పిల్లల ఇక్కట్లు – తల్లిదండ్రుల పాట్లు

ప్రత్యేక అవసరాల పిల్లలు-విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు క్లినికల్ సైకాలాజిస్టు డాక్టర్ పాండు కామ్టేకర్;

Update: 2025-08-05 06:15 GMT
Source: mbcnschool.org (Mata Bhagwanti Devi Chadha charitable trust )

“అయ్యా , నా బిడ్డకు autism. ఒక ప్రైవేట్ థెరపీ సెంటరుకు వెళ్ళినాను. స్పీచ్ థెరపీ, ఆక్యు పేషనల్ థెరపీ, ఫిజియో థెరపీ, బిహేవియర్ థెరపీ లాంటివి ఇప్పించాలని అన్నారు, ఒక్కొక్క దానికి రూ10,000 లు నెలకు చొప్పుల ఫీజు అడుగుతున్నారు. నేను ఒక ప్రైవేట్ కంపైనిలో ఆయాను , నాకు వారు 9,000 రూపాయలు జీతం వస్తుంది.. మా వారు సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తే అతనికి 10,000 రూపాయల జీతం వస్తది, మొత్తం 19,000 వేలూ మా నెల సంపాదన. నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళను ఎలా చదివించాలి. నేను ఎలా బతకాలి. మా ఇంట్లో అందరం పని చేస్తేనే పూట గడవని పరిస్థితి. మేము ఇలాంటి పిల్లలను చూస్తూ ఇంటి వద్ద వుండీ ఎలా బతుకాలి. మాకే ఇలాంటి బిడ్డను దేవుడు ఎందుకు ఇచ్చాడు” అంటూ తన గోడు విని పించింది ఒక తల్లి.

“అయ్యా డాక్టరు గారు , మా అమ్మాయి పెద్దగా అయిననూ మాటలు రావడం లేదు.” అని ఒక తల్లి గోడు. “ ఏమండీ మన పాప ఒక దగ్గర కూర్చోవటం లేదు.నిలకడ లేదు. తరగతి అంత కలియ తిరుగుతూ మిగతా పిల్లలకు ఇబ్బంది కలిగిస్తుందని వాళ్ళ టీచరమ్మ పిర్యాదు”.

ఇలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది ఉన్నారు. వీరిని ప్రత్యేక అవసరాలుగా గల పిల్లలు అని అంటున్నారు, ఇంతకు ఈ ఆటిజం, ADHD ఏమిటి ? విభిన్న ప్రతిభా వంతులు( Mental Retardation)ఏమిటి? నిర్దిష్ట అభ్యసన లోపాలు( Specific Learning Disability) అంటే ఏమిటి ?వీరి లక్షణాలు ఏమిటి? నివారణ ఏమిటి? తదితర తీరు తెన్నులను సంక్షిప్తంగా పరిశీలిద్దాం.

ఇలాంటి సమాజములో ప్రతి 60-70 మందిలో ఒకరు ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో గల ఆటిజం ,ADHD, విభిన్న ప్రతిభా వంతులు( Mental Retardation), సెరెబ్రల్ పాల్సి , వీటితో నిర్దిష్ట అభ్యసన లోపాలైన(Specific Learning Disorders) వారు, అందులో చదవడంలో ఇబ్బంది(Dyslexia), రాయడం లో ఇబ్బంది(Dysgraphia),గణిత ప్రాతః మిక భావనలు అర్థం చేసుకో లేక పోవడం (Dyscalculia), ఇంకా పలు విదాల లోపాలు( Multiple Disabilities), సెరెబ్రల్ పాల్సి లాంటివి మొదలైనవి ఉన్నాయి. ప్రత్యేక అవసరాల వ్యక్తుల హక్కులు( RPWD) చట్టం ప్రకారం 21 వైకల్యాలను గుర్తించబడ్డవి

ఇవి నరాలకు సంబంధించిన రుగ్మత(Neurodevelopmental Disorder ) కిందికి వస్తవి. ఇది వంశ పారం పర్యంగా గాని , మరే ఇతర అనారోగ్య కారణాలు గాని కావచ్చు. కాని కచ్చితంగా ఇదే కారణమని చెప్పలేము.

