మేధావులారా! ఈ ఆదర్శ జీవుల ఆవేదన అర్థమవుతోందా!
అలోక్ సాగర్.. ఐఐటీ ప్రొఫెసర్. పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన ఆదర్శజీవి. ఆయన దీన్ని ఎందుకు వద్దన్నారో ప్రముఖ రచయిత తమ్మినేని అక్కిరాజు తన కవితలో చెప్పారు,;
By : The Federal
Update: 2025-02-06 07:00 GMT
ప్రొఫెసర్ అలోక్ సాగర్ (పైన), రఘురామ్ రాజన్ (కింద)
(తమ్మినేని అక్కిరాజు)
ఆలోక్ సాగర్
రిటైర్డ్ ప్రొఫెసర్
అమెరికా హుస్టన్
యూనివార్సిటీ
పి హెచ్ డి గ్రహీత!
రఘురామ్ రాజన్
రిజర్వు బ్యాంక్
మాజీ గవర్నర్!
ప్రొఫెసర్ ఆలోక్ వద్దే
చదువుకున్నాడు!
ఆలోక్-భారత్ ఇచ్చే
పద్మశ్రీ తిరస్కరణ!
మధ్య ప్రదేశ్ లోని
ఆదివాసీల సేవకే
జీవితం సమర్పణ!
అది ఆయన ఆదర్శం
పద్మశ్రీ కంటే ముందు ప్రజలకు'సేవ'చేయటం
ముఖ్యమనుకున్నాడు!
కొనసాగిస్తున్నాడు!
అవార్డులు రివార్డులు
వేదికలు కండువాలు
మురిపించలేదు!
లక్ష్య సాధనకు అవి
ఆటంకమనుకున్నాడు!
మణిపూరే కాదు
దేశమంతా నేడు
ఆదివాసీ సమస్య
అగ్నిహోత్రమై
మండుతోంది!
భౌగోళికంగా
నా దేశం గొప్పది!
కవులు పొగిడారు
కవిత్వమల్లారు!
సంతోషించాము!
ఆర్ధిక రాజకీయ
సామాజిక సాంస్కృతిక
రంగాలలో మాత్రం
భారత దేశాన్ని
ఎవ్వరు పొగడలేదు!
అడవులు మైదానాలు
భూములు సంపదలు
దోచుకు తినేవాళ్ళు!
పోరాడే వాళ్ళను
మట్టుబెట్టే 'కగార్ '!
అదే 'ఆలోక్' బాధ
దోపిడి రాజకీయం!
ఆర్ధిక దోపిడి!
నిచ్చెనమెట్ల
కుల వ్యవస్థ!
పండుగలెన్నో
పిండి వంటలు
భేషైనభోజనం
ఎవరు తిన్నారు?
అదికదా ముఖ్యం!
అంటరాని వాళ్ళు
ఆదుక్కు తినేవాళ్ళు
కులవృత్తులు
విద్యా హీనులు
ఇదీ నా దేశం!
స్త్రీకి స్వేచ్చలేదు
బాలవితంతువులు
సహగమనాలు
వేశ్య దేవదాసీ
ఒకనాటి స్త్రీలు!
ఎందరో 'ఆలోక్' ల
త్యాగాలతోనే
నాటిస్త్రీల దుస్థితి
కొంతమారింది!
ఇంకా మారాలి!
ఆలోక్ లు కావాలి
కందుకూరి, రాయ్
గురజాడలు కావాలి!
నేడు మతం మత్తు
ఉన్మాదపాలకులు!
ఒక్క ఆదివాసీలే కాదు
దేశమంతటా దారుణ
మారణ హోమాలు!
పాలక కార్పొరేట్ల
దుష్ట పన్నాగాలు!
దేశ సంపదలన్నీ
కార్పొరేట్ల కిచ్చి
పేద(సూద్ర)ప్రజల్ని
కుల వృత్తుల్లోకి
నెట్టేసే పన్నాగాలు!
ఇక ముందెన్నడు
అంబేద్కర్లు,ఫూలేలు
ఇక్కడ పుట్టకూడదు!
పుట్టినా వాళ్ళందరూ
పాదాలవద్దే ఉండాలి!
విషం కక్కుతున్నారు!
పన్నగాల పన్నాగాలు
ఫలించకముందే
విషం ఎక్కక ముందే
మనం మేల్కోవాలి!
ఆలోచించండి
మేధావులారా!
మేతావులు కావద్దు!
'ఆలోక్' లు కావాలి!
ప్రజల శక్తిని పెంచాలి !
కార్పొరేట్ల భక్షణ
రాముడు రక్షించడు
దేవుడు ఆత్మగతం!
దేశరక్షణ మనదే!
'ఆలోక్' మనకాదర్శం!
***