బ్రేక్‌డాన్స్ Vs బ్రేక్ అయి కలలు: 'మూన్ వాక్' మూవీ రివ్యూ!

పాతతరం కాలాన్ని, యువతను రీ ఇమాజిన్ చేసిన సినిమా;

Update: 2025-07-12 11:59 GMT
మూన్ వాక్

1983లో మైఖేల్ జాక్సన్ స్టేజ్ మీద తొలిసారి 'మూన్ వాక్' చేశాడు. అది కేవలం ఒక డాన్స్ స్టెప్ కాదు — ఒక సాంస్కృతిక విప్లవం. ప్రపంచం మొత్తానికి, కళలతో కూడా విరుద్ధ దిశలో ప్రయాణించవచ్చునన్న ధైర్యాన్ని ఇచ్చింది.

ఓవైపు తేలికపాటి నడక, మరోవైపు అంతులేని ఆత్మ విశ్వాసం – ఈ మినిమలిజం వెనుక మెగా ప్రేరణ దాగి ఉంది. అది స్టెప్పే కాదు, ఓ స్టేట్‌మెంట్. ఈ ప్రభావం అమెరికాకే పరిమితం కాలేదు.

దక్షిణ భారతదేశంలోని ఓ చిన్న గ్రామంల్లోని యువకుల కలల వరకు చేరింది. స్కూల్ బ్రేక్ టైంలో, కళాశాల వార్షికోత్సవాల్లో, వీధిల్లో ఎక్కడ చూసినా ఓ టైమ్ లో మూన్ వాక్, బ్రేక్ డాన్స్.

