విజయ్ సేతుపతి ‘మహరాజా’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్!

సేతుపతి కెరీర్‌లో ఇది అతిపెద్ద హిట్ అయింది. రు.20 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం వసూళ్ళలో వందకోట్ల మార్క్ దాటింది.

Update: 2024-10-07 06:41 GMT

మహారాజ సినిమా విజయ్ సేతుపతి 50వ సినిమాగా గత జూన్ 14న విడుదలై తమిళ, తెలుగు భాషలలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలై, ఇండియాలో అత్యధికంగా చూడబడిన సినిమాలలో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. విజయ్ సేతుపతి ఈ సినిమా నిర్మాతలలో ఒకరు కూడా.

ఈ విజయాన్ని పురస్కరించుకుని సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సేతుపతి, మిగిలిన ఇద్దరు సూదన్ సుందరం, జగదీష్ పళనిస్వామిలతో కలిసి దర్శకుడు నిటిలన్ స్వామినాథన్‌కు నిన్న చెన్నైలో ఒక బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారును బహూకరించారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర సుమారు 73 లక్షలు. దీనిలో 2 లీ. పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.



        సేతుపతి కెరీర్‌లో ఇది అతిపెద్ద హిట్ అయింది. రు.20 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం వసూళ్ళలో వందకోట్ల మార్క్ దాటింది. సేతుపతి కాకుండా, అభిరామి, దివ్యభారతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కూడా నటించారు.

Tags:    

Similar News