టీ, చాయ్ అనే మాటలెలా వచ్చాయో తెలుసా?
టీ అంటే ఇంగ్లీష్, చాయ్ అంటే హిందీ అనుకుంటున్నారా. అయితే, ఇది చదవండి.;
మన ఊర్లలో తేనీటి ని రెండు పేర్లతో పిలుస్తారు, ఒకటి ‘చాయ్’ (chai, chay), రెండోది ‘టీ’ (tea).
మన వూరి సంగతే కాదు, బర్మా లాంటి ఒకటి రెండు దేశాల్లో తప్ప ప్రపంచమంతా కూడా టీ ని ఈ రెండు పేర్లతోనే పిలుస్తారు.బర్మాలో టీ ని స్థానికంగా పండిస్తారు కాబట్టి వాళ్లు టీ కి స్థానిక భాష పదం దొరికింది. ఉదాహరణకు బర్మాలో Laphet అని పిలుస్తారు. అందువల్ల తేనీటికి మూడో పేరు చాలా అరుదు. అదెక్కడయినా ఉన్నా ఆదేశ సరిహద్దులు దాటిపోలేదు.
టీ , చాయ్ అనే మాటలెలా వచ్చాయనేది ఆసక్తికరమయిన చర్చ . టీ అనేది ఇంగ్లీష్ మాట అని, చాయ్ అనేది హిందీ పదమని మనం అనుకుంటాం.
కొంత వరకు ఇది నిజమే అనిపించినా, టీ,చాయ్ రెండు మాటల వ్యవహారం ఇంత సులభంగా లేదు. ఈ పేర్లు రావడం వెనక చాలా చరిత్ర ఉంది.
నిజానికి టీ , చాయ్ లనేవి హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు. వీటికి మాతృక చైనా భాష . ప్రపచంచంలో ఈ రెండు మాటలను వేర్వేరు భూభాగాల్లో వేర్వేరుగా వాడినా, రెండింటికి మూలం ఒకటే చైనా భాషలోని ఒకే అక్షరం లేదా ఒకటే పదం. మూలం (茶) ఈ అక్షరమే.
ఇదెలా జరిగిందంటే… ఈ వీడియో చూడండి...
ఇది టీ, చాయ్ ల వెనక కథ.