న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

సామాన్యుడికి న్యాయం కావాలి అంటేనే అడ్డంకులు. ఎవరిని కలవాలి.. ఎంత ఫీజు తీసుకుంటారు. అసలు వకీల్లను నమ్మచ్చా.దోషులను వదిలి అనవసరంగా కోర్టు చుట్టూ తిప్పుతారు.

Update: 2023-12-21 08:56 GMT
లీగల్ సర్వీస్

దౌర్జన్యంలో కోల్పోయిన దానికంటే కోర్టుల చుట్టూ తిరిగితే కోల్పోయేది ఎక్కువ... ఇదీ మెజారీటీ ప్రజల్లో నెలకొన్న భావన. ప్రభుత్వం కోర్టు కేసుల పరిష్కారం కోసం ఇప్పటికే లీగల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ప్రతి కోర్టులో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఎలాంటి రుసుం వసూలు చేయకుండా సామాన్య ప్రజలకు న్యాయ సాయం అందించడంతో పాటు మధ్యవర్తిత్వంతో కోర్టుల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి కృషి చేస్తోంది.

అదే తరహలో ఏపీలో ప్రజలకు ప్రస్తుతం అరాచకాలు, దాడుల ఫలితంగా నష్టపోయిన బాధితులకు ఉచితంగా న్యాయం సాయం అందించడానికి సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ నడుంబిగించింది. ప్రముఖ న్యాయవాదులు సుంకర రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ గా న్యాయవాదులు ముప్పాళ్ల సుబ్బారావు, నర్రా శ్రీనివాసులు, పి.వి.జీ. ఉమేష్ చంద్ర, అశ్వినీ కుమార్, కే. అజయ్ కుమార్, పీఎస్పీ సురేష్ కుమార్, జంపనీ శ్రీదేవి, కే. అరుణ, పాలేపు వేంకట నరసింహరావు సభ్యులుగా న్యాయ సాయ బృందం ఏర్పాటు అయింది. ప్రజలకు ఉచిత న్యాయ సాయ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయ కార్యదర్శి వల్లంపల్లి లక్ష్మణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

తమ బృందంలోని సభ్యులకు ఒకే విధమైన రాజకీయ అభిప్రాయాలు లేవని, అయితే ప్రజాస్వామ్యం విషయంలో మాత్రం ఒకే అభిప్రాయంతో ఉన్నామని వారు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా వివిధ కారణాలతో బాధితులుగా మారీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం అందించడానికే న్యాయ సహాయ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సహాయ కార్యదర్శి వల్లంపల్లి లక్ష్మణ రెడ్డి తెలిపారు.

త్వరలో ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో న్యాయ సహాయ బృందాలను ప్రకటిస్తామని ప్రకటనలో వెల్లడించారు. న్యాయసాయం కావాలని కోరుకునే వారు ఫోన్ నంబర్ 18004250264 కి కాల్ చేయాలని వెల్లడించారు. citizensfordemocracy23@gmail.com ను www.citizensfordemoracy.net వెబ్ సైట్ ను సంప్రదించగలరని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News