ఈ విశ్వ శతాబ్దపు మహాకుంభ మేళ రహస్యాలేమిటి?
ఆధ్యాత్మిక, ఖగోళ, భౌతిక వ్యవహారాల సమాహారం కుంభమేళా...;
మహా అద్భుతమైన మహా కుంభ మేళా మహాశివరాత్రి నాడు ముగిసిపోయింది. ఇది ఒక మహా యజ్ఞం. అసలు ఏవిధంగా జరిగిందో ఎట్లా ముగిసిందో ఎవరూ ఊహించలేరు. ఈ అనూహ్యంగా 144 సంవత్సరాలలో ఎన్నడూ జరగని మహాజనార్ణవం ప్రయాగ రాజ్ లో కనపడింది. ఇందులో ఎంతమంది వచ్చారు 60 కోట్లమంది వచ్చారని అంటున్నారు. అంతకన్నా ఎక్కువ అయినా కొంత తక్కువైనా ఇదొక జన మహా ప్రజా వచ్చి స్నానాలు చేయడం ఆశ్చర్యం. మొత్తం ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం దేశం నుంచి వందలాది దేశ దేశాలనుంచి త్రివేణీ సంగమం లో స్నానం చేయడం పెద్ద ఆశ్చర్యం. (అందులో ఈ ఆశ్చర్యాన్ని ఈ రచయిత స్వయంగా చూడగలగడం ఒక అద్భుతం అన్న మాట కాక మరేమీ చెప్పలేము) ఇది కొందరు త్రొక్కిసలాటలు వచ్చి ఎవరినై మరణిస్తే ఆశ్చర్యం ఉండదు. కాని దాదాపు మూడింట వంతు జనం ప్రయాగ్ రాజ్ కు వచ్చారనుకున్నా ఎంతమందికి భారత దేవభూమి అని నమ్మి లోలోతుగా విశ్వసించి ఇదే మన సనాతన ధర్మం అనే వాక్యానికి సాక్షిగా నిలబడిందనిపిస్తుంది.
ఎవరు ఎంత పనిచేసినా, ఎన్ని ప్రభుత్వ విభాగాలు చేసినా ఎవరికి ఘనతను పంచినా అర్థం చేసుకోవలసింది అంటే ‘ప్రజా ప్రభంజనానికి ఏమైతే అయింది మేం వెళ్లి స్నానం చేస్తాం’ అన్నారంటే, ‘పోలేకపోయామే’ అని బాధపడే వారున్నారంటే, ఎవరికీ అంతుపట్టని ధైర్యంతో జనం రావడం కూడా అద్భుతం.
మకర సంక్రాంతి నుంచి మొదలైన మహా కుంభ మేళా 44 రోజులు సాగడం, మహాశివరాత్రి దాకా (26.2.2025), ప్రతిరోజూ జన సంఖ్య పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుమ్ము ఆవరించినా, రైళ్లు నిండి ఆగిపోయినా, విమానాలు నిండిపోయి ఇక ఒక్క సీటు కూడా దొరకదు అనేదాకా అన్నా అన్ని రకాల కార్లు, బస్సులు నిండడం, అన్నిటికన్నా మామూలు మానవులు నెత్తిన మూటలు మోసుకుంటూ నడిచి రావడం, స్నానాలు చేయడం విచిత్రం. అద్భుతం.
ఇదివరకు అలహాబాద్ పేరున్న, ఇటీవల మార్చిన ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్ల నుంచి బస్ స్టేషన్ నుంచి మరికొన్ని కిమీ వెళ్లడానికి నడిచిపోతునే ఉన్నారు. ఆటోలో లేదా అది లేకుండా, స్కూటర్ల వెనుక వెళ్లే వారు కూడా త్రివేణీ సంగమ ప్రాంతానికి వెళ్లుతూనే ఉన్నారు. స్నానాలు చేయడం చాలా కష్టం కూడా. ముఖ్యంగా ఆడవారికి కొన్ని దుస్తులు మార్చుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇది పెద్ద వైఫల్యం. ఇన్ని కోట్ల మందిలో సగంమందికి వస్త్రాలు మార్చుకునే మార్గం లేక పోవడం చాలా అన్యాయం. భోజనం అందరికీ దొరకదు. కొనలేరు. రకరకాల కష్టాలు ఎదుర్కొని త్రివేణి సంగమంలో గంగా యమునా నదులలో స్నానం చేసుకున్నారు.
