సాంతం నాకే... (Poem of the Day)

ఇపుడు మనిషి నడుస్తున్న, ఆలోచిస్తున్న, ఆచరిస్తున్న తీరుపై ఒక కవిత

Update: 2024-05-03 07:05 GMT
Photography by Anika Neese (Germany)


సాంతం నాకే


-షేక్ అస్మతున్నీసా

సకలం నాదే, ఆసాంతం నాకేనంటూ

ఆప్యాయతలు లేకున్నా అన్నీ కావాలని

ఇహంలో ఈ సుఖాలన్నీ పొందాలని

తనకు తనవారికే అన్నీ చెందాలని

ఇదే నిజమైనట్టు, ఇక్కడే శాశ్వతమన్నట్టు

ఆస్తులు అంతస్తులు కావాలని

లాగేసుకునైనా లాభపడాలని

మట్టిలో కలిసే మాట నిజమని తెలీని మూర్ఖులు

మన మతము,మన కులమే మనాలని

మిగతావన్నీ మనకక్కరలేదనీ

మంచికై నలుగురిని నిల్పుకోలేక, మానవత్వాన్ని పంచలేక

అగచాట్లు,అత్యాచారాలు, అక్రమాలు,అపార్ధాలు

స్వార్థం కోసం పక్కోడ్ని పడగొట్టి మరి ప్రయోజనాలు

అద్దెప్రపంచంలో మనం ఉన్నామని

ఆట అయ్యాక అందరూ అలౌకికమేనని

గుర్తెరగాలి, వసుధైక కుటుంబం వెల్లివిరియాలి


Tags:    

Similar News