అదిలాబాద్ లైబ్రరి లో యువతను కలిసిన కవిత

జాబ్ కాలెండర్ యివ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ యువతను మోసం చేసిందని ఆమె అన్నారు.

Update: 2025-11-04 13:22 GMT
Click the Play button to listen to article

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలోకి వెళ్తూ తన కొత్త రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా యువతను కలుస్తున్నారు. అందులో భాగంగా ఇవ్వాళ ఆదిలాబాద్ లో లైబ్రరీ కి వెళ్ళి అక్కడ నిరుద్యోగులతో వారి సమస్యల గురించి వాకబు చేశారు.

ఉద్యోగాల పేరుతో నీరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా నిరుద్యోగులతో మాట్లాడుతూ, “వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం నియామాకాలు జరపాలి. కాంగ్రెస్ వాళ్ళు మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి మీకు ఉద్యోగాలు యిస్తాం అని అధికారం లోకి వచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామకాలనే చేపడుతున్నారు ఒక్క కొత్త నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేదు. ఈ లైబ్రరి లో చాలా మంది పిల్లలు డీఎస్సీ, ఫార్మసీ, గ్రూప్స్ కోసం చదువుకుంటున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో అర్థం కాని పరిస్థితి. ఏ అనిశ్చితి ఉందని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతొంది. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.”

ఇటీవల జరిగిన గ్రూప్ -1 గురించి మాట్లాడుతూ అందులో అనేక తప్పులు చేశారని తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాకాకుండా పరీక్షలను విశ్వసనీయత కోల్పోకుండా నిర్వహించాలని కోరారు.

బిఆర్ఎస్ నుండి బయటికి వచ్చిన కవిత తెలంగాణ జాగృతి అనే వేదిక పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు. బిఆర్ఎస్ ఉద్యోగాల కల్పన లో అలక్ష్యం వహిస్తోందని తద్వారా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ విషయాన్ని తన ప్రచారం లో ప్రముఖంగా చేపట్టిన విషయం తెలిసిందే.

అధికారం లోకి వచ్చాక పాత నోటిఫికేషన్ల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయకుండా మిగిలిన నియామకాలను పూర్తి చేయడం తో దాదాపు 60,000 ఉద్యోగాల నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం యిచ్చింది. అయితే యిక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత రెడ్డి రాష్ట్రం లో తెలంగాణ ఏర్పాటు తరువాత బిఆర్ఎస్ ప్రభుత్వం 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి అని ప్రకటించింది, తదుపరి అది ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ 1,91,738 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని తేల్చినట్టు తాము అధికారం లో కి వస్తే మొదటి సంవత్సరం లో నే నియామకాలు చేస్తామని ఎన్నికల నేపద్యం లో వాగ్దానం చేశారు. అందుకు స్పందించిన ఎంతో మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల ప్రచారం లో సహకరించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5,089 పోస్టులు మాత్రమే డీఎస్సీ ద్వారా ఈ ప్రభుత్వం అదనంగా ఇచ్చిందని మిగిలినవి బిఆర్ఎస్ హయంలో మొదలైన ప్రక్రియలో కేవలం నియామక పత్రాలు యిచ్చి పూర్తి చేశారు అని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-1 పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదల అయ్యాయి నియామకాలు చేపడుతున్నారు. అయితే బిఆర్ఎస్ హయంలో ఇచ్చిన పోస్టులకు అదనంగా మరో 60 చేర్చి 563 పోస్టులకు రేవంత్ ప్రభుత్వం నియామకాలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితి లో తనకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకునే పని లో ఉన్న కవిత వివిధ వర్గాలను కలుస్తూ తన రాజకీయ యాత్ర కొనసాగిస్తున్నారు.

గతం లో జాగృతి తరపున నిజామాబాద్ లైబ్రరీ లో విద్యార్థులు లంచ్ ఏర్పాటు చేయటం గురించి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో మిడ్ డే మీల్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. లైబ్రరీలో కరెంట్ పోతే నిరుద్యోగులు చదవలేకపోతున్నారని కనీసం జనరేటర్ అయిన ఏర్పాటు చేయాలని, మిగిలిన హామీలను నెరవేర్చాలనని ప్రభుతాన్ని కోరారు.

కాంగ్రెస్ నిరుద్యోగులకు చేసిన మరో వాగ్దానం వారికి Rs 4,000 నిరుద్యోగ బృతి కల్పన అమలు కాకుండా వున్న విషయం తెలిసిందే.

Similar News