మొత్తం నాలుగు రకాల కుంభమేళాలు ఉన్నాయి. ఒకటి కుంభమేళా ఒకటి నాలుగు సంవత్సరాలకు వస్తుంది. అర్ధ కుంభ మేళా 6 సంవత్సరాలకు, పూర్తి కుంభమేళా 12 ఏళ్లకు వస్తుంది. 144 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా ఇది జరిగింది. దీనిని షాహీ స్నాన్ అంటారు. (కుంభంలో జరిగే సాధువుల స్నానాలను షాహీ స్నాన్ అనీ ఈ స్నానాలను రాజయోగి స్నానాలు అని కూడా అంటారు. ) గంగ యమున నదులతో కలిసిన ప్రాంతంలో అంతర్వాహినిగా సరస్వతీ నది ఉందని లెక్కించి త్రివేణి సంగమం ఇది అంటారు.
ప్రపంచం నుంచి అనేకానేక దేశాలనుంచి సంగమానికి వచ్చారు. ఆస్ట్రేలియా, భూటాన్, బ్రెజిల్, బల్గేరియా, కెనడా, ఫిజీ, ఫిన్ లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, గుయానా, ఇండొనీషియా, ఇస్రాయల్, ఇటలీ, జపాన్, మలేసియా, మాషియస్, మెక్సికో, మంగోలియా, నేపాల్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక, తైవాన్, థాయ్ లాండ్, ట్రినిడాడ్, టొబాగో, ఉక్రేయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అమెరికా వంటి అనేకానేక పుణ్య స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు.
హిజ్రాలకు ప్రత్యేక సంగం మేళా
ఈ సంఘంలో కిన్నర్ అఖాడా అనే హిందూ మతానికి ధర్మానికి చెందిన అఖాడాలో హిజ్రా తెగలవారికి 2018లో వ్యవస్థాపన చేసారు. జూనా ఆఖాడా ను శ్రీపంచదశ్నామ్ వారికి మరొక కుంభమేళ 2019లో జరిగింది. హిందూమతం ఎల్ జి బి టి మధ్య విషయాల గురించి చర్చించే అవకాశం వచ్చింది. సుప్రీంకోర్టు 2018న హిజ్రా వారి అనుకూలమైన తీర్పు ఇచ్చింది. అందువల్ల సెక్షన్ 377 ఐ పి సి కింద హిజ్రాలు కూడా 2019 కుంభమేళాలో పాల్గొనే అవకాశం రావడం విశేషం. 2016 సింహాస్త్ మేళా ఉజ్జెయిని లో తొలి ట్రాన్స్ జెండర్ కుంభమేళాను నిర్వహించారు. 2025 మహా కుంభమేళా లో రకరకాల కలలు, నాటకాలు, సంగీతం, నృత్యం, వర్ణ రచనలు కూడా నిర్వహించారు. వారితో పాటు అనేకానేక ఆఖాడాలు నిర్వాహకులు, యోగులు, మునులు వచ్చారు. దిగంబర్, జూనా, అగ్ని, ఆవాహన్, కిన్నార్, మహానిర్వాణ, అటల్, నిరంజని, నిర్మోహి, ఉదాసీ ఆఖాడాలవారు వచ్చారు. ఎందరో మతాచార్యులు, పీఠాలవారు, సాధువులు వచ్చారు. మరొకొన్ని వివరాలను జాగరణ జోష్ డాట్ కామ్ వ్యాసంలో ఇచ్చారు.
మూడు త్రివేణీ సంగములు
త్రివేణి సంగమంలు మూడు ఉన్నాయి. ఒకటి ఈ భారత భూమిమీద ఒక త్రివేణి, హిందూ జ్యోతిష్యం ప్రకారం అంతరిక్ష నక్షత్ర గ్రహాల కక్ష్యలలో పరిభ్రమించే వారు రెండో త్రివేణి, ఒక్కో వ్యక్తి శరీరంలో సహస్ర చక్రాలలో కూడా మూడో త్రివేణి ఉందని పెద్దలు, పండితులు, రచయితలు, శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు.
