‘సాహిత్యంలో కవికి సానపట్టేది వాళ్ల గుణమే..’
తనను తాను సానపెట్టుకుంటేనే కవి ఎప్పుడూ కూడా అప్పుడే పూచిన పువ్వులా ఉంటాడు.
తల్లి కడుపులో నుంచి నేలమీదిక వచ్చిన శిశువు కంటి రెప్పలు మొదటిసారిగా తెరిచి వెలుగును చూసినట్టు కొత్త చూపుతో నాదైన కవితా ప్రపంచం లోకి చీకటి దారిలో దీప కాంతిలా ప్రవేశించాను.
నాకు రెండు పుట్టిన స్థల కాలాలు ఉన్నాయి. మా అమ్మమ్మ మాణిక్యమ్మ ఊరిలో సాంస్కృతిక బీజాలు నాలో సాహిత్య భవనానికి పునాది పడిందనే చెప్పాలి. మా ఊరు కుటుంబం వాతావరణం అనేకానేక విషయాలను నాకు బోధపడేలా అవగతం అయ్యేలా చేసిందని తప్పక చెప్పుకోవాలి. మా ఊరు మానేరుకు అటువైపు ఉంటే ఇటువైపు సిరిసిల్ల పట్టణం ఉన్నది. అప్పటికే సిరిసిల్ల పట్టణంలో సి నారాయణ రెడ్డి అనుయాయులు కొందరు సాహిత్య సమావేశాలు నిర్వహించేవారు. నేను అప్పుడప్పుడే మొగ్గలా సాహిత్య ప్రపంచంలోకి వికసిస్తున్నాను. పెద్దలు మిత్రుల సహకారంతో నేను 19 73 ప్రాంతంలో సిరిసిల్ల యువ సాహితీ సమితి నిర్వహించే కవి సమ్మేళనాల్లో సభలలో చురుకుగా పాల్గొనేవాడిని . నా అభిరుచిని సాహిత్యాభిలాషను గమనించి, అప్పటికే సీనియర్ కవి జక్కని వెంకటరాజం నాకు సాహిత్యం లో ఎదగడానికి తోడ్పడినాడు. ఆయన మిత్రుడు నిజాం వెంకటేశం సార్ పరిచయం నా సాహిత్య దిశ దశను గొప్ప మలుపు తిప్పింది. నిజాం సార్ ద్వారా కమ్యూనిస్టు మేనిఫెస్టో గత తార్కికచారిత్రక భౌతిక వాదాలు, శ్రీ శ్రీ, ఆరుద్ర నూతలపాటి గంగాధరం కుందుర్తి తదితరుల పుస్తకాలను అందుబాటులో ఉంచడమే కాకుండా నాకు వాటి ద్వారా ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఏర్పడటానికి దోహదం చేశాడు.
రక్తం చెమట దిక్కారం ముప్పేట కలెగల్సిన మట్టిలో విత్తిన విత్తనమైనింగ్ మొలకెత్తినప్పుడు వినిపించే ధ్వనిలా నేను కవిత్వం లోకి జీవాక్షరమై ప్రతిధ్వనించాను. ప్రతిఘటించాను. నేను ప్రతిక్షణం లోకం గీటురాయి మీద ప్రతి అక్షరాన్ని పరీక్షించుకొని కవిత్వంలో కరెంట్ తీగను తాకితే షాక్ కొట్టే విద్యుత్తులా బావం మధ్య పదాన్ని ఒదిగాను. పొదిగాను. ప్రయోగించాను. నా పద పదానికి పాదుచేసి నీళ్లు పోసి పందిరి మీద తీరతీర పూసిన బీరతీగలా జీర గొంతుతో పలకరించాను. పరిపరి విధాల పరివ్యాప్తమయ్యాను. ఆకలి తీర్చుకోవడానికి శ్రమించినట్టు నేను సాహితీ క్షుద్బాధ తీర్చుకోవడానికి కళ్ళల్లో వత్తులు వేసుకుని బీజాక్షరాలను కలిపి పల్లె పాటలా వల్లె వేసుకున్నాను. గత యాభై సంవత్సరాల పైగా జీవితం కవిత్వాన్ని నా ప్రజల మీద సుఖదుఃఖాల సంగమమై ప్రవహించాను.
