పనామా కెనాల్ నిర్మాణానికి రాళ్లెత్తి, బలైపోయిన కూలీలెందరో...

పనామా కెనాల్ ను స్వాదీనం చేసుకుంటామని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో పనామా కెనాల్ నిర్మాణ చరిత్ర మీద స్పెషల్

Update: 2024-12-24 05:59 GMT


పనామా కెనాల్ గురించి తెలియని వాళ్లు ఉండరు. రెండు మహా సముద్రాలను, అంటే పసిపిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతూ ఇంజీనీర్లు సృష్టించిన వింత. భూమ్మీద ఇదొక ఇంజనీరింగ్ అద్బుతమని చెబుతారు.1994లో సివిల్ ఇంజనీరింగ్ ఏడు వండర్స్ లో ఒకటిగా పనామా కాలువు గుర్తింపు పొందింది.

పనామ దేశంలో ఈ రెండు సముద్రాలను మధ్య ఉన్న చికెన్ నెక్ పొడవునా ఈ కాలువ తవ్వడంతో 20 శతాబ్దం ప్రపంచనౌకా వాణిజ్య కొత్త మలుపు తిరిగింది. ప్రపంచంలో అత్యంత కీలకమయిన ఖరీదైన నౌకా మార్గమయింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసిన కాలువ కూడా ఇది.

ఈ సముద్రపు ఒడ్డునుంచి ఆ సముద్రపు ఒడ్డుకు దాక ఈ కాలువ పొడవు 82 కిమీ. రెండు సముద్రాలను కలుపుతు ఇంజనీర్లు తవ్విన రెండో కాలువ ఇది. మొదటిది సూయజ్ కెనాల్.

దక్షిణ అమెరికాలోని పనామా దేశంలో తవ్విన ఈ చిన్న కాలువ నౌకల ప్రయాణాన్ని కొన్ని వేల మైళ్ల దూరం తగ్గించింది. అమెరికా ఈస్టుకోస్టు నుంచి వెస్టుకోస్టుకు సరకులు రవాణా చేయాలంటే నౌకలే చౌక అయిన మార్గం. సాధారణంగా ఆమెరికా తూర్పు తీరంనుంచి పడమటి తీరానికి నౌకలు వెళ్లాలంటే దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్ ను చట్టుకుని 8వేల నాటికల్ మైల్స్ (అంటే 15,000 కి.మీ)ప్రయాణించాలి. ఈ కెనాల్ తవ్విన తర్వాత ఆమెరికా ఈస్టు కోస్టు, వెస్టు కోస్టుల మధ్య దూరం 3500 నాటికల్ మైల్స్ కు తగ్గింది. ఎంత సమయం, ఇంధన ఆదా అయ్యాయో వూహించండి.

1914 లో ఈ కెనాల్ నిర్మాణం పూర్తయింది. మొన్న 2014 లో నూరేళ్ల పండగ జరుపుకుంది. ప్రపంచవాణిజ్యంలో అత్యంతకీలకమయిన నౌకామార్గమయిన ఈ కెనాల్ ఇపుడు పనామాదేశం అదుపులో ఉంటుంది. దీని పరిపాలనకు పనామా కెనాల్ అధారిటీ ఏర్పాటు చేశారు. 2015లోఈ కెనాల్ గుండా 12000 నౌకలు, అంటే రోజుకు 32 నౌకలు, దాదాపు రెండుగంటలకు మూడు నౌకలు ప్రయాణించాయి. 2015 అధారిటీకి టోల్ ద్వారా వచ్చిన ఆదాయం 2.6 బిలియన్లు డాలర్లు. పనామా ఖజానాకు చేకూరిన మొత్తం 1 బిలియన్ డాలర్లు. 80 దేశాలకు చెందిన 140 వాణిజ్య మార్గాల నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణిస్తుంటాయి. 2023లో ఈ ప్రాంతంలో కరువు వచ్చింది. దీనితో ఇక్కడి లేక్ లో నీటి మట్టం తగ్గిపోయింది. దీనితో దినసరి నౌకల సంఖ్య సాధారణంగా ఉండే 36 నుంచి 25 కు తగ్గింది. ఇలా పనామా గురించి విశేషాలు చెప్పుకోవడం చాలా బాగుటుంది. అయితే, కాలువ నిర్మాణం వెనక మానవ విషాదం, అంతర్జాతీయ కుట్రలు, ఒక పెద్ద సైంటిఫిక్ మోసం కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమేస్తుంది.

