సాయంత్రం (కవిత)

సాయంకాలం ఎందరో కవులను ఉత్తేజపరిచింది. ఎంతో కవిత్వ సృష్టికి దోహదపడింది. ఈ పరంపరంలో సాయంకాలం మీద మరొక కవిత

Update: 2024-01-14 11:02 GMT

వల్లభా పురంజనార్దన

(కవిత)
సాయంత్రం కాలవిభజనలో ఒక కామా
ఒకవాస్తవం
ఒక అనుభూతి
ఒక అనుబంధం
ఒక అనుభవం
కాల సూచిక భ్రమణంలో
పుడమికి కలిగే ఒక అవస్థ సాయంత్రం
అవస్థలకు అనుగుణంగా
జాగ్రత్స్వప్న సుషుప్తి వేకువలను
జీవిత కార్యాచరణ ప్రణాళికకు
పునరుత్తాన సందేశం సాయంత్రం
సంభ్రమానంద విషాదావస్థలను
అనుభవ గ్రంథంలో రాసిపెట్టుకొమ్మనే హెచ్చరిక సాయంత్రం
మనిషిని నిండుతనాన్ని నిలబెట్టుకొనే దిశా నిర్దేశం చేస్తుంది సాయంత్రం
బతుకు పునాదిని ఒడిదుడుకులు
లేకుండా పదిలంగా నిలబెట్టుకొమ్మని సంకేతమిస్తుంది
ఆవేశాన్ని ప్రకటిస్తూనే
పదిలంగా కాపాడుకొమ్మని సందేశశమిస్తుంది
నిలకడతనాన్ని నిలబెట్టుకోమంటుంది
వయసుకు ముసలితనం వచ్చినా
ఆలోచన ఆచరణలకు ముసలితనం రాకుండా చూసుకో మంటుంది
తిరోగమన వాదుల.మానసిక ముసలితనాన్ని పోగొట్టే వయాగ్రా సాయంత్రం


Tags:    

Similar News