కళను కదలాడించిన సంజీవ్ దేవ్ !
కళను అర్థం చేసుకోవాలంటే విశాల దృక్పదం ఉండాలి. ఏ బొమ్మను ఎలా చూడాలో తెలియాలి. సంజీవ్ దేవ్ నాకు ఆవిషయాన్ని బోధపరిచి కళ్లు తెరిపించారు.;
అప్పుడప్పుడే శీతాకాలపు మంచుతెరలు తొలుగుతున్నాయి. నులివెచ్చని మేని ఛాయలు కనిపిస్తున్నాయి. వీధులన్నీవినూత్నంగాఉన్నాయి. నేను, నాభార్య సరస్వతీ, మా ఇద్దరు పిల్లలు సరిత, కిరణ్‌తో సతమతమవుతున్నాం. సరిగ్గా అటువంటి రోజుల్లో చికాగో సమీపంలోని పాలోస్ హిల్స్ లో ఉంటున్నఎస్వీరామారావునుంచి ఫోన్ వచ్చింది.. ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సంజీవ్ దేవ్ తన శ్రీమతితో కలిసి వాళ్లింటికి వచ్చారన్నది సారాంశం.
నన్నుఆకట్టుకున్నకవితఅదే...
స్వామీ వివేకానంద చికాగో నగరానికి వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భం. సరిగ్గా అప్పుడు అమెరికాలో అడుగుపెట్టారు సంజీవ్ దేవ్. న్యూహెవెన్ (కనిక్టికట్)లోని యేల్ యూనివర్శిటీలోడాక్టరేట్ చేస్తున్నతనరెండో కుమారుడు మహేంద్రదేవ్ కుటుంబంతో కొంతకాలం గడపడానికి ఆయన వచ్చారు. దేవ్ వచ్చారన్న విషయం తెలిసి వెళ్లకుండా ఉండలేకపోయా. భార్య, పిల్లలతో కలిసి కారులో మూడున్నర గంటలు ప్రయాణించి రామారావు ఇంటికి చేరాం. కాఫీలు, టిఫిన్లు, కుశలాలు, బోలెడన్నికబుర్ల తర్వాత రామారావు ఓచిన్న పుస్తకం తీశాడు. ఆయన బహు చక్కని చదువరి. గొంతులో హెచ్చు తగ్గులు బాగుంటాయి. ఒక్కో కవితా చదవడం మొదలు పెట్టారు. తీరా చూస్తే అవన్నీదేవ్ గారి అముద్రిత కవితలే. వాటిలోఒకటి నన్నుబాగా ఆకట్టుకుంది. దాని పేరు కుళ్లు కళేబరం అనుకుంటా. చీకటిపడింది. ఆరాత్రికి వేరే మిత్రుడు మిట్టపల్లి అనంతశయనం, పద్మ వాళ్లింటికి వస్తానని చెప్పా. అక్కడికి శ్రీవెంకటేశ్వరస్వామి గుడి కూడా దగ్గరే.
ఆర్ట్‌కి అర్థం చెప్పిన దేవ్...
చికాగో చాలా వాటికి ప్రసిద్ధి. అందులోఒకటి ఆర్ట్ ఇనిస్టిట్యూట్. అందులోనే ఆర్ట్ స్కూలూ ఉంది. నేను, అనంతశయనం రామారావు ఇంటికెళ్లి సంజీవ్ దేవ్, సులోచన దంపతులతోకలిసి ఆఇనిస్టిట్యూట్‌లోని ఇంప్రెషనిజం చెందిన 19వ శతాబ్దపు ఫ్రెంచ్ చిత్రాలు చూసి చాలా అబ్బురపడ్డాం. దేవ్‌కిఆర్ట్ అంటే ఎంతిష్టమో చెప్పలేం కదా. బాగాఎంజాయ్ చేశారు. నిజానికి ఆఇనిస్టిట్యూట్ మొత్తం చూడాలంటే ఒకరోజుతో అయ్యే పనికాదు. అప్పటికే మధ్యాహ్నమైంది. ఇంకా చికాగో నగరాన్ని చూడాల్సి ఉంది. అందుకని భోజనానికి కావాల్సిన పండ్లు, పెరుగు, పండ్లరసం తీసుకుని నగర సందర్శనకు బయలుదేరాం.
అదో మధురానుభూతి...
ఆర్ట్ ఇనిస్టిట్యూట్ సందర్శన ఓ మధురానుభూతి. పైగా నేనూ చూడ్డం అదే తొలిసారి. కళను అర్థం చేసుకోవాలంటే విశాల దృక్పదం ఉండాలి. ఏ బొమ్మను ఎలా చూడాలో తెలియాలి. సంజీవ్ దేవ్ నాకు ఆవిషయాన్ని బోధపరిచి కళ్లు తెరిపించారు. ఆ భవనం డిజైన్‌ను, అందులోని కొన్నిగదులు, ద్వారాల్లోంచి ఇతర ప్రదేశాలను విభిన్నకోణాల్లోంచి చూస్తే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. దేవ్ చెబితేగాని నాకీ విషయం బోధపడలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆభవనంలోకి వెళ్లిన నేను తిరిగి ఎలా బయటకురావాలోనని రూట్ మ్యాప్ వెతుక్కుంటుంటే సంజీవ్ దేవ్ చకచకానడుచుకుంటూ వచ్చేశారు. దీంతోనేనూ, నాతోపాటున్నమిత్రుడు అనంతశయనం విస్తుపోయాం.
దేవ్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ...
దేవ్ రాక సందర్భంగా రామారావు, మరికొందరు ప్రముఖులు అరోరా (ఇల్లినాయిస్) బాలాజీ టెంపుల్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన ప్రసంగం, ఆర్ట్ ఎగ్జిబిషన్ అందర్నీఆకట్టుకుంది. ఈ సందర్భంగాపలువురు సంజీవ్ దేవ్ చిత్రాలను కొనుగోలు చేసి సంబరపడ్డారు. వచ్చిన అతిధులు, మా విశిష్ట అతిధులైన దేవ్ దంపతులు కూడా ఎంతో సంతోషపడ్డారు. అలా ఆ వారంతపు సెలవులు హాయిగా గడిచాయి.
ఎబ్రాడ్ ఇన్ అమెరికాలో వివేకానంద ప్రసంగం...
మేము వెళ్లిన తర్వాత సంజీవ్ దేవ్ దంపతులు వాళ్ల అబ్బాయి మహేంద్ర దంపతులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వాటిల్లోకాలిపోర్లియాలోని జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ కూడా ఉందను కుంటా. అప్పటికే నేను నాదగ్గరున్న ఎబ్రాడ్ ఇన్ అమెరికా– విజిటర్స్ టు ది న్యూ నేషన్ 1776–1914 పుస్తకంలో స్వామి వివేకానంద గురించి సీ బీ త్రిపాఠి రాసిన వ్యాసాన్ని దేవ్‌కి పోస్టులో పంపా. అప్పుడు తేదీలను పరికిస్తే వివేకానందుడు వచ్చిన వందేళ్ల తర్వాత సంజీవ్ దేవ్ అమెరికా వచ్చాడని అర్థమైంది. ఆ తర్వాత ఎప్పుడో నేను ఇండియా వచ్చి సంజీవ్ దేవ్‌ను వారి స్వగ్రామమైన తుమ్మపూడిలో కలిసినప్పుడు ఆ నాటి అమెరికా అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మాకు థ్యాంక్స్ చెప్పడం నాకింకా గుర్తుంది..