ధర్మస్థల: బెల్తాంగడిలో ‘హూ కిల్డ్’ ఉద్యమం

ధర్మస్థలలో వేలాదిగా అసహజ మరణాలు సంభవించాయని మహిళల ఆరోపణ, సిట్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్

Update: 2025-12-17 07:25 GMT

ధర్మస్థలలో వేలాది అసహజ మరణాలు జరుగుతున్నాయని, వాటిపై సిట్ సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళల నేతృత్వంలో ‘హూ కిల్డ్’ ఉద్యమం ప్రారంభం అయింది.

బెల్తాంగడిలో భారీ మహిళల సమూహం న్యాయ సమావేశం, నిరసన ప్రదర్శన నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది మహిళలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్ని న్యాయం కోసం నినదించారు. ఈ సమావేశానికి ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త జ్యోతి ఫెడరల్ తో మాట్లాడారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

వందల కొద్ది అసహజ మరణాలు..
మేము బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు. ‘‘మా పోరాటం పూర్తి బాధితులకు అనుకూలంగానే ఉంది. అయితే మాకు వస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఏర్పాటు చేయబడిన కేసులో బురుడే చిన్నయ్య పెట్టిన దానిపైనే విచారణ జరుపుతోంది. ధర్మస్థలలో జరిగిన వందలాది ఇతర అసహజ మరణాల గురించి పట్టించుకోవట్లేదు’’ అని ఆమె ఆరోపించారు.
‘‘అసహజ మరణాలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా ఒక లేఖ రాశారు. కానీ సిట్ ఇంకా దర్యాప్తు ఎందుకు చేయట్లేదు? దర్యాప్తు బృందంపై కొన్ని శక్తుల ఒత్తిడి ఉంది. అయితే ఎంత ఒత్తిడి ఉన్నా దర్యాప్తు సంస్థలు దానికి లొంగకూడదు. నిజం బయటకు రావాలి’’ అని జ్యోతి డిమాండ్ చేశారు.
మహిళలుగా మేము చేస్తున్నా పోరాటాన్ని ఆపివేయడానికి అనేక కుట్రలు జరిగాయని, కానీ మేమంతా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలను ఏకం చేసి దేనికి లొంగకుండా బెల్తాంగడీకి వచ్చినట్లు చెప్పారు.
ప్రారంభం మాత్రమే..
ఈ ర్యాలీ పోరాటానికి ముగింపు కాదని కొత్త ఆరంభమని మరో కార్యకర్త శశికళ శెట్టి హెచ్చరించారు. ‘‘ఈ ప్రాంతంలో జరిగిన అసహజ మరణాలు దిగ్భ్రాంతికరమైనవి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన దు:ఖంలో ఉన్న కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని ఆపము.
మా పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభించింది. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుంది’’ అని ఆమె స్ఫష్టం చేశారు. సదస్సు ప్రారంభానికి ముందు మహిళలు బెల్తాంగడీలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘‘వారిని ఎవరు చంపారు? మాకు న్యాయం కావాలి’’ వంటి నినాదాలు చేశారు.
ధర్మస్థలలో జరిగిన అనుమానాస్పద మరణాల గురించి ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ మహిళా సంస్థలు, ప్రగతి శీల ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Tags:    

Similar News