లక్షణాలు : శ్రద్ద , ఏకాగ్రత లేకా పోవడం, ఒక దగ్గర నిలకడ లేక పోవడం, మాట్లాడ లేక పోవటం, ఇతరులు మాట్లాడితే అర్థం చేసుకోలేక పోవడం, సంభాషణలో ఇబ్బంది పడటం, ఏదో ఒక వస్తువుకు గాని, బొమ్మకు గాని , ఒక వ్యక్తిగాని అతుక్కు పోవడం, ఒంటరిగా ఉండటం, అందరి పిల్లల్లో కలువక పోవడం, మాట్లాడు నప్పుడు కళ్ళలోకి చూడక పోవడం, చేతి సంజ్ఞలు, శరీర బంగిమలకు స్పందించక పోవడం, భావోద్వేగాలు, అసంబద్దముగా ఉండటం, మాటలు సరిగ్గా మాట్లాడలేక పోవడం, చెప్పిన మాటను గాని, వాక్యం గాని పదే పదే చెప్పటం, మళ్ళీ మళ్ళీ చేతులు, కాళ్లు , తల ఊపడం, వస్తువులను పట్టి పట్టి చూడడం , వాసన చూడడం, శబ్దాలను వినడం తదితర లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరిలో అన్నీ ఉండవచ్చు, కొన్ని మాత్రమే ఉండవచ్చు, తీవ్రత కూడా ఎక్కువ తక్కువ ఉండ వచ్చును.ఇంకా కొందరికి సరిగ్గా చదువలేక పోవడం, కొందరు రాయలేక పోవడం. ఇంకా కొందరు చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేక పోవడం లాంటి ఉమ్మిడి లోపాలతో కుడిన తదితర లక్షణాలు. తమ వయస్సుకు, తరగతికి తగిన స్తాయిలో వారి అభివృద్ది లేక పోవడం, చదువులో వెనుక బడడం, పిల్లలందరి చేత ఎగతాళికి గురియావుతారు. ఇలాంటి పిల్లల తల్లి దండ్రులు కూడా చాలా వివక్ష ను ఎదుర్కుంటారు. బందులవులు చిన్న చూపు చూసి పక్కకు పెట్టుతారు. కొందరికి ఇల్లు కూడా కిరాయికి ఇవ్వరు. ఇలా వీరి ఇక్కట్లు వర్ణనాతీతం.

ఎప్పుడు గుర్తించడం : దీని మూడేండ్ల లోపు కూడా మీరీ ప్రవర్తన బట్టి , కనబడే విధానమును, పద్దతిని బట్టి ఏదైనా అనుమానం వస్తే క్లినికల్ (Clinical Psychologist)ను లేదా రెహబ్ సైకలజిస్ట్( Rehab Psychologist) తదితర మొదలైన నిపుణులను కలిసి తగు మానశిక పరీక్షలు చేయించుకోవాలి. ఆ నిపుణులు అభివృద్ది లబ్ది( Developmental Quotient), సామాజిక లబ్ది( Social Quotient),ప్రజ్ఞ లబ్ది( intelligence Quotient), ఆటిజం(Autism), ADHD( Attention Deficit Hyper Activity Disorder) లాంటి తదితర పరీక్షలు చేస్తాడు. దానితో పాటు పుట్టు పూర్వోత్తరాలు వివరాలు పరిశీలించి పిల్లల ప్రవర్తన లోపాలను ఏ స్తాయిలో , ఎంత తీవ్రతగా ఉన్నావో అంచనా వేస్తారు . ఈ వ్యవహారం పూర్తి చేయుటకు సుమారు గంట లేదా గంట పైనే కూడా సమయం పడుతుంది. అందుకు తల్లి దండ్రులు కూడా సిద్దముగా ఉండ వలెను. తొందర పెట్టరాదు వచ్చే ముందే భోజనం టిఫిన్ లాంటివి చేసి ఒక అర గంట తరువాత వస్తే మంచిది.