గంగ యమున సరస్వతి అనే మూడు నదుల సంగమం ఒకటని అందరికీ తెలుసు. గురువు, సూర్య గ్రహచారాలనుంచి లెక్కించి కుంభమేళాలను నిర్ణయిస్తారు.
నాడీ వ్యవస్థలో త్రివేణీ సంగమం
సూర్యనాడి, చంద్రనాడి మధ్య భృకుటి లో తిలకం దిద్దే స్థలంలో మెదడు నుంచి మొత్తం శరీరానికి విస్తరించిన నాడి కనపడని నది వంటిది సరస్వతి వలె అంతర్వాహినిగా కలిసి త్రివేణి అవుతుంది. గంగ యమున ‘ఇడ’ ‘పింగళ’ నాడివి అంటే, కనిపించని సరస్వతి శివుడిని చేర్చుతుందనీ. అక్కడ ఆ ప్రాణం ఆత్మను పెట్టగలిగితే పరమాత్ముడిని చేరవచ్చునని యోగా ఆచార్యులు వివరిస్తున్నారు. గంధం దిద్దే చోట బొట్టు దగ్గర త్రివేణి లో కనపడని సరస్వతిని మన నాడీ వ్యవస్థలో కీలకమైంది. ఆ వ్యవస్థను వేగాస్ (VEGAS) అంటారని ప్రముఖ వైద్యులు యోగా ఆచార్యులు డాక్టర్ రవీంద్రబాబు (తెలంగాణ నిర్మల్ వాస్తవులు) ఈ రచయిత తో ఇంటర్వ్యూలో వివరించారు. ఇది ఇంకా పరిశోధన చేస్తున్నారు.
లోక యోగా స్కూల్
లోక యోగా స్కూల్ వారు మన శరీరంలో చక్రాలు సహస్ర రూపంలో ఉంటాయని వివరించారు. దీన్ని చక్ర కిరీటం వంటిది సహస్రమని అంటారు. ఈ చక్రాల సాధన ద్వారా మొత్తం విజ్ఞానాన్ని, వివేకాన్ని సంపాదించవచ్చు. ఈ చక్రాలు శరీరంతా విస్తరిస్తే ఉత్తమ, ఉన్నత లోకాలను చేరవచ్చునని అంటున్నారు. అక్కడ అడ్డంగా ఉండే నాడీ లో రెండు: ఒకటి అహంకారం, రెండోది స్వార్థం. ఇవి తగ్గించుకోవడమే అని హితవు చెప్తుంటారు కానీ, సహజంగా అహంకారుల వారు తగ్గరు. స్వార్థం కూడా అంతే. మన ఆలోచనలు, అంతర్ లక్షణాలు వారి వివేకాన్ని తగ్గించడం పెంచడం జరుగుతూ ఉంటుంది. మన విజ్ఞానం గాని వివేకోదయాలతో మహావిశ్వంతో అనుసంధించే వీలుంది. మనసునిండా ప్రేమ నింపుకుంటే, మూలమూలలకు కాంతితో నిండిపోతే, ఈ రెండు అనురాగం, ప్రశాంతపు, వెలుగు నిండితే, మన ప్రేమనుంచి దీపం వలె మనలోనుంచి విస్తరిస్తే, మన చక్ర కిరీటం తెరుచుకోగలిగితే, పూర్తిగా ప్రేమ శాంతి ఆనందంతో నిండిపోతాయి. అదే దివ్యమై పరమాత్మతో సంధానం అవుతుంది. అదే మోక్షం, విముక్తి, అంటే బంధాలు, వాంఛలు, అనుబంధాలనేవి బంధించే తాళాలు, తాళ్లు.
