ఫ్లెక్సీ కలకలం..

సీఎం రేవంత్‌ ‌ప్రజాదర్బార్‌లో బిజీగా ఉన్నారు. అక్కడికి వచ్చి, వెళ్లే జనాల దృష్టి కాసేపు ఆ ఫ్లెక్సీపై పడింది. వారంత తీక్షణంగా చూసిన ఆ ఫ్లెక్సీపై ఏం రాసి ఉందంటే..

Update: 2023-12-08 07:44 GMT

ఓ వైపు సీఎం ఎ. రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth) ప్రజా దర్బార్‌ ‌(Praja Darbar)నిర్వహిస్తున్నారు. బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తూ.. సమస్యల పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ప్రగతి భవన్‌ ‌పేరును ప్రజా భవన్‌గా మార్చి..ప్రజాదర్బార్‌ ‌నిర్వహిస్తామని రేవంత్‌ ‌నిన్న ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పిన విషయం తెలిసిందే.

కాగా ప్రజా దర్బార్‌ ‌బయట ఓ ఫ్లెక్సీ(Flexi) కలకలం రేపుతుంది.

ఇద్దరు వ్యక్తులు ఓ ఫ్లెక్సీని పట్టుకుని ప్రజాదర్బార్‌ ‌బయట కనిపించారు. ‘‘తెలంగాణ(Telangana) అసలు దొంగలు(Thiefs)’’ ‘‘బేకార్‌.. ‌బీహార్‌ ‌బ్యాంచ్‌..’’అని రాసిన ఈ ఫ్లెక్సీపై 8 మంది ఫోటోలు, వాటికింద వారి పేర్లు ఉన్నాయి.

మొదటి వరుసలో నలుగురి రిటైర్డ్ ఐఏఎస్‌(Rtd IAS)ల ఫోటోలు (రాజీవ్‌ ‌శర్మ, సోమేష్‌ ‌కుమార్‌, ‌నర్సింగ్‌ ‌రావు, రజిత్‌ ‌కుమార్‌) ఉం‌డగా.. కింది వరసలో కేసీఆర్‌ (KCR), ‌కేటీఆర్‌(KTR), ‌హరీష్‌ ‌రావు(Harish Rao), కవిత(Kavitha) ఫొటోలు ఉన్నాయి.

Tags:    

Similar News