చికిత్సా అవసరాలు ; పై పరీక్షల ఆధారంగా అతడి ప్రత్యేక పరిశీలన, వివిధ ప్రశ్నలతోనూ లోపాల తీవ్రత గల వారిని వివిధ నిపుణుల వద్దకు సిపారస్ చేస్తాడు. మాటలకు స్పీచ్ థెరపీ, చేతితో పట్టుకోవడం, రాయడములో గల లోపాలకు ఆక్యుపేషనల్ థెరపీ (occupational Therapy), నడవడం, పరుగెత్తడం, బరువులు ఎత్తడం లాంటి వాటికి ఫిజియో థెరపీ(physiotherapy), ప్రవర్తన లోపాలకు బిహేవియర్ థెరపీ ( Behavior therapy ), మరియు స్పెషల్ టీచర్( Special Educator) లాంటి వారిని సిపారస్ చేస్తాడు. ఇంకా కొందరికి నరాల వైద్యుని(neurologist) , మానశీక వైద్యుని (psychiatrist), పిల్లల డాక్టర్(Pediatrician), లాంటి తదితరుల అవసరము కూడా కలుగ వచ్చు.

థెరపీ, శిక్షణ విధానం : వీరికి శిక్షణ ఇచ్చే వాళ్ళ టీచర్ కాని తెరపిస్ట్ గాని ఇవ్వన్నీ కూడా సాదారణంగా ఒకరు-ఒకరు ( one to one )చేయాల్సి ఉంటుంది. మైక్రో గ్రూప్ ( 1- 10 లేదా 12 మంది)లో బోధిన చేయవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఇందులో ఒకరు బోధిస్తూ ఉంటే ఇంకొకరు లేదా ఇద్దరు టీచర్లు కూడా అదే తరగతిలో ఉండీ, ఆ పిల్లలకు సహాయం చేయవలసి ఉంటుంది. వీరితో పాటు ఆయాల సంఖ్య, మరియు ఆయాల పాత్ర కూడా చాల ఎక్కువగా ఉంటుంది. దీనికి బోధనా పరికరాలు , టీచింగ్ మేటెరియల్ కూడా ఎక్కువగా అవసరం అవుతాయి. కొన్నింటిని టీచర్లు తయారు చేస్తే , కొన్నింటిని మార్కెట్ లో తెచ్చుకోవాలి.వీటిని పిల్లలు తొందరగా పగుల గొట్టడం గాని , చింపడం గాని ఎక్కువగా జరుగుతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ మెటీరీయల్ తయారు చేయడం లేదా కొనడం జరుగుంది. ఇది కొత్తగా చూసే వాళ్ళకు ఇదేమి బొమ్మలాట మాదిరి కనుపించి , ఇలాంటివి మేము కూడా చేస్తాం , చెప్పుతాము అనుకుంటారు. కాని ఇది అంత సాదారణ టీచర్ మాదిరి కాదు. ఎంతో నైపుణ్యంతో, ఓపికతో నేర్పించ వలసి ఉంటుంది. ప్రగతి కూడా అంత తొందరగా చూడలేము. కొందరికి మూడు నెలల్లోను, కొందరికి ఆరు నెలల్లోను, ఇంకా కొందరికి సంవత్సరాల సమయం కూడా తీసుకోవచ్చు. అభివృద్ది కూడా కొంచం కొంచెం మెల్లగా పెరుగుతుంది. ఎలా ఏ స్తాయిలో పెరుగు తుందో కచ్చితంగా చెప్పలేము. కాని మధ్యలో ట్రైనింగ్ ఆపితే మళ్ళీ మొదటికే వస్తుంది. కొందరు తల్లి తండ్రులు ఇక్క కాదు అని అక్కడ , ఇక్కడ కాదు అంటూ ఇక్కడ కేంద్రాలను స్కూల్స్ మారుస్తూ ఉంటారు. అప్పుడు కూడా అభివృద్ది తగ్గిపోతుంది.