ఈ కుంభ సంఘం - సహస్రం
ఆ మహాకుంభమేళాకు సంగమానికి సహస్రానికి మధ్య సంబంధం ఏమిటి? సంస్కృతంలో సహస్రం అంటే వేయి రేకులతో విస్తరించిన పుష్పం వంటిది. దానిపైన చక్ర వలయాల మీద కిరీటమై వెలుగుతుంది. మొత్తం ఏడు చక్రాలున్నాయి. ఒక్కో చక్రం ఊదా రంగంలో ఉందని అనవచ్చు. దృశ్య కాంతి వర్ణపటంలో అతినీలలోహిత లేదా నీలం మధ్య ఈ రంగు ఉంటుంది. వయెులెట్ రంగు కళాత్మక సాహసానికి చిహ్నంగా ఉండే ముదురు ఊదా రంగు.
శివాసంహితం, తిరుమంత్రం
హఠయోగం పాఠాలలో శివాసంహితం లేదా తిరుమంత్రం సహస్రాలతో వర్ణించవచ్చునని రచయితలు అంటున్నారు. పశ్చిమామ్నాయ లేదా నాథ్ తో ఇవి రెండు ఉండవు. ‘కుబ్జికామతంత్ర’ కేవలం ఆరు చక్రాలు ఉంటాయంటారు. శివా సంహితలో శరీరమైన దాటిన దశలో ‘సహస్ర’ ఉంటుంది. తలపై బ్రహ్మ రంధ్రం నుంచి ఆత్మని వదిలి, శరీరం మరణంతో వెళ్లిపోతుంది అని పెద్దలు అంటున్నారు.
సప్త చక్రాలు
మనకు ఏడు చక్రాలున్నాయి అంటే ఇవి: ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార, బిందు చక్రాలు ఇవి వివరాలు:
నిర్వాణ శక్తి నుంచి పరమ శివ
కుండలినీ ద్వారా శరీర సాధనం ‘అసమ ప్రజ్ఞత’ లేదా ‘నిర్వికల్ప సమాధి’ (ఇవన్నీ వివరించడానికి పుస్తకమే అవుతుంది) ద్వారా పరమాత్మను (శివ) అనుభూతిని సాధించవచ్చు అంటున్నారు. అక్కడనుంచి శంఖిని గా మారుతుంది. ఆ శంఖిని చుట్టూ తొడిగినట్టుగా ఉంటూ ఆ ఉత్యుత్తమైన బిందులో కరిగిపోతుంది. ఇది ఏమిటి అని చెప్పలేము. అది శూన్యం లేదా పూర్ణం కావచ్చు. అదే అత్యుత్తమ మైన నాడి. లేదా శక్తి. అది తరువాత ఐక్యమై ‘సకల శివ’ గా లీనమైపోతుంది. ఆతరువాత ‘పరమ శివుడై’ మరీమరీ లీనమైపోయి పరమ శివ అనే చివరి నిర్వికల్ప సమాధి అవుతుంది. (అది అనుభవించేదే కాని వివరించడం సాధ్యంకాదు)
నాడీ వ్యవస్థలో ముఖ్యమైన నాడి ఏది?
యోగులు, యోగినిలు ముఖ్యమైన నాడి ఏది అంటే ప్రశ్నకు సమాధానం ఇది: మహిళలు కేశాలను మూడు పాయలుగా కలుపుతూ చేర్చే జడలు వేసేకునేట్టు మూడు అల్లే నాడీలు – ఇడ, పింగళ, సుషుమ్న. అందులో మధ్యలో పాయ ఉండేది సుషుమ్న. ఆ మధ్యది ప్రాణవాయువును కలిగి, తద్వారా కీలకమైన శక్తి జీవితాన్ని బతికిస్తూ వాటిలో ఇడ, పింగళ కుడి ఎడమ నాసికా రంధ్రాలనుంచి మధ్యలో సుషుమ్న ఉంటుంది. తలమీద మధ్యలో పుర్రె చివరన బ్రహ్మరంధ్రం ఉంటుంది. అది ఎప్పుడూ మూతబడి లేదా మూసుకుపోయి ఉంటుంది. ఆ రంధ్రం తెరిస్తే మోక్షం అని అనాలి. కాని సామాన్యుల భాషలో అది మరణం!
