పోలీసుల అదుపులో మావోయిస్ట్ కీలక నేత

కుమరం భీమ్ ఆసిఫాబాద్‌లో పోలీసులకు చిక్కిన బడే చొక్కారావు.

Update: 2025-12-16 08:33 GMT

మావోయిస్ట్ కీలక నేత బడే చొక్కారావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్‌లోని అడవుల్లో జరిపిన కూంబింగ్‌లో 16 మంది మావోయిస్ట్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కీలక అనేత బడే చొక్కారావు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిర్పూర్(యు) మండలం పెద్దదోబలోని ఓ పూరిగుడిసెలో మావోయిస్ట్‌లు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. వారందరినీ అరెస్ట్ చేశారు.

ఏఎస్పీ చి్తరంజన్ ఆధ్వర్యంలో ఈ కూంబింగ్ చేశారు. పట్టుబడిన మావోయిస్ట్‌లు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని పోలీసులు తేల్చారు. వారి నుంచి ఏకే47, రెండు ఇన్సాస్ ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారందరిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. పట్టుబడిన 16 మందిలో తొమ్మిది మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వారిని హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసుకు తరలిస్తున్నారు.

అయితే 30 మార్చి 2026 నాటికి దేశాన్ని మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం పలుసార్లు స్పష్టం చేసింది. ఆ దిశగానే కొంతకాలంగా మావోయిస్ట్‌లపై తీసుకుంటున్న చర్యల్లో వేగం పెంచింది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించి అడవుల్లో కూంబింగ్ చేయిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్ట్‌లు లొంగిపోయారు. అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఆయుధాలను వీడారు. మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడాలని పిలుపునిస్తున్నారు.

Tags:    

Similar News