ట్యాపింగ్ లో ‘సిట్’ కే చుక్కలు చూపిస్తున్నారా ?

ప్రధాన నిందితుడి నుండి అసలు విషయాన్ని రాబట్టడంలో ఫెయిలైనట్లే అనిపిస్తోంది

Update: 2025-12-16 13:08 GMT
Alleged accused T Prabhakar Rao in Telephone Tapping

టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ తీరుచూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. పోలీసు కస్టడీలోకి ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావును తీసుకుని మంగళవారానికి నాలుగురోజులు అయినా ప్రధాన నిందితుడి నుండి అసలు విషయాన్ని రాబట్టడంలో ఫెయిలైనట్లే అనిపిస్తోంది. ఐదురోజులుగా నిందితుడిని(స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) సిట్ అధికారులు విచారిస్తునున్నా ఎలాంటి పురోగతి కనిపిచంటంలేదని సమాచారం. (KCR)కేసీఆర్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లు ట్యాపింగ్(Phone Tapping) జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఫోన్లను ఇల్లీగల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS) ట్యాపింగ్ చేయించింది. ఈ ట్యాపింగులో కీలకపాత్రదారి అప్పట్లో ఇంటెలిజెన్స్ బాస్ గా పనిచేసిన ప్రభాకరరావే.

అప్పటి బాస్ చెబితేనే తాము ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయిన పోలీసులు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, ప్రణీత్ రావులు రాతమూలకంగా ముందు సిట్ అధికారుల విచారణలోను తర్వాత కోర్టులో కూడా అంగీకరించారు. పైనలుగురు పోలీసు అధికారుల రాతమూలకంగా అంగీకరించటంతోనే ట్యాపింగు కేసులో ప్రభాకరరావే కీలకపాత్రదారుగా సిట్ నిర్ధారించింది. అయితే ప్రభాకరరావుకు ఫోన్లు ట్యాప్ చేయాలన్న ఆదేశాలు ఇచ్చింది ఎవరు ? ఎవరి ఆదేశాలతో వేలాది ఫోన్లను ప్రభాకరరావు బృందం ట్యాపింగ్ చేసిందన్నది చాలా కీలకం. కీలక పాత్రదారిగా ప్రభాకరరావు పాత్ర తేలిపోయింది. ఇక ఆధారాలతో తేలాల్సింది ట్యాపింగులో కీలక సూత్రదారుడు ఎవరు ? అన్నదే.

కీలక సూత్రదారుడి విషయం తెలుసుకోవటానికే సిట్ అధికారులు కొన్నినెలలుగా ప్రయత్నిస్తున్నా ఉపయోగం కనబడలేదు. అందుకనే ప్రభాకరరావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కాని అసలు విషయం బయటకు రాదన్న సిట్ వాదనతో సుప్రింకోర్టు ఆరుమాసాల తర్వాత ఏకీభవించింది. అందుకనే ప్రభాకరరావును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ అధికారులకు అనుమతిచ్చింది. అయితే నిందితుడిని సిట్ కస్టడీలోకి తీసుకుని ఐదురోజులు అవుతున్నా విచారణలో ఏమాత్రం పురోగతి కనిపించటంలేదని తెలిసింది. విచారణలో పురోగతి ఎందుకు లేదంటే తమదైన పద్దతిలో నిందితుడిని విచారణ చేయకూడదని సిట్ అధికారులను సుప్రింకోర్టు ఆదేశించింది.

అంటే సుప్రింకోర్టు రక్షణ ఉన్నంతవరకు నిందితుడు సిట్ విచారణలో నోరువిప్పడన్న విషయం స్పష్టమైపోయింది. నిందితుడు అమెరికాలో ఉపయోగించిన మొబైల్ ఫోన్, జీమెయిల్, ఐక్లౌడ్ ఖాతాలను సిట్ అడుగుతుంటే ఇవ్వటంలేదు. పాస్ వర్డ్ మరచిపోయానని, మొబైల్ అమెరికాలో పోయిందని రకరకాలుగా జవాబులు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్లలోని డేటాను పూర్తిగా డిలీట్ చేసేశాడు. డేటాను ఎందుకు డిలీట్ చేశావంటే చెప్పటంలేదు. అందుకనే ప్రభాకరరావు డిలీట్ చేసిన డేటా కావాలని సిట్ అధికారులు యాపిల్, జీమెయిల్ సంస్ధలకు లేఖలు రాశారు. వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారో ? అసలు డేటాను పంపుతారో లేదో కూడా తెలీదు.

మొత్తంమీద కస్టడీ విచారణగడువు వారంరోజులు శుక్రవారంతో ముగుస్తుంది. సుప్రింకోర్టు రక్షణ ఉన్నంతవరకు ప్రభాకరరావును సిట్ అధికారులు ఎన్నిరోజులు విచారించినా ఎలాంటి ఉపయోగం ఉండదన్నది వాస్తవం. ఒకవేళ యాపిల్, జీ మెయిల్ సంస్ధలు డేటాను పంపితే, అందులో ఉపయోగపడే సమాచారం ఉంటేనే విచారణలో పురోగతి కనబడుతుంది. లేకపోతే ఎంతకాలమైనా విచారణ సా.............గుతునే ఉంటుంది.

Tags:    

Similar News