కుండలినీ
వెన్నెముక పైనుంచి కిందిదాకా కుండలినీ లో లేపేదే శక్తి. సుషుమ్న ద్వారా దారి ‘కుండలినీ’. అది సహస్ర చక్ర చేరి బ్రహ్మరంధ్రం స్థానం ద్వారా అనురూపమైన తుది శక్తిని, యోగ గవాక్షం విజ్ఞానాన్ని సాధిస్తుంది, అని రావి తేజా ధవళ (Ravi Teja Dhavala, Scientist /Engineer at Indian Space Research Organisation (ISRO) (2017–present) వివరించారు.
హిరణ్యగర్భ
సుషుమ్న నాడిని హిరణ్యగర్భ అని దాని రూపం విశ్వరూపంలో విజ్ఞానమై ఉంటుందని ప్రొఫెసర్ శివ్ భూషణ్ శర్మ వివరించారు.
- జీవాత్మ లో మూడు ప్రధానమైన నాడీలనే కనిపించని శక్తి ధారలు మానవ శరీరంలో ఉంటాయి.
- దానికి ఎడమదిశలో ఇడా నాడి ఉంటుంది. ఇది మూలాధార చక్రం ఎడమ ముక్కురంధ్రానికి అనుసంధానం చేస్తుంది.
- పింగళ నాడి శరీరానికి కుడివైపు మూలాధార కుడి ముక్కు రంధ్రాన్ని సంధానం జరుగుతుంది.
- సుషుమ్న నాడి శరీరంలో కేంద్రంగా ఉంటుంది. వెన్నెముక ఒక స్తంభం వలె నిలబడిస్తుంది. మూలాధార కు పూర్తికిందకు వచ్చి దానికి కేంద్రమైన కీలకమైన స్పృహను ఇస్తుంది. మానవ మేధస్సుకు స్పృహ కలిగించే శక్తి ఈ నాడి ఇస్తుంది. ఇదే మోక్షాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది.
- వెన్నెముకను చుట్టి సుషుమ్న నాడిలో లోపల వాహినీ నాడి అంటారు. కుండలినీ మూడవ దశలో నాడి ఆరోహణ ద్వార పైకి నడుస్తుంది.
- ఒక తెల్లని పదార్థం గా పైన నడిచే జ్ఞాన ఇంద్రియం ఇది. కిందికి దిగేది కర్మ ఇంద్రియం. కుండలినీ ఎగబాకుతున్న నాలుగో దశకు దారిని సూర్య నాడి అవుతుంది.
- ఇది చంద్రనాడి, కుండలినీ యోగ సాధన ద్వారా వెన్నుపాములోని గ్రే మ్యాటర్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ లోని ఒక రకమైన కణజాలం. (వెన్నుపాము (spinal cord) నాడీ వ్యవస్థ (nervous system)లో కేంద్ర నాడీ మండలానికి చెందిన భాగం. ఇది సన్నగా, పొడవుగా, ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది.)ఇది రోజువారీ పని చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయిదో దశకు కుండలినీ పైకి ఎదుగుతూ ఉంటుంది.
- మానవ నాడీ కణజాలం తోడుగా ఉండే కేంద్రమైన బ్రహ్మనాడి.
- వైకుంఠం నాడి, మానవుని మెదడులోని వెంట్రిక్యులర్ సిస్టమ్‌ను తోడుగా ఉంటుంది. ఆత్మ చైతన్యం అంటే ఆత్మ స్పృహ లేదా తెలివి లేదా పరిజ్ఞానం అవగాహన అంతర్ యోగ అంటారు. అవి సెరిబ్రల్ జఠరికలు.
- ఇక పదవ దశను అఖండ యోగ అంటారు. సమగ్రమైన యోగం ఇది.
"వేద జ్యోతిష్యశాస్త్రంలో, అటువంటి గ్రహస్థితులు ఆత్మసిద్ధిని పెంపొందించే బ్రహ్మ తాత్త్విక శక్తులను పెంచేందుకు భావింప జేస్తాయి. కుంభమేళా వంటి మేళాలు ప్రత్యేక గ్రహ దిశల ఆయా సమయంలో నిర్వహిస్తాయి. ఉదాహరణకు గురు (బృహస్పతి), సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల సమన్వయాలు, ఇవి పవిత్ర నదుల శుద్ధికరించే శక్తిని పెంచుతాయని విశ్వసిస్తున్నారు.... గంగ యమునా, కనిపించే నదులు, గ్రహణశక్తిని సూచిస్తాయి, ఎప్పటికీ కనిపించని సరస్వతి, ఈ రెండింటిని అనుసంధానించే చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది." అని 2025 జనవరి 26న, శ్రీ వినీత్ మిట్టల్ ఆధ్యాత్మిక దృష్టికోణం గురించి వివరించారు.
