కార్ఖానాలో భారీ చోరి

రు. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు చోరి

Update: 2025-11-16 10:15 GMT
Robbery in Secunderabad

సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున  భారీ చోరి జరిగింది. నెపాలీ ముఠా ఈ చోరికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గన్ రాక్ ఎన్ క్లేవ్ లో కెప్టెన్ గిరి(75) ఇంట్లో ఈ చోరి జరిగింది. గిరి ఇంట్లో పని చేస్తున్న నేపాలీ వ్యక్తి మరికొందరితో కల్సి భారీ చోరీకి పాల్పడ్డాడు. 


గిరి ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ చోరికి పాల్పడినట్లు ఏసీపీ రమేష్ చెప్పారు. చోరికి పాల్పడేముందు వారు ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి అతడిని తాళ్లతో మంచానికి కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత సుమారు రూ.50లక్షల విలువైన బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. 25 తులాలకు పైగా బంగారం, రూ.23 లక్షల నగదును దొంగలు దోచుకున్నారు.  చోరీ జరిగినప్పుడు యజమాని గిరి ఒక్కడే ఉన్నట్టు కార్ఖానా ఏసీపీ  వెల్లడించారు.


ఇంట్లో పని చేస్తున్న నేపాలీ దంపతులు రాజు, పూజతో బాటు మరో నలుగురు ఈ చోరీకి పాల్పడినట్టు ఎసిపి చెప్పారు. నిద్రిస్తున్న గిరిని తాళ్లతో కట్టేసి అరవకుండా  నోటికి ప్లాస్టర్ వేశారు.  ఇంట్లో ఉన్న బంగారం, నగదును దోచుకున్నారు. తర్వాత గిరి మెడలో ఉన్న బంగారు నగలను సైతం దోచుకుని పరారయ్యారు.  దోపిడి తర్వాత గిరి నోటికి వేసిన ప్లాస్టర్ ను ఊడదీసుకుని పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు మేల్కొన్నారు. గిరి ఇంట్లోకి వచ్చి జరిగింది తెలుసుకున్నారు.  యజమాని కాళ్ళకు ఉన్న తాళ్లను విప్పారు. దోపిడి జరిగిన విషయాన్ని గిరి కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గిరి ఇంట్లోపని చేసే మరో మహిళకు కూడా మత్తు మందు ఇచ్చినట్టు ఎసిపి తెలిపారు.

Tags:    

Similar News