Maha Kumbh Stampede |కుంభమేళాకు పెరుగుతున్న భక్తుల సంఖ్య,తొక్కిసలాటలు

ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో విషాదం అలముకుంది.కుంభమేళాకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో తొక్కిసలాటలకు దారితీస్తోంది.;

Update: 2025-01-29 02:23 GMT

కుంభమేళాకు తరలివచ్చిన భక్తుల రద్దీ వల్ల గతంలోనూ పలుసార్లు తొక్కిసలాట ఘటనలు జరిగాయి.

- 1820వ సంవత్సరంలో హరిద్వార్ లో జరిగిన తొక్కిసలాటలో 485 మంది మరణించారు. ఈ విషాద ఘటన తర్వాత అప్పటి బ్రిటీష్ పాలకులు నదీ తీరాన కొత్త ఘాట్ లు నిర్మించి రోడ్డును కూడా విస్తరించారు.
- ఆ తర్వాత 19, 20 శతాబ్ధాల్లోనూ పలు సార్లు కుంభమేళాలో తొక్కిసలాటలు జరిగాయి. మహా కుంభమేళాలో గతంలో జరిగిన విషాద ఘటనలతో నదీ తీరంలో ఘాట్ లను విస్తరిస్తూ వచ్చారు.
- 1954వ సంవత్సరంలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 500 మందికి పైగా భక్తులు మృత్యువాత పడ్డారు. 1986వ సంవత్సరంలోనూ జరిగిన తొక్కిసలాటలో 50 మంది మరణించారు.

కుంభమేళాకు పెరుగుతున్న భక్తుల సంఖ్య
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కుంభమేళాకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మౌని అమావాస్య నాడు ఎక్కువ మంది భక్తులు తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానం ఆచరిస్తుంటారు. 1954వ సంవత్సరంలో కుంభమేళాకు 5 మిలియన్లకు పైగా భక్తులు తరలివచ్చారు. 1977వ సంవత్సరానికి ఈ భక్తుల సంఖ్య 10 మిలియన్లకు పెరిగింది. 1989వ సంవత్సరంలో కుంభమేళాకు 15 మిలియన్ల భక్తులు తరలివచ్చారు. 1998 హరిద్వార్ లో జరిగిన కుంభమేళాలో ఒకే రోజు 10 మిలియన్ల మంది యాత్రికులు హాజరయ్యారు. 2001లో కుంభమేళాకు 70 మిలియన్ల మంది వచ్చారు. కుంభమేళాకు పెరుగుతున్న భక్తుల సంఖ్యతో వారికి ఏర్పాట్లు చేయడం సవాలుగా మారింది.

మౌని అమావాస్య సందర్భంగా...
ఈ ఏడాది బుధవారం మౌని అమావాస్య సందర్భంగా బుధవారం పవిత్ర స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ వల్ల తొక్కిసలాటకు దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది.


Tags:    

Similar News