మా ఊరు కుటుంబం వాతావరణం అనేకానేక విషయాలను నాకు బోధపడేలా అవగతం అయ్యేలా చేసిందని తప్పక చెప్పుకోవాలి. మా ఊరు మానేరుకు అటువైపు ఉంటే ఇటువైపు సిరిసిల్ల పట్టణం ఉన్నది. అప్పటికే సిరిసిల్ల పట్టణంలో సి నారాయణ రెడ్డి అనుయాయులు కొందరు సాహిత్య సమావేశాలు నిర్వహించేవారు. అప్పటికే నాకు నేను మొగ్గలా సాహిత్య ప్రపంచంలోకి వికసిస్తున్నాను. కొద్దిగా మిత్రుల సహకారంతో నేను 1973 ప్రాంతంలో సిరిసిల్ల యువ సాహిత్య సమితి నిర్వహించే కవి సమ్మేళనాల్లో సభలలో చురుకుగా పాల్గొనేవాడిని . నా అభిరుచిని సాహిత్యాభిలాషను గమనించిన అప్పటికే సీనియర్ కవి దక్కని వెంకట్రాజ్యం సార్ జక్కని వెంకటరాజు నాకు సాహిత్యం లో ఎదురడానికి తోడ్పడినాడు. ఆయన మిత్రుడు నిజాం వెంకటేశం సార్ పరిచయం నా సాహిత్య దిశ దశను గొప్ప మలుపు తిప్పింది. నిజాం సార్ ద్వారా కమ్యూనిస్టు మేనిఫెస్టో గత గత చారిత్రక భౌతిక వాదాలు శ్రీ శ్రీ ఆరుద్ర నూతలపాటి గంగాధరం కుందుర్తి తదితరుల పుస్తకాలను అందుబాటులో ఉంచడమే కాకుండా నాకు వాటి ద్వారా ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఏర్పడటానికి దోహదం చేశాడు. దానికి తోడు నా చుట్టూ సమాజంలో జరుగుతున్న సామాజిక రాజకీయ ఆర్థిక పోరాటాలు ఆకురా ఇలా నన్ను మరింత పదును తేరేలా చేశాయి
1975 అత్యవసర పరిస్థితి తర్వాత దేశంలోని కవులను రచయితలను మేధావుల ను ఆలోచింపజేసినట్టే, నన్ను ఒక్కసారి దిగ్గున లేపి నాదైనా శైలిని భాషను వస్తువును నాదంటూ ఒక దారిని గమ్యాన్ని నాకంటూ ఒక సాహిత్య తొవ్వను నిర్మించుకోవడానికి తోడ్పడింది. అప్పటినుండి వివిధ పత్రికలలో కవిత్వం వచ్చినప్పటికీ నా ఆర్థిక స్థితిగతుల వలన పుస్తకంగా తీసుకురాలేకపోయాను. కానీ 1986 నుంచి వచ్చిన కవిత్వాన్నంతా కవిత సంకలనాలుగా అచ్చు వేసి పదిలరుచుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు "పాతాళగరిగె" నుండి"మనాది "వరకు 18 కవిత్వం పుస్తకాలు అచ్చులో తీసుకువచ్చాను. అట్టి పుస్తకాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ పిదప ఏర్పడిన తెలంగాణలోనూ వివిధ అవార్డులను తీసుకువచ్చి పెట్టాయి.
కవిత్వంలో ఇమడని వస్తువులను దృశ్యాలను జీవిత శకలాలను మార్పులు చేర్పులను ఒక 20 కథలుగా రాశాను. ప్రతి కథకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి, వివిధ సంకలనాలలో స్థానాన్ని పొందాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో నేను తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా 2007 నుండి 20 12 వరకు పనిచేశాను. అంతేకాకుండా తెలంగాణ కు ముందూ వెనక కవులలో రచయితలలో మేధావులలో ఏర్పడిన విపరీతమైన ఉక్క పోత సాచివేత నిశ్శబ్ద కాలంలో అధికారం చేపట్టిన పాలకుల కాలంలో ఆనివార్యంగా వివిధ పత్రికల్లో నేను రాజకీయ సామాజిక ఆర్థిక వ్యాసాలు రాశాను. నాయకుల ముసుగులను తొలగించి నిజ స్వరూపం బయట పెట్టాను.
నాతో పాటు ప్రయాణించిన చాలామంది సృజన కారులు ఒకటి అరా పుస్తకానికే ఆగిపోయారు.ఇదే కాలంలో ఎలాంటి తాత్విక ప్రాపంచిక దృక్పథం లేని బతుకు తెరువు ఒక్కటే ముఖ్యమనే ఒక అరాచక వాద తరం ఒకటి వచ్చి చేరింది మన పక్క వాడికి ఏమి జరిగినా పట్టని ఒక సాహిత్యకారుల గుంపు జాతర బెదిరినట్టు చమ్మక్ తప్ప కన్నీటి చెమ్మ లేని, నిర్జీవ నిర్వాపక వ్యాధి వాక్యం ఒకటి తెలుగు సాహిత్యం లో ఉరుకురికి "బెరికి పంట"ను తీస్తున్నారు.
.ఏ సృజన కారుడైన సమాజంతో కాలంతో పాటు ప్రవహించే గుణం ఉన్నప్పుడే అతడు ఎప్పటికప్పుడు సాహిత్యంలో తనను తాను "సాన"పెట్టుకుంటూ అప్పుడే పూచిత పువ్వులా తాజాగా ముందుకు పోతాడు. లేకుంటే నిలువ నీరై పోయి సభ్యతను స్వచ్ఛతను కోల్పోతాడు.