కల చెదిరింది.. పెద్దాయనకు సీటు కరవైంది
చింత చచ్చినా.. పులుపు చావదు’ అన్నట్లు.. కొంతమంది నేతల ఆశలు నెరవేరకుండానే రాజకీయాలను నుండి అనూహ్యంగా నిష్క్రమించాల్సి వస్తోంది.
ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా వాటికో ప్రత్యేకత ఉంటుందని తెలంగాణ ఎన్నికల్లో మరోసారి రుజువైంది. చింత చచ్చినా.. పులుపు చావదు’ అన్నట్లు.. కొంతమంది నేతల ఆశలు నెరవేరకుండానే రాజకీయాలను నుండి అనూహ్యంగా నిష్క్రమించాల్సి వస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుడిగా నాలుగు దశాబ్ధాల(40 Years in Politics) పాటు రాజకీయాల్లో పనిచేసి, చలకుర్తి, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన కె.జానారెడ్డి 2023లో జరుగుతున్న ఎన్నికల నుండి నిష్క్రమించినట్లు అయ్యింది. అయితే ఆయన పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తారా..? లేదా అన్నది మాత్రం ఇంకా తేల్లేదు. అయితే జానారెడ్డికి మాత్రం ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రికి అవుతానన్న పూర్తి విశ్వాసం ఉంటేదని ఆయన సన్నిహితులు చెప్పేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం వంటిదని అందువల్ల ప్రతీ ఒక్కరూ పార్టీలో కీలక స్థానంలో ఉండాలనుకోవడం సహజమే. అయితే ముఖ్యమైన పదువులు మాత్రం పార్టీ అధిష్టానం నుండి అనుమతి పొందిన తరువాత అభ్యర్థులను వరిస్తాయని జగమెరిగిన సత్యం. జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంశాఖామంత్రిగా పనిచేసి తరువా తాను ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తినే అని భావిస్తుండేవారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జానారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినా.. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన శాసనసభాపక్ష నేతగానే ఉండిపోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఎంతో మంచి పేరు తెచ్చకున్నప్పటికీ ఆయన పార్టీలో అన్యమనస్సుతోనే ఉండేవారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఒక సోషలిస్టుగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే లక్ష్యంగా జానారెడ్డి రాజకీయాలను నడిపారు. 2009 వరకూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్నా ఆయన ఆ తరువాత జరిగిన 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. 2019లో నోముల నర్సయ్య చేతిలో ఆయన ఓడిపోయిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనడంలేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
1978లో జనతాపార్టీలోనే ఎన్నికల బరిలో అడుగుపెట్టి, నిమ్మల రాముడు చేతిలో పరాజయం పొందారు. ఆ తరువాత 1983లో ప్రమఖ సినీనటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశంపార్టీని స్థాపించిన సమయంలో జానారెడ్డి పార్టీ మారారు. అదే ఏడాది నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గం నుండి తొలిసారిగా విజయం సాధించి తొలిసారి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. ఎవరైనా ఒక్కసారి, రెండు సార్లు గెలిస్తేనే తామెంతో గొప్పవారమని భావించే ఈరోజుల్లో కేవలం చలకుర్తి అసెంబ్లీ నుండి 7 సార్లు విజయం సాధించారు. 1988లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలుగు మహానాడు పార్టీలో చేరి అప్పటి నుండి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ చేతిలో పరాజయం చెందిన ఆయన టీడీపీని ఎదుర్కొనేందుకు ’ప్రత్యేక తెలంగాణ’ స్లోగన్ ను తన భుజాన ఎత్తుకొని, కాంగ్రెస్పార్టీలో క్రీయిశీలక పాత్ర పోషించారు. జానారెడ్డి సారధ్యంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నా... చివరకు కేసీఆర్ దీక్షతో యూపీయే ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణాను ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దీక్ష వల్లే ఏర్పాటు అయ్యిందన్న సెంటిమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది.
కాంగ్రెస్ పార్టీ సీనిరయర్ నేత జానారెడ్డి రాజకీయ పదవులు పార్టీ మార్పు
–ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, అటవీ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, తూనికలు, కొలతలు, సీ.ఏ.డీ. రవాణా, రోడ్లు భవనాలశాఖ, హౌసింగ్ పంచాయితీరాజ్, గ్రామీణ నీటిపారుదలశాఖ, పారిశుధ్యంతోపాటు హోంశాఖను కూడా నిర్వహించారు. సుదీర్ఘకాలం కేబినేట్ హోదా మంత్రిగా పనిచేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును దాటివెళ్లారు. తనకంటే పార్టీలో ముందున్న సీనియర్ల రికార్డులను దాటుకుంటూ వెళుతున్న సమయంలోనే ’తాను ముఖ్యమంత్రి’ కావాలన్న ఆలోచనకు పునాది పడింది. కానీ ఆయన కల ఇప్పటికీ నెరవేరలేదు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినా.. కల కలగానే మిగిలిపోయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి అన్యమనస్సుతో నామినేషన్ దాఖలు చేశారు. తన వారసుడికి సీటు ఇవ్వాలని ఆయన పట్టుపటారు. దీంతో పార్టీ ఆయన కుమారుడు కుందూరు జయవీర్ కు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. కుమారుడి నామినేషన్లో ఎమైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు ముందస్తు (Stand By) జాగ్రత్తగా జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
జానారెడ్డి 1978 నుండి 2018 వరకూ జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, 2023లో అనూహ్యంగా రిటైర్మెంట్ అవుతున్నారనేది వాస్తవం. జానారెడ్డి గురించి మాజీ ఎంపీ సర్వే సత్యనాయారణ ’ఫెడరల్’తో మాట్లాడుతూ.. ఎంతో నిబద్దతతో, ఒక నిబంధనలతో కూడుకున్న రాజకీయ జీవితం జానారెడ్డిది. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేవి దశాబ్ధాల కాలం తరువాతే మనకు వస్తాయి. అవి వచ్చేవరకూ పార్టీలో పనిచేయాల్సిందే. అంత ఎందుకు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మూడు దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు. ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. అలా ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు పార్టీ తప్పకుండా ముఖ్యమంత్రే కాదు.. మరే పదివినైనా ఇస్తుంది..’’ అని అన్నారాయన.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న జానారెడ్డి ఇలా ఎన్నికల బరిలో నుండి నిషమించడం ఎవ్వరూ ఊహించలేదని తెలంగాణ కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు.
కలలు కనడమే మనవంతు అవి నెరవేరతాయా..? లేదా అన్నది మాత్రం కాలమే చెబుతుంది మరి జానారెడ్డి ఎన్నికల్లో పోటీకి దూరమైనా..? పార్టీకి చేరువగానే ఉంటారా..? లేదా వృద్ధాప్యం పేరుతో ఇక పూర్తిగా పార్టీకి దూరమవుతారా..? అన్నదే ప్రశ్న.