కాలువ నిర్మాణం

అట్లాంటిక్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లేందుకు దక్షిణ అమెరికా ఖండం మొత్తం చుట్టిపోవడాన్ని తప్పించుకునేందుకు రెండు సముద్రాలను కలుపుతూ కాలువ తవ్వాలని 1881లో ఫ్రెంచ్ ప్రభుత్వం భావించింది. అంతకు ముందు పనామా భూమార్గం మీదుగా పసిఫిక్ తీరానికి చేరే ప్రయత్నాలు చేశారు. ఇది చాలా కష్టభూయిష్టమయింది. 16వ,17 వ శతాబ్దాలలో స్పానిష్ వలస వాదులు కూడ ఇలాంటి ప్రయత్నాలు చేశారు సాక్ష్యంగా పనామా తీరంలోనాటి రేవుల ఆనవాళ్లు కనబడతాయి. ఆరోజులో ఈ భూమార్గంలో ఎదురయిన ప్రధాన అడ్డంకి మృత్యువు. అంతుబట్టని జర్వం. దానికి చికిత్స లేదు. ఈ జ్వరం సోకితే చావే. ఈ జ్వరానికి బయపడి పనామా మీదుగా భూమార్గాన పసిపిక్ తీరం చేరుకునే ప్రయత్నాలు ఫలించలేదు. సాహసం చేసిన వాళ్లంతా ఈ వింతజ్వరానికి బలై పోయారు. 


1881లో ఫ్రెంచ్ ప్రభుత్వం భూమార్గం వాణిజ్యం సాధ్యంకాదని భావించి రెండు సముద్రాలను కలుపుతూ కాలువ తవ్వేందుకు పూనుకుంది. వారినీ ఈ జ్వరం వదల్లేదు. ఫ్రెంచ్ లక్షమంది కూలీలను రంగంలోకి దించింది. ఇందులో 85 శాతం మంది ఆసుపత్రి పాలయ్యారు. 22వేల మంది చనిపోయారు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ప్రాజక్టు పూర్తి చేయలేమని భావించింది. ఈ వింత జ్వరం తో ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటుంది. జాండిస్ వస్తుంది అందుకే ఈ జ్వరాన్ని అక్కడి ప్రజలు పచ్చ జ్వరం (Yellow fever/ Yellow Jack ) అని పిలిచే వారు.పనామా కాలువ కూలీ పని అంటేనే కూలీలు మైలు దూరం పారిపోవడం మొదలుపెట్టారు. విపరీతంగా జీతాలుపెంచినా కూలీలు దొరకలేదు.

దీనితో వేలాది కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టాక, రెండు దశాబ్దాలు పనిచేశాక, 287 మిలియన్ డాలర్ల పెట్టుబడి వృధా చేసుకున్నాక ఫ్రెంచ్ వాళ్లు పాజెక్టు నిర్మాణం పనిని ఆపేశారు. ఆరోజు శక్తివంతమయిన ఫ్రాన్స్ ను ఒక జ్వరం ఇలా వణికించింది, ఓడించేసింది..

తర్వాత 1904 దాకా కాలువ నిర్మాణం గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. 1904లో అమెరికా ముందుకు వచ్చింది. ఇంజనీర్లు పనామా కెనాల్ తవ్వకం పనులు ప్రారంభించారు. వాళ్లు ధైర్యంగా కాలువ పనులు ప్రారంభించేందుకు బాట వేసింది వైద్య శాస్త్రవేత్తలు. అందులో ప్రధానమయినవ్యక్తి ఒక డాక్టర్ డైరీ. ఆ డాక్టర్ పేరు జెస్సీవిలియం లేజియర్ (Jesse William Lazear:1866-1900 ). అంతకు ముందు క్యూబాలో ఒక మిలిటరీ క్యాంపులో పనిచేసి, విష జ్వరం మీద ప్రయోగాలకు తన శరీరాన్నే వాడుకుని ప్రాణ త్యాగం చేశాడు. అపుడు ఆయన వయసు 44 సంవత్సరాలు. తన మీదే జబ్బు ప్రయోగాలు చేసుకుని చనిపోతూ డైరీ లో రాసుకున్నతన జబ్బు విశేషాలు పనామా కాలువ నిర్మాణం చేపట్టేందుకు బాట వేశాయి. ఇంతకీ డైరీలో ఏమి రాశాడు. అప్పటికి ఎల్లో ఫీవర్ ఎలా వస్తుందో తెలియదు. అందువల్ల చికిత్స లేకుండా ఉండింది.  ఎల్లో ఫీవర్ దోమలతోవస్తున్నదని లజియర్ నిరూపించాడు.దీనితో ఆమెరికా  పెద్ద ఎత్తున దోమల నిర్మూలన మొాదలు పెట్టి అమెరికా సైన్యాలకు రక్షణ కల్పించింది.