అంతేకాక ఈ ప్రత్యేక బడులకు సరిపడ స్థలం, అందులో సెన్సరి పార్కు , ర్యాంప్ , కింద పడ్డ దెబ్బలు తగలకుండా ప్లాస్టిక్ షీట్లు, ప్రత్యేక టాయిలెట్లు తదితరాలు ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక స్పెషల్ స్కూల్ పెట్టాలంటే, వృత్తి పై మమకారం , పిల్లలపై ప్రేమ వాత్సల్యం, చేయాలన్న తపన ఉండాలి మరియు క్రమ పద్దతిలో నడుపాలన్న ఒక ఛాలెంజ్ తో కూడిన పని.

ప్రత్యేక బోదన నిపుణులు : వీరి అవసరాలకు అనుగునంగా వివిధ రకాల శిక్షణ బోధన నిపుణుల అవసరం ఉంటుంది. వీరు ముఖ్యంగా ప్రత్యేక ఉపాద్యాయులు( special teacher), ఫిజియో తెరపిస్ట్( physio therapist,) అక్కుపేషనల్ తెరపిస్ట్ ( occupational therapist), క్లినికల్ లేదా రెహబ్ సైకాలజిస్ట్(clinical or rehab psychologist) తదితర మొదలగువారు కావాలి . ఇందులో డిప్లొమా , గ్రాడ్యూయేట్ , పోస్ట్ -గ్రాడ్యూయేట్ ఆపై స్థాయిల్లో రెండు నుండి మూడు, నాలుగు, ఐదు ఏళ్ల కోర్సులు చదినవారు. ఇంకా కొందరు ఈ కోర్సులలో చెవిటి( hearing impaired), అంధులకు (visual impaired ), మానసిక వైకల్యం (mental retardation), నిర్దిష్ట అభ్యసన లోపాలకు( specific learning disorder)లాంటి తదితర ఉప- శాఖలలో కూడా ప్రత్యేక కోర్సులు చదివిన వారు ఆయా అవసరాల పిల్లలకు బోధిస్తారు. ఇవ్వన్నీ కూడా పూర్తికాల కోర్సులు మరియు ఆసుపత్రి మరియు శిక్షణ కేంద్రాలకు అనుసంధానమై నమై ఉంటాయి. ఈ కోర్సుల రూపకల్పన, సిలబస్ తయారీ, శిక్షణ కాల పరిమితి , అంతర్గత ప్రాక్టికల్ పరిశీలన( internship) లాంటివి అన్నీ కూడా భారత పునరా వాస సంస్థ ( Rehabilitation Council of India) నియంత్రిస్తుంది. ఈ నిపుణులు తప్పనిసరిగా భారత పునరావాస సంస్థ యందు రిజిస్టర్ చేసుకుని, రిజిస్టర్ నెంబర్ కచ్చితంగా కలిగి ఉండాలి.

ఇంతకు అసలు విషయం ఏమిటంటే ఈ కోర్సులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నవి. వాటి సంఖ్య కూడా చాలా తక్కువ. వాటి నుండి వచ్చే నిపుణుల సంఖ్య అవసరాలకు అసలు సరిపోదు. వారిని వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. వాటితో పాటు ప్రభుత్వేతర (NGO) సంస్థలు , మరియు ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా నిర్వహించిన డాకలాలు లేవు. వాటి ఫీజులు కూడా సామాన్య ప్రజలకు మరియు అట్టడుగు వర్గాలకు అందు బాటులో లేవు.మన దేశంలో ఆధరణ లేక, అరకొర జీతాలు, ఉపాది ఉద్యోగాలు లేక చాలా మంది విదేశాలకు పోతున్నారు. ఏవిదంగా చూసిన నిపుణుల కొరత , ప్రభుత్వము చేత నడుపబడే ప్రత్యేక బడులు లేక ఈ ప్రత్యేక అవసరాల పిల్లలకు తీవ్ర తీరని అన్యాయం జరుగుతున్నదని చెప్పా వచ్చు. ఆ పిల్లల తల్లి తండ్రుల బాధలు దేవునికే తెలుసు.

