జపాన్ పాపులర్ వీడియో గేమ్ లో రాజమౌళి, షాకింగ్ ఎంట్రీ!

ఇప్పుడు కథలు చెప్పే రాజమౌళి కాదు… కథల్లో కనిపించే రాజమౌళి!;

Update: 2025-06-25 03:08 GMT

ఇది నిజంగా ఊహించని సర్‌ప్రైజ్. ఒక్కసారి ఊహించండి — దర్శకధీరుడు రాజమౌళి ఓ వీడియో గేమ్ కోసం కెమెరాల ముందు నిలబడటం! ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ న్యూస్.

ఒకవేళ సినిమాకోసం అయితే ఎవరూ ఆశ్చర్యపడి ఉండకపోవచ్చు. కానీ ఇది సినిమా కాదు, ఓ ఇంటర్నేషనల్ వీడియో గేమ్ కోసం! అది కూడా ఓ క్లాసిక్ లెవెల్ గేమ్ — డెత్ స్ట్రాండింగ్ 2.
జపాన్‌కు చెందిన లెజెండరీ గేమ్ క్రియేటర్ హిడియో కొజిమా రూపొందిస్తున్న ఈ గేమ్‌కి ఇప్పటికే హాలీవుడ్ స్టార్లు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్, లియా సెడాక్స్‌లాంటి టాలెంట్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల సరసన మన రాజమౌళి... ఇంకా అతని కుమారుడు కార్తికేయ కూడా క్యామియోగా భాగమవుతున్నారు.


రాజమౌళి – కొజిమా కలయిక ఎలా జరిగింది?
ఈ ప్రయాణం మొదలైంది 2022లో. RRR జపాన్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి జపాన్ వెళ్లినప్పుడు హిడియో కొజిమాతో పరిచయం అయ్యారు. సన్నిహితంగా సంబంధాలు ఏర్పడుతూ, జక్కన్న కొజిమా స్టూడియోను కూడా సందర్శించారు. అక్కడ బాడీ స్కానింగ్ టెక్నాలజీ ద్వారా 3D క్యారెక్టరైజేషన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పరిచయం ఇప్పుడు డెత్ స్ట్రాండింగ్ 2 లో భాగస్వామ్యంగా మారింది. రాజమౌళి , కార్తికేయ ఈ గేమ్‌లో “The Adventurer” మరియు “Adventurer’s Son” అనే పేర్లతో కనిపించనున్నారు. డిజిటల్ డీలక్స్ & కలెక్టర్ ఎడిషన్ వినియోగదారులు ముందే ఈ క్యామియోలను గమనించడంతో గేమింగ్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్ వైరల్ అయింది.
సినిమా కాదు, గేమ్ – కానీ కథ మాత్రం స్పెషల్
ఇది కేవలం కంటెంట్ ఫిల్లింగ్ కోసం వాడిన గెస్ట్ అప్పియరెన్స్ కాదంటున్నారు. ఈ పాత్రలు గేమ్ కథనంతో కలిసిపోయేలా రూపొందించారని చెబుతున్నారు. సినిమా మేకింగ్‌లో ఎన్నో ప్రపంచాలను సృష్టించిన రాజమౌళి... ఇప్పుడు వర్చువల్ వరల్డ్‌లో అడుగుపెట్టి, అక్కడి ప్రేక్షకుల్ని తన క్రియేటివ్ వైభవంతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.
గేమ్ రిలీజ్ ఎప్పుడు?
ఈ రియల్ గేమింగ్ ఎడ్వెంచర్ జూన్ 26, 2025న ప్లే స్టేషన్ 5లో అధికారికంగా విడుదల కానుంది. రాజమౌళి పాత్ర ఎంతసేపు కనిపిస్తుంది? కథలో అతని పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంది? అన్నది సీక్రెట్‌గా ఉంచారు. కానీ గేమింగ్ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే హైప్‌లోకి వెళ్లిపోయారు.
ఫైనల్‌గా ...
తెలుగు సినిమా పేరుని అంతర్జాతీయ గేమింగ్ మ్యాప్ మీద ఉంచడమంటే ఓ పెద్ద విజయం. "బాహుబలి"తో సిల్వర్ స్క్రీన్‌ను శాసించిన జక్కన్న, ఇప్పుడు డెత్ స్ట్రాండింగ్ 2 గేమింగ్ ప్రపంచాన్ని ఆలోచింపజేయబోతున్నాడు.
ఒక్క సినిమా దర్శకుడిగా కాదు… క్రియేటివ్ పర్శన్ గా, ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి మరొక మెట్టు ఎక్కేశాడు. ఇది కొందరికి అది షాక్, మరికొందరికి ఇంట్రెస్ట్, కానీ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అయిపోయారు. ఎందుకంటే రాజమౌళి అంతర్జాతీయంగా తెలుగు ప్రతిష్ఠను పెంచడంలో మరో అడుగు వేయడమే ఇది.

ఇప్పుడు కథలు చెప్పే రాజమౌళి కాదు… కథల్లో కనిపించే రాజమౌళి!


Tags:    

Similar News