క్షణం క్షణం ఉత్కంఠ.. అనుక్షణం మారుతున్న ఆధిక్యం

Producer :  Chepyala Praveen
Update: 2023-12-03 05:28 GMT
కాంగ్రెస్... బీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారుతున్నాయి. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం చేతులు మారుతూ వస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ 41 స్థానాల్లో లీడ్ లో  కొనసాగుతోంది. బీజేపీ 7 , ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ కౌంటింగ్ లో వెనకబడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం అధికార బీఆర్ఎస్ తన జోరు కొనసాగిస్తోంది. మొత్తం ఎనిమిది స్థానాల్లో ఆపార్టీ లీడింగ్ లో ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గాలీ వీస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ 9 స్థానాలకు గాను 5 స్థానాలల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్ఎస్ మరో రెండు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ లో 8 స్థానాల్లో, ఉమ్మడి వరంగల్ లో 8 స్థానాల్లో, ఉమ్మడి ఖమ్మంలో 9 స్థానాలు, ఉమ్మడి నల్గొండలో 10 స్థానాలు, పాలమూరు జిల్లాలో 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కాగా మెదక్, రంగారెడ్డిలో మాత్రం కారు లీడింగ్ లో ఉంది. ఇప్పటి వరకూ పోలై కౌంట్ అయిన ఓట్లలో కాంగ్రెస్ 40 శాతం ఓట్లు దక్కించుకోగా, బీఆర్ఎస్ 39 శాతం ఓటింగ్ షేరును పొందింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో బీజేపీ లీడ్ లో ఉంది. 

Tags:    

Similar News