చండీగఢ్‌లో కేజ్రీవాల్‌కు '7-స్టార్' బంగ్లా?
పంజాబ్ ప్రభుత్వం ఒక వ్యక్తికి సేవ చేస్తోందన్న AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్.
పంజాబ్(Punjab) ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు చండీగఢ్‌లో "'సెవెన్ స్టార్ లగ్జరీ బంగళా" కేటాయించిందని భారతీయ జనతా పార్టీ (BJP) ఢిల్లీ యూనిట్ ఆరోపిస్తోంది. బంగళా సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
"సామాన్యుడిగా నటించే వ్యక్తి మరో గొప్ప షీష్‌మహల్ నిర్మించాడు. ఢిల్లీ షీష్‌మహల్ ఖాళీ చేశాక.. పంజాబ్ 'సూపర్ ముఖ్యమంత్రి' అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అద్భుత బంగాళా నిర్మించారు" అని ఢిల్లీ బీజేపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
బీజేపీ పోస్టుపై స్వాతి మలివాల్ కామెంట్..
పంజాబ్ ప్రభుత్వం "ఒక వ్యక్తికి సేవ చేస్తోంది" అని AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. "ఢిల్లీలోని షీష్‌మహల్‌ను ఖాళీ చేసిన తర్వాత.. అరవింద్ కేజ్రీవాల్ జీ పంజాబ్‌లో మరింత విలాసవంత బంగాళ సిద్ధం చేసుకున్నారు. చండీగఢ్ సెక్టార్ 2లోని రెండు ఎకరాల్లో 7 నక్షత్రాల ప్రభుత్వ బంగ్లాను ఆయనకు కేటాయించారు. నిన్న ఆయన ఆ ఇంటి నుంచి అంబాలాకు ప్రభుత్వ హెలికాప్టర్ ఎక్కారు. అక్కడి నుంచి పంజాబ్ ప్రభుత్వ ప్రైవేట్ జెట్ విమానం ఆయనను గుజరాత్‌కు తీసుకెళ్లింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే పంజాబ్ ప్రభుత్వం ఒక వ్యక్తికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తోంది" అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.
सेक्टर 2 की कोठी जिसमे केजरीवाल जी चंडीगढ़ में रुकते हैं, उसे कैम्प ऑफिस बताने की कोशिश हो रही है।
— Swati Maliwal (@SwatiJaiHind) October 31, 2025
1. अगर ये कैम्प ऑफिस है तो पिछले 4 साल में कितनी जनता यहाँ CM से मिलने आई? CM इस ऑफिस में कितनी बार बैठे
2. अगर ये कैम्प ऑफिस है तो इस ऑफिस में केजरीवाल जी कैसे रहते हैं?
सच ये… pic.twitter.com/5KKIKxFv5Z
కేజ్రీవాల్ ఉంటున్న ఇంటిని సీఎం క్యాంప్ ఆఫీసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మరో పోస్టు పెట్టారు స్వాతి మలివాల్(Swati Maliwal)..
"అది క్యాంప్ ఆఫీస్ అయితే గత 4 సంవత్సరాలలో ఎంత మంది సీఎంను కలవడానికి ఇక్కడికి వచ్చారు? సీఎం ఈ కార్యాలయంలో ఎన్నిసార్లు కూర్చున్నారు? ఇది క్యాంప్ ఆఫీస్ అయితే మిస్టర్ కేజ్రీవాల్ అందులో ఎలా నివసిస్తున్నారు?" అని ప్రశ్నలు సంధించారు.
AAP ఎదురుదాడి..
బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆప్ కౌంటర్ ఇచ్చింది. ఒకవేళ బంగళా కేటాయిస్తే.. "కేటాయింపు లేఖ ఎక్కడ?" అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ చూయిస్తున్న ఫోటో చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌కు సంబంధించినదని చెబుతున్నారు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఈ ప్రచారం మొదలుపెట్టిందని ఆరోపించారు.