ఈ సంయోజన సమయాల్లో, ఆధ్యాత్మిక సంగమంలో స్నానం పునర్నవీకరణ చెందుతుంది. కార్మిక (అంటే కర్మ అనే పనులకు సంబంధించిన) మలినతలను శుద్ధి చేయడానికి ఉన్నత ఆనంద, ప్రవాహాలతో మళ్ళీ సమన్వయం చేసుకోవడానికి ఇదొక అవకాశం. మహాకుంభ, ‘బ్రహ్మాండిక కారకుల’ ప్రాశస్త్యం కలిసిన గొప్ప సంగమం, అన్వేషకులను ఈ గాఢమైన పునర్నవీకరణ అనుభవించడానికి ఆకర్షిస్తుంది... అంతేకాదు గంగకు చాలామంది ఔషధ ఆధ్యాత్మిక లక్షణాలు కూడా ఉన్నాయి.
హిమాలయ ఉద్భవాలు
గంగోత్రి హిమనదీ ప్రాంతం నుండి ఉద్భవించి, గంగ అనేక ఔషధిక ఔషధాలు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ప్రాంతాల ద్వారా ప్రవహిస్తుంది, అందుకే గంగా నదికి ప్రత్యేక లక్షణాలను ప్రసాదిస్తుంది. పరిశోధనలు గంగలో బ్యాక్టీరియోఫేజ్‌లు ఉంటాయని సూచిస్తాయి, ఇవి దాని ఆత్మ-శుద్ధి లక్షణాలకు సహకరిస్తాయి. ఆధ్యాత్మికంగా, ఈ లక్షణాలు గంగ యొక్క శరీర, మనసు, ఆత్మను శుద్ధి చేసే పాత్రను పెంచుతాయి.
ఆధ్యాత్మిక శుద్ధి
గంగ వంటి శీతల, ఖనిజం సమృద్ధిగా ఉన్న జలాలలో నానడం, శరీర శక్తిని స్థిరపరచడానికి, దాని బయో-ఎలక్ట్రికల్ రంగాన్ని పునఃప్రారంభించడానికి జీవన శక్తిని ఉల్లాసపరచడానికి సహాయపడుతుందని వివరిస్తారు.
గంగ (పవిత్రత), యమున (భక్తి), సరస్వతి (జ్ఞానం) సంగమం శరీర, మనసు, ఆత్మ ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇది హిందూ త్రయి—బ్రహ్మ (సృష్టి), విష్ణు (పాలన), మహేశ్ (పరివర్తన)—ని ప్రతిబింబిస్తుంది. ఈ పవిత్ర యోగం రూపాల బహువిభజన నుండి ఒకే, ఏకీకృత బ్రహ్మాండిక యథార్థం (పదార్థం కాదు) అవగాహన వైపు ప్రయాణాన్ని సూచిస్తుందని వినీత్ మిట్టల్ వివరించారు.
మరో రచయిత డాక్టర్ మృత్యుంజయ గుహ మజుందర్ తన వ్యాసంలో ‘‘ఇది సమష్టి సుస్థిరత కలిగిన ప్రత్యేక ఉత్సవం, ఎక్కడ భక్తి, బ్రహ్మాండం, ఆశ్చర్యం ఒకటవుతాయి. కుంభమేళా తేదీలు నిర్ణయించే వివరమైన గణనాశాస్త్రం, ఖగోళ కదలికలపై అద్భుతమైన అవగాహనను కనిపిస్తుంది, అదేవిధంగా ఈ పవిత్ర సమావేశాల్లో నీరు అద్భుతమైన రోగ వ్యతిరేక లక్షణాలు (యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను) కలిగి ఉన్నాయి. అంతేకాక, ఆసక్తికరమైన సిద్ధాంతాలు కుంభమేళా తో సంబంధం ఉన్న విద్యుత్ క్షేత్రం పరిమాణాలను సూచిస్తున్నాయి. ఇది భౌతిక విజ్ఞానం, ఆధ్యాత్మిక సత్యం ఒక దృశ్యమైన (సాదృశ్యమైన కాదు) అంగీకారం ఏర్పరుస్తుంది, దీని ద్వారా కుంభ మేళాలలో పాల్గొనే వారు ఉన్నతమైన జీవితం లోతైన రహస్యాలను అన్వేషించడానికి సంసిద్ధమవుతారు.