ప్రభుత్వ సహాయం : ప్రత్యేక అవసరాళం వారికి కూడా కొన్ని చట్టలున్నాయి. ప్రత్యేక అవసరాల (persons with disability) చట్టం 1995, నేషనల్ ట్రస్ట్ చట్టం(National trust act), ప్రత్యేక అవసరాల వ్యక్తుల హక్కుల( rights of persons with disabilities ) చట్టం 2016 లనివి వున్నాయి. వాటి ప్రకారం నెలసరి పింఛన్లు , ఇతర సదుపాయాలు , పథకాలు మాల చేయాలని స్పస్టంగా చెబుతున్నాయి. అందు లో కొన్ని నేషనల్ ట్రస్ట్ చట్టం పథకాలు :

1. GHARAUDA (group home and rehabilitation activities under national trust act for disabled adults) అనే పథకం కింద ఆటిజం, సెరెబ్రల్ పాల్సి, మానసిక వికలాంగులు, ఒకటి కంటే ఎక్కువ వైకల్యం కలవారు నామ మాత్రం రుసుము తో దీర్గకాలికంగా ఉండుట కొరకు ఒక వసతి గృహ ములు ఏర్పాటు చేయడం.

2. పూర్వ శిశు కేంద్రాలు ( day care center ):0- 6 సంవత్సరాల లోపు గల పిల్లలను సాదారణ బడికి, ప్రత్యేక పాఠశాల కు సంసిద్దం చేసే కేంద్రాలు ఏర్పాటు చేయడం.

3. ఉద్దం ప్రభ : ఆర్థిక స్వయం ఉపాది కొరకు 3-5 శాతం సబ్సిడీ తో బాంకు నుంది అప్పులు ఇప్పించడం.

4. Niramaya card: ఆరోగ్య బీమా కింది వివిద తెరపీలకు, ఆసుపత్రి ఖర్చులకు యాడాదికి ఒక లక్ష లోపు అర్థక సహాయం ఇప్పించ బడును.

5. గ్యాన్ ప్రభ: చదువుకునే విద్యార్థులకు నెలకు ఱస్ 700/- scholarship ఉంటుంది.

ఇలా ఎన్నో తదితరాలు ఉన్నాయి. అందులో ఒక నిరామయ , నెలసరి పింఛన్లు వస్తున్నాయి. ఇంకా వీటితో పాటు జిల్లాకు ఒకటి చొప్పున జాతీయ బాల ఆరోగ్య కార్యక్రమం(RBSK), జిలాకు ఒకటి జిల్లా పూర్వ విద్యా కేంద్రాలు (DIEC), ప్రతి మండలానికి రెండు లేదా మూడు భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేక బోధన ఉపాద్యాయులు(IERT) ఉన్నారు. వీరు కూడా చాలా మంది ఒప్పంద జీతాలే. అయినప్పటికీ ఈ కేంద్రాలు , ఉపాధ్యాయులు ఏమాత్రం సరిపోవడం లేదు. వీటిని ఇంకా చాలా మంది వినియోగించుకోలేక పోతున్నారు.

మానవ వనరుల లేమి: ఈ సరళీకరణ , ప్రైవేటీకరణ , ప్రపంచీకరణ , పెరిగిన సాంకేతిక, వైజ్ఞాన అభివృద్ది ఫలితంగా సమాజం పెనుమార్పులకు లోనవుతుంది. దాని ప్రభావం చేత జీవన శైలిలోనూ , ఉమ్మిడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవడం కావచ్చు , మితి మీరిన ఆర్థక పోటీ, అసూయ , అసమానతలు, ఆహారపు అలవాట్లు , తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు , మద్యపానం, దూమ పానం , కాలుష్యం , కల్తీ ఆహారాలు, job లేదా పని ఒత్తిళ్లు, తల్లి గర్బం తో ఉన్నప్పుడు ఒత్తిళ్లు, కుటుంబ , బార్య భర్తల కలహాలు ఉద్యోగ భద్రత లేకపోవడం లాంటి పలు కారణాల చేత ఈ ప్రత్యేక అవసరాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కావచ్చు . వీరి తల్లి తండ్రు లు కూడా ఒత్తిడికి లోనై మానసిక సమస్యలకు గురియావుతున్నారు.

