Big breaking : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు
తొందరలో ప్రచారానికి జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం ఒక్కసారిగా వేడెక్కబోతోంది. కారణం ఏమిటంటే బీజేపీకి జనసేన అధినేత, ఏపీ డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. పవన్ ఆదేశాల ప్రకారం తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ మంగళవారం కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తదితరులతో భేటీ అయ్యారు. సాగర్ సొసైటిలో జరిగిన ఈ భేటీలో పవన్ నిర్ణయాన్ని గౌడ్ వివరించారు.
బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా పవన్ నియోజకవర్గంలో ప్రచారం చేయటానికి డిసైడ్ అయ్యారు. ప్రచారానికి ఉన్నది ఇక ఐదురోజులే కావటంతో పవన్ రోడ్డుషోల్లో ఎక్కువగా ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. ఏరోజు పవన్ ప్రచారానికి వచ్చేది, రోడ్డుషోల్లో పాల్గొనబోతున్నారన్న విషయాన్ని బుధవారం బీజేపీ, జనసేన నేతలు ప్రకటించే అవకాశం ఉంది. పవన్ ప్రచారానికి రెండుపార్టీల నేతలు రోడ్డుమ్యాప్ ను తయారుచేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్డుషోలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.