శ్రీ మజుందార్ వ్యాసంలో ‘‘2025 మహాకుంభ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటుంది. ఎ.ఐ.-పవర్డ్ వ్యవస్థలు 2,700 సీసీటీవీ కెమెరాల (328 ఎ.ఐ.-ఆధారిత) సహాయంతో, నీటిలో నడిచే డ్రోన్‌లు కట్టి ఉన్న ఉన్నవి, డ్రోన్‌లు పర్యవేక్షణ కోసం, బహుభాషా కుంభ Sah’AI’yak అనే పేరుతో సహాయక యాప్‌ను రియల్-టైం మార్గదర్శకత సాంస్కృతిక సమాచారం అందించే పనుల కోసం సహాయం చేస్తాయి. మొత్తం తాత్కాలికంగా నగరం గూగుల్ మ్యాప్స్‌లో ఒకటే అయితే, సరి కొత్త రకం ఎ.ఐ. తో అమర్చిన చెత్త వాహనాలు, 2,000 వెలుగునిచ్చే డ్రోన్‌లు సాంస్కృతిక కథలను చెప్పే లక్షణాలుకూడా చేర్చారు. ఈ కుంభ మేళాకు ఈ శాస్త్రీయ ఆచారం కొత్తవేమీ కాదు. కానీ కుంభలోని మూలమైన సత్వాన్ని ప్రతిబింబించే ఒక పురాతన శాస్త్రీయ పరిష్కారం అని అర్థమవుతుంది. ఈ కుంభమేళా మూలాలు హిందూ పురాణంలో ఉంటాయి, ఇది దేవతలు అసురులు చేసే సముద్ర మథనం సంఘటనతో వివరిస్తాయి. ఈ ఘటనలో అంతరక్షణపు కుంభం లేదా కుండం పుట్టింది, ఈకుండలో అమృతం ఉంటుంది. అసురుల నుండి కుంభాన్ని రక్షించడానికి, ఇంద్రుడి కుమారుడు జయంత్ ఆకాశంలో కుంభాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ ప్రయాణం సందర్భంగా, అమృతం నాలుగు బిందువులు భూమిపై పడిపోతాయి. అవే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన, నాసిక్ చోట్ల కుంభ మేళా లనే పవిత్రమైన క్షేత్రాలయిపోయాయి. ఇవి నమ్మలకు సంబంధించిన అంశాలు, రుజువులు పరిశోధిస్తే తేలే అవకాశం ఉంది.
హియుయెన్ త్సాంగ్ చరిత్ర
రాజా హర్షవర్ధన్ (590–647 సి.ఇ) ప్రస్తావించిన ప్రగతి సంఘటనలను ప్రాచీన చైనీయ పర్యాటకుడు హియుయెన్ త్సాంగ్ చరిత్రలో రచించారు. కాని 19వ శతాబ్దం ముందు ప్రస్తుత కాలానికి సంబంధించిన 12 సంవత్సరాల కుంభ మేళాను ప్రయాగ్ లో జరగడం గురించి ఎటువంటి చారిత్రిక రికార్డులు లేవంటున్నారు.
