అనుముల రేవంత్ రెడ్డి అను నేను..

Update: 2023-12-07 08:06 GMT
తెలంగాణ రాష్ట ముఖ్మమంత్రి ఏ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.22 నిమిషాలకు ఆయన తెలుగులో, దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క,  మంత్రులుగా నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామెదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ శ్రీధర్ బాబు, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ,ధనసరి సీతక్క,తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దామెదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు.  ప్రమాణస్వీకారానికి ముందు ఎల్బీ స్టేడియంలో సోనియాగాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ టాప్ జీబులో ప్రజలకు అభివాదం చేశారు. తరువాత గవర్నర్ ను సాదరంగా ఆహ్వనించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు పుష్ఫగుచ్ఛం అందించారు. అనంతరం అధికారికంగా ప్రమాణ స్వీకారం మొదలయింది. 

Tags:    

Similar News