బన్నీ బర్త్‌డేకు మెగా ఫ్యామిలీ మౌనం
ఇదో “సైలెంట్ పొలిటికల్ స్టేట్‌మెంట్” ?;
అల్లు అర్జున్ పుట్టినరోజు వచ్చింది…ఆయన కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. సినీ ప్రముఖులు, సహ నటులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఈ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పిన వారి జాబితాలో ఒక పెద్ద ఖాళీ ఉంది — మెగా ఫ్యామిలీ. వాస్తవానికి టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. అల్లు అర్జున్ అంటే ఓ స్టైల్ ఐకాన్. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ‘కోల్డ్ వార్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బన్నీ పుట్టినరోజు విషయంలో మెగా ఫ్యామిలీ చూపించిన మౌనం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. గతంలో చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ బన్నీకి సోషల్ మీడియా ద్వారా హార్ట్‌ఫెల్ట్ విషెస్ చెబుతూ వచ్చారు. కానీ ఈ సారి? – నిశ్శబ్దం! ఇప్పుడు ఇది బర్త్‌డే విషెస్ మిస్ అవ్వడం కాదు. ఇది ఒక “సైలెంట్ పొలిటికల్ స్టేట్‌మెంట్” అంటున్నారు విశ్లేషకులు.
ఇండస్ట్రీలో ఇప్పుడే బన్నీకి పుష్ప తో ఉన్న పాన్ ఇండియా రేంజ్ కనిపిస్తే, అందిరికీ బన్నీ "ఇండిపెండెంట్ ఐడెంటిటీ" కన్‌స్ట్రక్సన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అంటే అందరూ ఒకే వేదికగా కనిపించే వాళ్లైతే… బన్నీ మాత్రం తనదైన దారిలో నడుస్తున్నాడనిపిస్తోంది.
మెగా మౌనం ఓపెన్ డిస్కనెక్ట్?
ఇది కేవలం సినిమా లెవెల్‌లో కాదు – పొలిటికల్ లెవెల్‌లో కూడా డిస్కషన్ కు దారి తీస్తోంది. మెగా ఫ్యామిలీకి రాజకీయంగా జనసేన బాసే లీడర్. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం… ఇది “పెద్ద తెర వెనుక రాజకీయ ప్రయోగం” అనే వాదనకు బలం ఇచ్చేస్తోంది.
ఇటీవల అల్లు అర్జున్ , మెగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కొంత ప్రతికూలంగా మారాయన్నది నిజం. 2024 లో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం మెగా అభిమానులను నిరాశపరిచింది. దీనితో, మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు పెరిగాయి.అయితే బన్నీ అరెస్ట్ సమయంలో అతను చిరంజీవి ఇంటికి వెళ్లడంతో గొడవలు సద్దుమణిగాయేమో అని అంతా అనుకున్నారు. కాని రామ్ చరణ్ పుట్టిన రోజుకి బన్నీ విషెస్ చెప్పకపోవడం మళ్లీ అనుమానాలు కలిగేలా చేసింది.
అవి అలాగే కొనసాగుతున్నాయని ఈ రోజు అర్జున్ పుట్టినరోజున , మెగా కుటుంబం నుండి ఎవరు శుభాకాంక్షలు చెప్పకపోవడంతోవిషెష్ చెప్పకపోవటంతో మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.
ఈ మౌనం కథను చెబుతుంది… చదవగలిగిన వారికి!
ఈ వ్యవహారాన్ని చిన్న విషయం అనుకుంటే పొరపాటే. ఇది టాలీవుడ్‌లోని రెండు పవర్ బ్రాండ్స్ – మెగా & అల్లు – ఇప్పుడు వేర్వేరు ట్రాక్‌లపై ప్రయాణిస్తున్నాయన్న సూట్ క్లియర్ సిగ్నల్. దీని ప్రభావం రాబోయే సినిమాలపై మాత్రమే కాకుండా, పొలిటిక్స్‌పైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది టాలీవుడ్ పవర్ డైనమిక్స్‌లో ఒక కీలక మార్పు సంకేతం.
అల్లు – మెగా: రెండు బ్రాండ్? ఒకే ఫ్యామిలీ… కానీ ఇప్పుడు ‘వేరు వేరుగా?
మెగా ఫ్యామిలీ అంటే మెగా బ్రదర్స్, మెగా డైనాస్టీ, మెగా ఫ్యాన్స్. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా సక్సెస్‌తో తనకంటూ ఓ ఇండిపెండెంట్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన్ని ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోగా కాకుండా – ఓ సొంత స్టార్ గా గుర్తించాలనే కోణం స్పష్టమవుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే: బన్నీ బర్త్‌డేకు విషెస్ మిస్ కాలేదు… మెసేజ్ బిగ్‌గా వచ్చింది.