ డే సందర్భంగా మే 11వతేదీ అర్దరాత్రి నుంచి తెల్లవారుజామున, పగటిపూట రాత్రి దాకా పలు పక్షుల చిత్రాలు తీశారు.
పక్షుల సంతానోత్పత్తి కార్యకలాపాల చిత్రాలు
పక్షుల్లో సంతానోత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు వాటిపై అవగాహన కల్పించారు. వివిధ రకాల పక్షుల జాతులు సంతానోత్పత్తి కార్యకలాపాల మధ్యలో ఉంటాయి. పక్షులకు సంతానోత్పత్తిలో అంతరాయం కలిగించకుండా వాటిని జాగ్రత్తగా డాక్యుమెంట్ చేశారు. ఎండిమిక్ బర్డ్ డే రోజు దేశం నలుమూలల నుంచి వందలాది మంది వివిధ రకాల స్థానిక జాతుల పక్షులను కనుగొన్నారు. చెట్టు కొమ్మలపై బంగారు ఆలివ్ రంగు వీపుతో కూడిన వడ్రంగి పిట్ట కనిపించింది. ఈ అరుదైన పిట్ట నైరుతి భారతదేశంలోని పర్వత ప్రాంత అడవికి చెందిందని బర్డ్ వాచర్స్ గుర్తించారు.
స్థానిక పక్షుల సంచారం పరిమితం
స్థానిక పక్షులు అంటే వాటి సంచారం నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం అయింది. స్థానిక పక్షుల దినోత్సవం కోసం దక్షిణ ఆసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో బర్డ్ ను డాక్యమెంట్ చేశారు. గ్రే ఫ్రాంకోలిన్ వంటి సాధారణ జాతి నుంచి వయనాడ్ లాఫింగ్ థ్రష్ వంటి అరుదైన జాతి పక్షులను బర్డ్ వాచర్స్ ఫొటోలు తీశారు. స్థానిక పక్షుల చిత్రాలను గ్లోబల్ బిగ్ డేకు పంపించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బర్డ్ వాచర్స్ కు చేర్చారు.
ఎన్నెన్నో రకాల పక్షి జాతులు
తెలంగాణలో పలు రకాల పక్షిజాతులున్నాయి. ప్రధానం గా హిమాలయన్ మోనాల్, హిమాలయన్ వుడ్ పిక్కర్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇండియన్ పిట్ట, ఊర పిచ్చుకలు ఇలా ఎన్నెన్నో రకాల పక్షలు బర్డ్ వాచర్స్ కు కనువిందు చేశాయి. బొటానికల్ గార్డెన్, హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్, అమీన్ పూర్ చెరువు ఇలా ఎన్నెన్నో చెరువుల వద్ద వివిధ రకాల పక్షులు బర్డ్ వాచర్స్ కు కనువిందు చేశాయి.
బర్డ్ కౌంట్ ఇండియా
భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల జాతుల పక్షుల జాబితాను సేకరించి వాటి చిత్రాలను ఈబర్డ్ లో అప్ లోడ్ చేసేందుకు బర్డ్ కౌంట్ ఇండియా తోడ్పాటు అందిస్తోంది. విద్యార్థులు, బర్డ్ వాచర్స్ స్థానిక పక్షులు, వివిధ జాతుల పక్షుల సమృద్ధిపై డాక్యమెంట్ చేసేందుకు బర్డ్ కౌంట్ ఇండియా సహకరిస్తోంది.
తెలంగాణలో 200కు పైగా పక్షిజాతులు
హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా మన తెలంగాణ రెసిడెంట్ బర్డ్స్ కౌంటింగ్ కార్యక్రమం జరుగుతోంది. నార్త్ హిమాలయాలు, సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు ఏప్రిల్ నెలలో తిరిగి వెళ్లిపోవడంతో మన బర్డ్ వాచర్స్ రెసిడెంట్ బర్డ్స్ లెక్కింపు కోసం ఎండోమిక్ డే పేరిట ఉత్సవం సెలబ్రేట్ చేశారు. దీనిలో 200 కు పైగా తెలంగాణ రెసిడెంట్ బర్డ్స్ ఉన్నాయని లెక్కల్లో తేలింది.
విదేశీ వలస పక్షులు తిరిగి వెళ్లి పోయాయి...
ప్రతీఏటా అక్టోబరు నెలలో గడ్డ కట్టే మంచుతో కప్పబడిన ఉత్తర ప్రాంత హిమాలయాలు, రష్యా, సైబీరియా ప్రాంతాల నుంచి వివిధ రకాల విదేశీ పక్షులు మన తెలంగాణలోని సరస్సులున్న ప్రాంతాలకు వలస వచ్చాయి. మళ్లీ తెలంగాణలో వేసవిలో మండుతున్న ఎండలతో విదేశీ పక్షుల్లో 99 శాతం సైబీరియా ప్రాంతానికి తిరిగి వెళ్లాయని బర్డ్ పల్స్ ఆర్గనైజర్ శ్రీరాంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఎగరలేక పోయిన ఒక శాతం విదేశీ పక్షులు మాత్రం ఇక్కడి చెరువులున్న ప్రాంతాల్లో ఉండిపోయాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రెసిడెంట్ బర్డ్స్ ను లెక్కించగా 200 కు పైగా జాతుల వివిధ రకాల రంగురంగుల పక్షులను గుర్తించామని శ్రీరాంరెడ్డి చెప్పారు.
అభివృద్ధి పేరిట పక్షుల ఆవాసాలకు విఘాతం కలిగించొద్దు
రంగురంగుల పక్షలు...వాటి కిలకిల రావాలతో కూడిన పక్షుల ఆవాసాలున్న చెరువులు, సరస్సులు,అడవులు, పార్కులను అభివృద్ధి పేరిట విధ్వంసం చేయవద్దని హైదరాబాద్ బర్డ్ వాచర్స్ కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పక్షులను మనం కాపాడుకోవాలని బర్డ్ వాచర్స్ సంపత్, నిఖిల్ సూచించారు.