“ప్రతి గ్రామ పంచాయతీ పరిదిలోనే 10-12 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నారు. అక్కడ ఒక ప్రత్యేక పాఠ శాల పెట్టాలి “ అని స్పెషల్ టీచర్ నొక్కి చెప్పాడు.” ఈ మద్య సుప్రీం కోర్టు కూడా గత 10 సంవత్సరాలుగా అవుట్ సోర్సు ద్వారా పని చేస్తున్న ప్రత్యేక టీచర్ల ను క్రమబద్దీకరించమని తీర్పు చెప్పింది కూడా” ఇంకొకరు గుర్తు చేసినారు.

GARAUDA షెల్టర్ హోమ్ లు ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ప్రభుత్వమే నిర్వహించాలి.

CRI గుర్తించిన కోర్సులు బడుగులకు, పేదవాడికి అందని ద్రాక్ష పండు మాత్రమే. ఇప్పటికీ వరకు గల నిపుణులు కూడా ప్రైవేట్ సంస్థలలో అధిక మొత్తములో ఫీజులు చెల్లించి వచ్చిన ధనవంతుల కుటుంబాల వారే.. వారంతా వ్యాపార పరంగా ఆలోచన గల కార్పొరేట్ మాదిరి టైనింగ్ సెంటర్లు పెట్టి వేలకు వేలు ఫీజులు గుంజుతున్నారు. ఈ పరిస్తితిలో తల్లి దండ్రులు దిక్కు దోచకుండా ఉన్నారు” ఉన్నారు ఇంకొకరు వివరించాడు.

అందుకు మానవ వనరులను అనగా నాణ్యమైన నిపుణులను ఎక్కువగా తయారీ చేయ వలసిన అవసరం చాలా ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఒకటి - రెండు బొటా బోటి సంస్థలు , ప్రభుత్వే తర సంస్థలు కోర్సులు పెట్టితే మాత్రమే సరిపోదు. రాష్ట ప్రభుత్వం ఆద్వర్యములో కూడా సంస్థలను నెలకొల్ప వలేను. తద్వారా నిపుణుల సంఖ్య పెంచాలి.అవసరమైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. పరిశోదన-అభివృద్దిని( Research &Development) ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలి.

కొన్ని జిల్లాలలో ఒక్కరంటే ఒకరు కూడా నిపుణులు లేరు. ఉదా : స్పీచ్ తెరపిస్ట్ , ఆక్యు పేషనల్ తెరపిస్ట్ , క్లినికల్ సైకాలజిస్ట్ లాంటి వారు అసలు కనిపించడం లేదు. వీరు లేక సరిగ్గా అంచన (assessment) సరిగ్గా చేయలేక ఎందరో పేద , బడుగు , గ్రామీణ, ఆదివాసీలు డిసబిలిటీ సర్టిఫికటే పొందలేక పోతున్నారు. తద్వారా ప్రభుత్వం నుండి పొందే సహాయానికి పతకాలకు దూరమవుతున్నారు.

ఏది ఏమైనా ప్రత్యేక అవసరాల పిల్లలను మనం అంత నిర్లక్ష్యం చేస్తున్నమన్నది పచ్చి నిజం. వీరి గురించి ఆలోచించి , అర్థం చేసుకుని విద్యా వంతులు , మేదావులు, పాలకులు, అధికారులు, మానవ హక్కుల కార్య కర్తలు, బాలల హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, సోషల్ మీడియా మరియు సమస్త సమాజం ప్రత్యేక అవసరాల పిల్లల గురించి మంచి చేస్తారని ఆశిస్తున్నాను.

Tags:    

Similar News