ఈ‘ గిప్ట్ ’ విశ్వవ్యాప్తం కావాలి: ప్రధాని నరేంద్ర మోడీ

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్( గిప్ట్) సిటీ ప్రపంచ ఆర్థిక సాంకేతిక సేవలకు కేంద్రంగా మారాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-09 08:32 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

గుజరాత్ లోని గిప్ట్ సిటీలో గల ఇన్ఫినిటీ ఫోరం 2.0 సదస్సు నుద్దేశించి ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశ వృద్ధిరేటు 7.7 శాతం నమోదు చేసుకుందని వివరించారు. ఆర్థికంగా దేశం బలపడుతుందనడానికి ఇదే నిదర్శనంగా అభివర్ణించారు. గత పదేళ్ల నుంచి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలే ఈ అభివృద్ధికి కారణంగా పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వృద్ధి రేటుపైనే ఆశలు పెట్టుకుందని, ప్రపంచ వృద్ధిరేటుకు భారత్ చోదక శక్తిగా మారిందని వివరించారు.

ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాదని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్ టెక్( ఫిన్ టెక్ అంటే వ్యాపారాలను డిజిటల్ గా హ్యాండిల్ చేయడం) మార్కెట్ లో భారతదేశం ఒకటని, అందుకు గిఫ్ట్ సిటీ కేంద్రంగా మారాలని కోరుకుంటున్నాని ప్రధాని ఆకాంక్షించారు. అలాగే గ్రీన్ కెడ్రిట్స్ కోసం మార్కెట్ మెకానిజాన్ని అభివృద్ధి చేయడంపై నిఫుణులు తమ అభిప్రాయాలను ప్రభుత్వాలతో పంచుకోవాలని కోరారు. గర్భా నృత్యాన్ని యునెస్కో జాబితాలో చేర్చడం పై గుజరాత్ రాష్ట్ర ప్రజలకు అభినందించారు. 

Tags:    

Similar News