అయితే ఇదంతా గతం. ఆ గతాన్ని ఈ ఫీలింగ్‌ను, ఆ తరం కలల ఉత్సాహాన్ని తెరపైకి తీసుకొచ్చింది మలయాళ చిత్రం ‘Moon Walk’ (2024). లిజో జోస్ పెల్లిస్సేరి తీసిన ఈ సినిమా, 1980ల కాలాన్ని కేవలం రీ–క్రియేట్ చేయలేదు — దాన్ని రీ–ఇమాజిన్ చేసింది.
ఒక తరం ఎలా డ్రీమ్ ని చూసిందో, సమాజం వ్యతిరేకమైనా ఎలా ఆ కల కోసం పోరాడిందో.. చూపెట్టే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించిందా. ఆ డ్రీమ్‌లోకి మనల్ని లాగేసిందా? ఆ సినిమా కథ ఏంటి?
స్టోరీ లైన్:
1980ల్లో కేరళ త్రివేండ్రమ్ దగ్గరలో ఓ చిన్న గ్రామం. అక్కడి ఆరుగురు కాలేజీ కుర్రాళ్లు – జాక్, శిబూ, వరుణ్, షాజీ, సుదీప్, అరుణ్. ఆ వయస్సులో అందరిలాగే చదవుకన్నా సరదాలకే ప్రాధాన్యత ఇచ్చే బ్యాచ్.
వాళ్లకు బాధ్యత కన్నా కలలే ఎక్కువ. సరదాగా,జాలీగా వెళ్లిపోతున్న వాళ్ల జీవితానికి ఓ రోజు లక్ష్యం ఏర్పడే సంఘటన జరుగుతుంది. అది సిటీ నుండి వచ్చిన యూత్ ఓ పోగ్రామ్ లో వాళ్ల ఊళ్లో డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ లో మైఖేల్ జాక్సన్ "మూన్ వాక్" స్టెప్ వేస్తారు. అది చూసిన తర్వాత, ఈ ఆరుగురు ఆలోచనలో పడిపోతారు.
ఆ స్టెప్ లో ఒక్కో అడుగు చూసి, వాళ్ల మైండ్ సెట్ మారిపోతుంది – “మనం కూడా ఇలా డాన్స్ చేయాలి,దున్నేయాలి!” అని ఫిక్సై పోతారు. అయితే అనుకుంటే సరిపోతుందా. ప్రాక్టీస్ చేయాలి. అందుకు గైడ్ లేడు. గురువు లేడు. ప్రాక్టీస్ కు స్దలం లేదు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు. సొసైట్ దృష్టిలో వీళ్లు పనిపాటా లేని బేవార్స్ గాళ్లు. అయినా వీళ్లు మాత్రం ముందుకు సాగుతారు. టీమ్ కి Moon Walkers అనే పేరు పెట్టుకుంటారు .
ఇంతలో వీళ్లని పర్శనల్ సమస్యలు వెంటాడతాయి. జాక్ తల్లి, చదువు మీదే దృష్టి పెట్టమని ఒత్తిడి చేస్తుంది. మరో ప్రక్క ప్రేమించిన అమ్మాయి బ్రదర్ తో తన్నులు తింటాడు వరుణ్.
మిగతా కుర్రాళ్లు పోలీసులు జుట్టు కత్తిరించి వదిలేస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఆ ఆ కుర్రాళ్లు ఎలా ముందుకు వెళ్లారు? 'మూన్ వాకర్స్'గా పేరు తెచ్చుకోవాలనే వాళ్ల ప్రయత్నం ఫలించిందా? ఈ కుర్రాళ్లు గెలుస్తారా? వారి స్టెప్ ప్రపంచం చూస్తుందా?
విశ్లేషణ
Moonwalk అనే టైటిల్ చూస్తే మనకు మైఖేల్ జాక్సన్ స్టెప్పులు, బ్రేక్‌డాన్స్ మేనియా, ఉత్సాహంగా స్టేజ్‌పై కదిలే యూత్ గుర్తొస్తారు. కానీ దర్శకుడు Vinod AK మాత్రం ఈ సినిమా ద్వారా డ్యాన్స్‌ను కాక, దాని వెనుక ఎనభైలనాటి సమాజాన్ని, రాజకీయ పరిస్దితులను, ఒక తరంలోని యువతను చూపించాలనుకున్నారు.
అందుకే ఈ సినిమా, సాధారణంగా ఊహించుకునే ‘ప్రారంభం – సంక్షోభం – పరిష్కారం’ అనే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పాటించదు. బదులుగా, ఇది జీవితంలోని తికమకల్ని, అస్పష్టతల్ని, ఎండ్‌కార్డుల్లేని ప్రయాణాల్ని పటాలెక్కించే ప్రయత్నం చేస్తుంది.
అంటే ఇది అసలు డ్యాన్స్ సినిమా కాదా? అనిపించవచ్చు. కానీ ఇది తప్పనిసరిగా డ్యాన్స్ ఫిల్మ్ కాకపోయినా, మైఖేల్ జాక్సన్ ని గుర్తు చేస్తూ మూన్ వాక్ అని పెట్టడంలో దర్శకుడి వ్యూహం స్పష్టంగా అర్థమవుతుంది.
పాత్రల వెనుక కథలు, స్టెప్పులకి ముందు సంఘర్షణలు
ఈ సినిమా సుమారు 1 గంట 58 నిమిషాల నిడివి కలిగి ఉన్నా, ఇందులో ఎక్కువ భాగం పాత్రల బ్యాక్‌స్టోరీలను వివరించడానికే కేటాయించటం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉంది — కుటుంబాల్లోని నిర్లక్ష్యం, సమాజపు అణచివేత, చట్టం వ్యంగ్య దృష్టికోణం అన్నీ స్క్రీన్ మీద మనం చూస్తాం.
డ్యాన్స్ మాత్రం చాలా వరకూ బుల్లెట్ పాయింట్లు లా కనిపిస్తుంది. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే కొన్ని కీలక పాత్రలతో మనం భావోద్వేగంగా కనెక్ట్ కావడం కష్టం అవుతుంది.
ఒకే ఒక్క పాత్ర — ‘సుర’, అంటే Sibi Kuttappan పోషించిన పాత్రతో మాత్రమే మనం ఆత్మీయంగా కనెక్ట్ అవగలుగుతాం. అతను తన మీద జరుగుతున్న వివక్షను నిశ్శబ్దంగా ఎదుర్కొన్న తీరు, చివర్లో తన స్టేజ్ ప్రెజెన్స్ ద్వారా సమాధానం ఇచ్చే తీరు మన హృదయాన్ని గెలుస్తాయి.
 టెక్నికల్ స్పెక్స్:
సంగీతం (Prashanth Pillai): బలమైన రెట్రో సౌండ్ స్కేప్. 80ల ఫీలింగ్‌కి తగ్గ మ్యూజికల్ టోన్.
సినిమాటోగ్రఫీ: అర్ధరాత్రి వీధుల్లోకి తీసుకెళ్లే లైట్ టెక్స్చర్, నేచురల్ కలర్స్ – అప్పటికాలం గుర్తు చేసే విజువల్స్.
ఎడిటింగ్: కొన్ని డ్యాన్స్ సీన్స్‌లో ఎడిటింగ్ అతి అయిందని చెప్పవచ్చు. స్టెప్పుల కంటే కట్స్ ఎక్కువగా కనిపించడంతో వావ్ మోమెంట్ మాయం అయ్యింది.
ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నటుల్లో Siddharth Babu మినహాయిస్తే అందరూ కొత్తవాళ్లే. కానీ ఆ కొత్తదనమే సినిమాలో న్యాచురల్ కెమిస్ట్రీకి ప్రాణం పోసింది.
ఫైనల్ థాట్
Moonwalk కేవలం ఒక అండర్‌డాగ్ స్టోరీ కాదు. ఇది ఒక తరం తడబాటు. డ్యాన్స్, సంగీతం, వర్ణవివక్ష, సమాజపు వివక్ష, కలల బలహీనత... అన్నింటినీ కలిపి చెప్పే ఒక పొలిటికల్ కామెంటరీ. అలాగే ఈ చిత్రం మైఖేల్ జాక్సన్ శైలిని అనుకరించదు.
బదులుగా, మైఖేల్ అనే కలల ప్రతీకను తీసుకుని — మన ఊరి పిల్లాడి కలల్లో ఎలా మిగిలిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనం బ్రేక్‌డాన్స్ కోసం కాదు, బ్రేక్ అయిన కలలను మళ్ళీ కూర్చేసే ధైర్యం కోసం ఈ సినిమా చూస్తాం.
ఇది ఒక స్టెప్ కాదు…
ఒక కాలానికి చెందిన పిల్లల అడుగుల ఆలాపన.
ఎక్కడ చూడచ్చు?
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.
Tags:    

Similar News