రైతు రణన్నినాదం (కవిత)

రుణ మాఫీ చేయాలని, కనీస మద్దతు ధర పెంచాలని హర్యానా పంజాబ్ ల వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరారు. వాళ్లని తరిమేందుకు మరొక వైపు పోలీసులు సిద్దం.;

Update: 2024-02-16 06:09 GMT
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల రణన్నినాదం



 రైతు రణన్నినాదం 



- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

మేడి పట్టేటోణ్ణి మెడబట్టి తోసేసి
ఎవ్వాడిని నువ్వు అందలమెక్కించేవు
బువ్వపెట్టేటోణ్ణి భూస్థాపితం సేసేసి
ఎవ్వాడికి నువ్వు పూజలూ సేసేవు

బూటకపు మాటల బురిడీలు కొట్టించి
నమ్మిన రైతులను నట్టేట ముంచావు
ఈ రామరాజ్యంలోన నీ హామీలు ఏమాయె
తిరిగి రోడ్డెక్కితే తన్నితరిమేస్తున్నావు

మేం ఢిల్లీకి వస్తాము నీ గల్లీకి వస్తాము
గిట్టుబాటు ధర కోసం మల్లిమల్లొస్తాము
తాడొపేడో మరి తేల్చుకొనే పోతాము
వదిలేది లేదు మరి నిన్నొదిలేది లేదు

హెచ్చరిక ఇది మా హెచ్చరిక ఇది
తాడొపాడో మరి తేలుకొనే పోతాము
వదిలేదు మరి నిన్నొదిలేది లేదు
హెచ్చరిక ఇది మా హెచ్చరిక ఇది


Tags:    

Similar News

అరుణ తార!