మీరు మంత్రిగా ఉన్నారు.. ప్రమాణ స్వీకారానికి రండి

Update: 2023-12-07 04:28 GMT
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు

మంత్రివర్గంలో ఎవరున్నారంటే..

కొత్తగా కొలువుదీరనున్న తెలంగాణ మంత్రివర్గంలో సీఎంతో సహ 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులగా ప్రమాణం చేసే వారిలో ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రి కోటలో రేవంత్ రెడ్డి తో పాటు, జూపల్లి కృష్ణారావు, మెదక్ నుంచి దామెదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి చేత గవర్నర్ తమిళి సై ప్రమాణం చేయిస్తారు. వీరి జాబితా రాజ్ భవన్ కు చేరింది. 

మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర రెండో సీఎం గా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ  స్వీకారం చేయనున్నారు. తరువాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. వీరిలో కొంతమంది సీనియర్లకు స్వయంగా

రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వనించారు. అలాగే మరికొంతమంది సీనియర్లకు పీసీసీ ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే ఫోన్ చేసి ఆహ్వనించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. అలాగే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు లతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఉదయం పదకొండు గంటలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన  64 మంది నేరుగా ప్రమాణస్వీకారం జరిగే ఎల్బీ స్టేడియానికి బస్సుల్లో తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ తరలి వస్తున్నారని వారికి ఘనంగా స్వాగతం పలకడానికి టీపీసీసీ అధ్యక్షుడు స్వయంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బయలు దేరి వెళ్లారు.

Tags:    

Similar News