ఆఫర్ అదిరిందిగా..
తెలంగాణ అంతటా ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న టాపిక్ ఎంటో తెలుసా? ఏ గల్లీ తీసుకున్నా..మహిళల నోట ఇదే మాట.. రేపట్నుంచి బస్సులో టికెట్ లేదటగా అని..
సీఎం మాట నిలుపుకున్నట్టే..
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రతీ సభలోనూ చెబుతూ వచ్చారు. అందులో ‘మహాలక్ష్మీ స్కీం’(Mahalaxmi Scheme)ను రేపటి (9.12.2023) నుంచి అమలు చేస్తున్నారు.
ఇదే రోజు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) అసెంబ్లీ ప్రాంగణంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.
పథకం ప్రయోజనాలివే..
1. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు (RTC)లో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణం (Free Travel)
2. వయసుతో సంబంధం లేకుండా తెలంగాణ సరిహద్దుల దాకా ప్రయాణించొచ్చు.
3. తెలంగాణ డిపోలకు చెందిన ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులో రాష్ట్ర సరిహద్దుల దాకా ఉచితం. బార్డర్ దాటాక టిక్కెటు కొనాల్సిందే.
4. సిటీలో ఆర్డినరీ, మెట్రోలో ఉచితంగా ప్రయాణంచవచ్చు.
5. వారం వరకు ఏ గుర్తింపు కార్డు చూపనక్కర్లేదు.
ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తుంది.
త్వరలో సాఫ్ట్‌వేర్ ఆధారిత మహాక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఈ కార్డు చూపితేనే బస్సులు అనుమతిస్తారు కాబోలు.
వారం తర్వాత పరిస్థితేంటి..
వారం వరకు ఓకే.. మరీ ఆ తర్వాత. కండీషన్స్ పెడతారా? అవి ఎలా ఉంటాయి? కొందరి డౌంట్స్ ఇవి.దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) క్లారిటీ ఇచ్చారు.
‘‘రాష్ట్రంలో రోజు 45 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.. మహాలక్ష్మి స్కీంద కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్స్ తెలంగాణలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. జీరో టిక్కెట్ ఇష్యూ చేస్తారు.ఈ స్కీంను 7,290 బస్సులకు వర్తింపజేస్తున్నాం. ఎంత మంది ట్రావెల్ చేస్తున్నారో 4,5 రోజుల్లో ఒక అంచనా వస్తుంది. వారం తర్వాత రాష్ట్రం లేదా కేంద్రం జారీ చేసిన గుర్తింపు కార్డును చూపి ప్రయాణించాల్సి ఉంటుందని’’ వివరించారు.
ఆధార్ ఆధారంగా అయితే..
తెలంగాణ అంటేనే మెట్రో నగరాల్లోకి ఒకటి. తట్ట, బుట్ట సర్దుకొని పిల్ల పాపలతో ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చేసి ఉంటారు. కొన్నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా.. వారి ఆధార్ కార్డుల్లో మాత్రం పర్మినెంటు అడ్రస్ ఏపీలో ఉంటుంది. వీళ్లను ఎలా ట్రీట్ చేస్తారో వేచి చూడాలి మరి.. మాకు టికెట్ ధరలో కన్సెషన్ ఇస్తే బాగుంటుందని కొంతమంది ఆంధ్ర మహిళలు అంటున్నారు.