'శేషాచల కొండకోనల్లో'.... పుస్తక ఆవిష్కరణ సభ...

భూమన్ వారి శేషాచల ట్రెక్కింగ్ లను, వారి ఇతర ప్రయాణ అనుభూతులను, అనుభవాలను వివరిస్తూ రాసిన సచిత్ర పుస్తకమే 'శేషాచల కొండకోనల్లో'....;

Update: 2025-02-19 11:28 GMT

రచతిబభరుపతి సమీపంలోని ఇండిస్ట్రియల్ సిటి  ‘శ్రీ సిటీ’ వ్యవస్థాపక మేనేజంగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి చేతుల మీదుగా, శ్రీ రామ చంద్రా రెడ్డి  పర్యవేక్షణలో శ్రీ సిటీ, బిజినెస్ సెంటర్ వేదికగా మొన్న శనివారం (15-2-25) వ తేదీన ఆహ్లాదకరమైన వాతావరణంలో పుస్తకం ఆవిష్కరించ బడింది.

పుస్తకంలో..
అద్భుత పద ప్రయోగాలు కోసం వెతకొద్దు....
అమోఘ సంధిసమాసాల కోసం చూడొద్దు......
విశేషణ విశేషాల.. విషయం కాదు .... 

పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి

వాడుక బాషాలో, సరళమైన మాటలతో, రోజువారీ వ్యవహారిక యాసలో తన మనసు మూలల్లో నుండి వచ్చిన పదాలతో ఆయన చేసిన శేషాచల 'తీర్థ' యాత్రల ట్రెక్కింగ్ లు మరియు ఇతర ప్రయాణ అనుభవాలను, ఆయా సందర్భాల్లో వారి మనసు పొందిన సుతి మెత్తని అనుభూతులను సచిత్రంగా వివరించిన పుస్తకం.

డా. శ్రీ రవీంద్ర సన్నారెడ్డి  ప్రారంభోపన్యాసం చేస్తూ మనం ఎంతో పవిత్రంగా భావించే శేషాచల తీర్థ ప్రదేశాల మీద పుస్తకం రావడం అదీ భూమన్  లాంటి వారు వ్రాయడం చాలా గొప్ప విషయమని, తన చేతులతో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
అంతే కాకుండా శ్రీ సిటీ, శ్రీ వాణి (శ్రీ వాణి అనేది Sri Siti's Cultural and Literary wing ) తరపున ఒక రెండు వందల పుస్తకాలు కొన్నారు. ఇది వారికి సాహిత్యం మీద వున్న అభిరుచిని , పుస్తకాల మీద వున్న ప్రేమను తెలియజేస్తుంది. అదే విధంగా భూమన్ గ సూచించిన కొన్ని సూచనలను ఆయన పరిగణలోకి తీసుకోవడం, ముఖ్యంగా శ్రీ సిటీ మొత్తాన్నీ కాలి నడకన చూసే విధంగా ఒక సర్క్యూట్ వాక్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న సూచనకు, ఎం.డి గారు వెంటనే ఒప్పుకోడం గొప్ప విషయం. 

అలాగే శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతి, భూమన్ భార్య  శ్రీమతి కుసుమ కుమారి  మాట్లాడుతూ మహిళలు ట్రెక్కింగ్ లాంటి వాటిలో పాల్గొని మానసికంగా, శారీరకంగా ధృడంగా ఎదగాలని, మహిళలలను ట్రెక్కింగ్  ట్రావెలింగ్ లాంటి వాటిలో ప్రోత్సహించాలని, వారి కోసం ట్రెక్ లను నిర్వహించాలని సూచించారు.
ఇంకా వక్తలు పెట్టశ్రీ , ఉమామహేశ్వర , జింకా నాగరాజు  ప్రసంగాల తర్వాత...
పుస్తక రచయిత భూమన్  వారి స్పందన తెలియజేశారు. అందరూ ప్రకృతితో మమేకమై జీవనం సాగించాలని, శారీరక వ్యాయామం, మనో వైశాల్యాలు ఆరోగ్య కర జీవన విధానానికి మూలాలని, అందరూ ఆశవాహ ధృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. 

భూమన్ ని శాలువతో సన్మానిస్తున్న డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి

పుస్తకంలో భూమన్, తన ట్రెక్ సహచరులు అయిన ప్రతి ఒక్క ట్రెక్కర్ పేరునూ, అధికారుల పేర్లను ఇతరుల పేర్లను ఆయా సందర్బలలో ప్రస్తావించడం విశేషం.... పుస్తకానికి మంచి కూర్పు నిచ్చిన 'ట్రెక్ శీను' కి అభినందనలు చెప్పారు.
కార్యక్రమం అయ్యేప్పటికి మధ్యాహ్నం రెండు ఐoది, శ్రీ సిటీ వారే ఏర్పాటు చేసిన మంచి శాఖాహార భోజనం తినిపించి అందరికి దగ్గిరుండి వీడ్కోలు చెప్పారు.

 FRO శ్రీ ప్రభాకర్ రెడ్డి , MAC బాలు, మా ట్రెక్ ఎడ్మిన్ డా. భాస్కర్ ఇతర తిరుపతి ట్రెక్కింగ్ గ్రూప్ సభ్యులు   హాజరయ్యారు... 

సభలో ప్రసంగిస్తున్న శ్రీ కృష్ణ దేవరాయ  యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ కుసుమకుమారి

శేషాచల కొండకోనల్లో.. పుస్తకం కోసం Mr. శ్రీనివాసన్ ( ట్రెక్ శీను ) సంప్రదించగలరు, ఆయన సెల్ నెం. 9885151357. ఈ ఆదివారం అనగా 23-2-25 వ తీదీన, తిరుపతి నగర వనం (దివ్యారామం) లో పుస్తక పరిచయ కార్యక్రమం ఉంటుంది... అందరికీ స్వాగతం....


Similar News