షికాగోలో ‘శేషాచలం కొండల్లో’ పుస్తకావిష్కరణ
ఘనంగా షికాగో సాహితీ మిత్రుల సమావేశం;
షికాగో సాహితీ మిత్రులు నిర్వహించిన సాహిత్య సభ ఈరోజు శనివారం మే 10వ తేదీ విశిష్ట అతిధులు శ్రీ భూమన్ శ్రీమతి కుసుమ కుమారి వారి ప్రసంగములు తో చాలా ఆసక్తికరంగా జరిగింది. బోధనా రంగంలో విశిష్ట స్థానం పొందిన శ్రీమతి కుసుమ కుమారి గారు అలాగే అభ్యుదయ సాహిత్యం ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నఅనుభవం ఉన్న భూమన్ గార్లు సాహిత్యం సమాజము అనే అంశంపై సాంప్రదాయ సాహిత్యం ఆధునిక సాహిత్యము రెండింటినీ మేళవించి దాదాపు రెండు గంటల సమయం సభికులను ఆకట్టుకున్నారు. శ్రీమతి కుసుమ కుమారి గారు తమ ప్రసంగంలో ఆముక్తమాల్యద విశిష్టత, మహాభారతం ప్రత్యేకంగా తిక్కన గారి సాహిత్య విశిష్టతను చక్కగా వివరించారు. అలనాటి సమాజంలో, సాహిత్యం సమాజ అభివృద్ధికి ఎలా తోడ్పడింది వివరించారు సంఘసంస్కర్తలు తమ రచనల ద్వారా సమాజాన్ని ముందుకు నడిపించారని వివరించారు.
తర్వాత భూమన్ గారు మాట్లాడుతూ గురజాడ శ్రీ శ్రీ లా సాహిత్యం సమాజాన్ని ఎలా మలుపు తిప్పింది సాహిత్య పాత్ర ప్రజలను చైతన్యవంతం చేయడానికి చలం సాహిత్యం కొడవటిగంటి సాహిత్య సాహిత్యము చూపిన ప్రభావాన్ని విశదీకరించారు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సాహిత్య మీద ఆధారపడి ఉంటుందని మంచి సాహిత్యం వుంటే మంచి రాజకీయ వాతావరణం ఉంటుందని మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన చైతన్య అవగాహన లేకపోవడం అనేది సమాజానికి గొడ్డలి పెట్టు ఆర్థికంగా వ్యక్తులు ఎంత ఎదిగినా సామాజిక చైతన్యం లేకపోతే వారివలన సమాజానికి పెద్దగా ఉపయోగం వుండదని అభిప్రాయ పడ్డారు.
సభలో భుమాన్ రచించిన “ శేషాచలం కొండల్లో " పుస్తకాని ప్రముఖ ఆర్టిస్ట్ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ ఏస్ వి రామారావు గారు ఆవిష్కరించారు.
ఈ సభను చికాగో ఆంధ్ర సంగం చికాగో సాహితి మిత్రులు సంయుక్తంగా నిర్వహించడం సంతోషమని అతిధులు తమ కృతజ్ఞతలను తెలిపారు. చికాగో ఆంధ్ర సంఘం అధ్యక్షులు శ్రీకృష్ణ గారు మరియు పూర్వ అధ్యక్షులు సంఘ వ్యవస్థాపకులు పెద్ద ఎత్తున హాజరై భూమన్ గారిని శ్రీమతి కుసుమ కుమారి గారిని సన్మానించారు. ఇప్పుడు 25 సంవత్సరాలుగా షికాగోలో షికాగో సాహితి మిత్రులు అనే సమస్త పేరుతో తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న చికాగో సాహితీ మిత్రులు అలాగే అలాగే చికాగో ఆంధ్ర తెలుగు సంఘం ఇరువురి ఆధ్వర్యంలో సాహితీ సభ జరిగింది.
చికాగో సాహితి మిత్రులు తరఫున మెట్టుపల్లి జయదేవ్ మరియు తిమ్మాపురం ప్రకాష్, మెట్టుపల్లి శారద, బడ్డీ రఘు, భీమారెడ్డి గార్లు చికాగో ఆంధ్ర సంఘం వారి గవర్నింగ్ బాడీ సభ్యులు అధ్యక్షులు శ్రీ క్రిష్ణ ముతుకుమల్లి, శ్రీనివాస్ పెద మల్లు, అప్పలనేని పద్మారావు గారు ఒగ్గు నరసింహారెడ్డి గారు మొదలగు వారు సభను నిర్వహించారు.
శ్రీ భూమన్ గారు శ్రీమతి కుసుమ కుమా సభ నిర్వహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.