ఈ మధ్యలో ఒక మోసం కూడా జరిగింది

ఆయన డైరీని స్వాదీనంచేసుకున్న ఈ లేజియర్ టీమ్ లీడర్ డైరీలోని డేటాను తనది ప్రచారం చేసుకుని మాంచి పేరు కొట్టేశాడు. జర్నల్స్ వ్యాసాలు రాశాడు. అదే నిజమని ప్రపంచం నమ్మింది. ఈ మధ్యే ఇది మోసమని బయటపడింది.

అందుకే పనామా కాలువ, రాజకీయ కుట్ర, శాస్త్రప్రపంచపు మోసం, కూలీల త్యాగాలకు ప్రతీకగా నిలబడుతుంది. ముఖ్యంగా లేజియర్ త్యాగం ఎనలేనిది. లేజియర్ డైరీ రాయకపోయిఉంటే, పనామా కాలువ నిర్మాణం ఇంకా ఆలస్యమయ్యేది. అయితే,లేజియర్ కు ఈ క్రెడిట్ దక్కకుండా ఒక పెద్ద శాస్త్రవేత్తే ప్రయత్నించడం విషాదం. లేజియర్ ప్రయోగాలకు వెళ్లేముందు పనామా కాలువ రాజకీయం గురించి మూడు ముక్కలు.

అమెరికా రంగ ప్రవేశం

ఎల్లోఫీవర్ కు భయపడి కాలువ నిర్మాణాన్ని ఫ్రాన్స్ ఆపేశాక, అక్కడి ఆస్తులను అమెరికా ప్రభుత్వం 1902లో 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాలువ నిర్మాణం అమెరికాకు చాలా అత్యవసరం కాబట్టి, తానే నిర్మించాలనుకుంది. అపుడు పనామా భూభాగం కొలంబియా అదీనంలో ఉంది. కాలువ మీద ఎవరికి హక్కులుండాలనే దాని మీద కొలంబియా, అమెరికా ఒక అంగీకారానికి రాలేకపోయాయి. అపుడు అమెరికా ఏంచేసింది? పనామాలో స్వాతంత్య్రమ పోరాటానికి ఆజ్యం పోసింది. కొలంబియా నుంచి పనామా విడిపోయేందుకు దోహదం చేసింది. 1903లో పనామాను స్వతంత్ర దేశంగా అమెరికా గుర్తించింది. స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు నిచ్చినందుకు పనామా, కాలువ నిర్మాణానికి అమెరికాకు అనుమతినీయడమేకాదు, కాలువజోన్ మీద శాశ్వత హక్కు కల్పించింది. దీనికి బదులుగా ఆమెరికా పనామాకు 10 మిలియన్ డాలర్ల డబ్బు ముట్టచెప్పింది.

9 సంవత్సరాల తర్వాతి నుంచి యేడాదికి 2,50,000 డాలర్ల యాన్యుటి ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం జరిగింది. 1904 మే 4 కాలువ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో దోమల నిర్మూలన చేపట్టింది. ఎల్లో జ్వరం రాకుండా అన్ని చర్యలు తీసుకుంది. అపుడు అమెరికా అధ్యక్షుడు ధియోడర్ రూజువెల్ట్. 1914 ఆగస్టు 15న కాలువ  ప్రారంభమయింది. ఆమెరికా ఆధ్వర్యంలో కాలువ నిర్మాణం పూర్తయ్యేలోపు మొత్తం 5600 మంది పనివాళ్లు చనిపోయారు. 1979లో జిమ్మీ కార్టర్ అధ్యక్షుడుగా ఉన్నపుడు ఇది పనామా కెనాల్ పనామా దేశం చేతికి వచ్చింది. దీని అడ్మినిస్ట్రేషన్ పనామా కెనాల్ అధారిటీపరిధిలోకి వచ్చింది. 2010 సెపెంబర్ ఈ కెనాల్ గుండా పదిలక్షల నౌకలు ప్రయాణించాయి. 2016లో 5.5 బిలియన్ డాలర్ల ఖర్చుతో కెనాల్ విశాలం చేశారు.

ఇపుడు ట్రంపు బెదిరిస్తున్నట్లుగానే, 1999లో జార్జ్ డబ్య్లూ బుష్ పనామా దేశాన్ని స్వాధీనం చేసుకుని మాన్యయెల్ నోరాగాను పదవీచ్యుతిని చేశాడు. అపుడు అతర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుడుపడ్డాక పనామా కెనాల్ ను తిరిగి పనామాకు అప్పగించాయి. ఇపుడు ట్రంపు దేశాన్ని కాకుండా కెనాల్ ను స్వాధీనం చేసుకుంటాం అంటున్నాడు. అమెరికా నౌకల మీద పనామా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నదని చెబుతూ ఫీజులు తగ్గించకపోతే, కెనాల్ ను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించాడు.


Tags:    

Similar News