కండువా వెనుక ఇంత కతుందా మాస్టారూ!
కండువా వేసుకోవడం ఇవేళ నామోషీ అయింది కాని ఇంతకుముందు బయటికెళ్లే ప్రతి ఒక్కళ్లూ భుజానా వేసుకునే కదూ వెళ్లేవారు. ఒక్క కండువాతో దేశమంతా తిరిగొచ్చినోళ్లు ఎందరో;
పైపంచ అంటే పైన వేసుకునే పంచ లేదా కండువాకి ఇంత కథ ఉందా.. కథకు మించి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఆవేళ బయటికెళ్లే ప్రతి ఒక్కళ్లూ భుజానా కండువా వేసుకుని వెళ్లేవారట...
ఒక్క కండువా ! ఎన్ని ఉపయోగాలో ?
.
ఎడమ వైపు వేసుకుంటే భార్య జీవించి ఉంది అని అర్ధం
.
కుడివైపు వేసుకుంటే భార్య చనిపోయింది అని అర్ధం
.
రెండువైపులా వేసుకుంటే గౌరవ సూచకం
.
నెత్తిమీద వేసుకుంటే దివాలా తీసినట్టు, లేదా విచారంగా ఉన్నట్టు
.
తలకు చుట్టుకుంటే పాగా వేసేసినట్టు
.
ముఖం చుట్టూ కట్టుకుంటే ఎండలో గానీ చలిలో గానీ రక్షణ కల్పించుకున్నట్టు
.
నడుముకు చుట్టుకుంటే వీరత్వం ప్రదర్శిస్తున్నట్టు
.
తలకు చుట్టుకుని చెవులను కవర్ చేసి గడ్డం దగ్గర ముడి వేస్తే చలి బారినుండి రక్షించుకున్నట్టు
.
తలకు చుట్టుకుని వెంక ముడి వేసి అంచులు వేలాడదీస్తే దుమ్మునుంది రక్షణ కల్పించుకున్నట్టు
.
తల ముక్కులను రెండూ కవర్ చేస్తే మీ ముఖం ఎవరూ గురుతు పట్టకూడదు అని భావిస్తున్నట్టు .
.
ముక్కును మాత్రం కవర్ చేస్తే చాలా అపరిశుభ్రమిన వాతావరణం లో మీరు ఉన్నట్టు .
.
కూర్చుని కండువా ఎడమ భుజం మీద వేసుకుని రెండు చేతులతో అంచులు పట్టి ఉంటె ఆశీస్సులు కోరుతూ అక్షంతలు అర్దిస్తున్నట్టు
.
కూడా సంచి లేకపోతే ఏదైనా వస్తువు మూటకట్టుకోడానికి.
సేకరణ.. గొర్రెపాటి రమేష్ చంద్రబాబు