కుంభ, పురాణాలతో సంబంధాలు
‘మత్స్య పురాణం’, ‘చైతన్య చరితామృతం’, తులసీదాస్ రచించిన ‘రామచరితమానస’ వంటి ప్రాథమిక మూల వనరులన్నీ ప్రతి సంవత్సరమూ జరిగే మాఘ మేళాను సూచిస్తాయి, 12 సంవత్సరాల చక్రం కుంభ మేళా గురించి కాకుండా, మాఘ మేళా మహాభారతం తదితర పురాణాలలో ప్రస్తావించారు. మాఘ మేళా అనేకానేక పూజాకాలాలలో ఉండే పుష్కరములను చుట్టూ కార్యక్రమాలు కనపడతాయి. ఇవి బృహస్పతి గ్రహ (జ్యూపిటర్) వివిధ జ్యోతిష్య రాశుల్లోకి సంచరించి మారడం ద్వారా వచ్చే నది పుష్కర ఉత్సవాలు నిర్వహిస్తారు.
‘జాతక పారిజాతం’ ప్రకారం, ఒక బ్రాహ్మణుడు అనే వ్యక్తి పుష్కర శుద్ధి కోసం నీటిలో చాలాకాలం నివసించే శక్తిని తపస్సు ద్వారా సంపాదించారు. అతను బృహస్పతి ప్రార్థన ద్వారా దైవరూపం తో ఆయా పుష్కరములను అనుసరించి 12 పవిత్ర నదులలో ప్రవేశించారని వివరించారు.
ఎంతో కుంభ సంబంధిత వైదిక వాజ్ఞయం సాహిత్యంలో, ప్రత్యక్షంగా లేకపోయినా కొంత మేరకు ప్రస్తావించారు. ఉదాహరణకు అథర్వ వేదం, శ్లోక కాండ 4, సూక్త 34 మంత్ర 7 లో ఈ విధంగా చెప్పారు.
చతురః కుంభాంశ్చతుర్ధా దదామి క్షీరేణ పూర్ణంగా ఉదకేనా దధ్నా।
ఏతాస్త్వా ధారా ఉప యంతు సర్వాః స్వర్గే లోకే మధుమత్పిన్వమానా
ఉప త్వాతిష్టంతు పుష్కరిణీః సమంతాః ॥
అంటే నాలుగు కుండలలో నిండిన అమృతం, పూర్ణంగా క్షీరం నీరం అనే ప్రవాహాలు అందరికోసం పారుతున్నారు. స్వర్గమయిన తీయదనంతో నిండిన పవిత్ర జలాలు అందరకి లభిస్తాయంటున్నారు. కుంభం పుష్కరం అనే పదాలు చాలా ప్రాచీనమైన అక్షరాలు, చాలా సార్లు ప్రస్తావించినవి. ఇవన్నీ మేఘ మేళాలలో అనుసంధించారు. మరో సందర్భంలో అథర్వ వేదంలో కాండ 19, సూక్త 53 మంత్ర 3లో..
పూర్ణః కుంబోఽధి కాల ఆహితస్తం వై పశ్యామో బహుధా ను సంతః।
స ఇమా విశ్వా భువనాని ప్రత్యాఙ్కాలం తమాహుః పరమే విఽయోమనమ్
ఈ విశ్వం అంతా నిండి, పూర్ణమై స్పష్టంగా కుంభ కాలం లో ఉన్నాయని వివరిస్తున్నారు. పరమమైన, సర్వోత్కృష్టమైన స్వర్గానికి విస్తరిస్తాయి. కుంభ లోని ముఖ్యమైన భాగం ఏమంటే మొత్తం సమాహారంలో స్వభావికంగా ఉన్న ఆలోచనల వైవిధ్యం కనిపిస్తుంది.
ఇన్నేళ్ల కిందట అంటే 144 సంవత్సరాలకు ముందు మూడు రకాల త్రివేణీ సంగమ్ లు మహాకుంభ మేళా అనే అద్భుతమైన జాతర కొన్ని వారాలు సాగాయన్నమాట. వాటి మధ్య యోగ, ఆధ్యాత్మిక, ఖగోళ, భౌతిక వ్యవహారాలను ప్రతిబింబిస్తున్నాయి. మహావిశ్వం వలె ఇది అంతులేని కథ.
(పైన ఎన్నో వ్యాసాలను ఉటంకిస్తూ వచ్చిన ప్రముఖులు రాసిన భాగాలతో యోగా ఆచార్య డాక్టర్ రవీంద్రబాబు తో ఇంటర్వ్యూతో కూడా సేకరించిన రచన ఇది)