ప్రపంచీకరణ ముగిసిందని భావిస్తున్న బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్

ఇంగ్లీష్ పౌరులకు తాజా పరిస్థితులను వివరించేందుకు జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం;

Update: 2025-04-06 13:43 GMT
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంపై సుంకాల యుద్దం ప్రారంభించిన తరువాత, ప్రపంచీకరణపై బ్రిటన్ తన విధానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అమెరికా విధానాలు, బ్రిటన్ పరిస్థితిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇంగ్లీష్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని టెన్ డౌనింగ్ స్ట్రీట్ అధికారులు చెబుతున్న మాట.

1990లో ప్రారంభమయిన గ్లోబలైజేషన్ ముగింపు దశకు చేరుకుందనే విషయంపై ప్రధాని మాట్లాడే అవకాశం సీనియర్ బ్రిటిష్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ బ్రిటన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

ట్రంప్ విధానాలను స్టార్మర్ సమర్థించకపోయినా.. అప్పట్లో అమెరికా అనుసరిస్తున్న విధానాలను తిరిగే ఆ దేశమే తిరిగి రాయడం ప్రపంచానికి మింగుడుపడటం లేదు. ముఖ్యంగా యూరప్ దేశాలకు ఈ విధానాలు చేటు చేసేవిగా ఉన్నాయి.
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, వలసలను నమ్మకుండా మిలియన్ల మంది ప్రజలతో ప్రపంచం మరొ కొత్త యుగం వైపు ప్రయాణం ప్రారంభించిందని స్టార్మర్ అర్థం చేసుకున్నారని ఈ మేరకు బ్రిటన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా వాటిని వివరించే ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తోంది.
ప్రపంచీకరణకు చెల్లుచీటీ..
‘‘ప్రపంచీకరణ చాలామంది శ్రామిక ప్రజలపై ఇకపై పనిచేయదు. వాణిజ్య యుద్దాలు పరిష్కారమని మేము నమ్మటం లేదు. వేరే మార్గం ఉందని చూపించడానికి మేమే చేసే ఒక ప్రయత్నం’’ అని ఆ అధికారి అన్నట్లు తెలిసింది.
చురుకైన లేబర్ ప్రభుత్వం మరింత సంస్కరణయుతంగా మారుమూల ప్రదేశంలో ఉన్న ప్రజలకు సమాధానాలను అందించగలదని మనం నిరూపించాలని స్టార్మర్ సంకల్పంతో ఉన్నట్లు ఆ అధికారి ఉటంకించారు.
దేశీయ ఉత్పాదకత పెరుగుదల..
ఆర్థిక జాతీయవాదంపై ట్రంప్ ప్రాధాన్యతలను యూకే ప్రధాని మంత్రి కూడా అంగీకరించారని ఈ కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ తీసుకున్న విధానం వల్ల అంతర్జాతీయ సమజంలో పోటీ పెరుగుతుందని, దేశీయ ఉత్పాదకతను పెంచడానికి, సరఫరా సంస్కరణలు ద్వారా దేశీయ ఉత్పత్తి, వినియోగం పెంచడానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారట.
అమెరికాకు వస్తువుల ఎగుమతి చేసే ప్రపంచ వాణిజ్య భాగస్వాములపై పరస్పర సుంకాలను ట్రంప్ ప్రకటించిన తరువాత స్టార్మర్ బ్రిటిష్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి.
వారం చివరిలో స్టార్మర్, ఛాన్సలర్ రాచెల్ రీవ్స్ వృద్ధి అనుకూల డేటాను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు నియమాలు సడలించడం, పారిశ్రామిక వ్యూహంపై ప్రభుత్వ వ్యూహాన్ని వివరించడం లాంటివి ఉంటాయి.
ట్రంప్ సుంకాలు..
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించారు. ఇది అమెరికా చేసే వ్యాపారం చేసే దేశాలతో పాటు, అనేక పోటీ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. అలాగే బేస్ లైన్ సుంకాన్ని కనీసం పదిశాతంగా నిర్ణయించారు.
ఈ సుంకాలపై ట్రంప్ తనదైన శైలిలో వివరించారు. ‘‘తనకు ఫోన్ చేయబోయే ముందు వివిధ దేశాధినేతలు మీ స్వంత సుంకాలను రద్దు చేసుకోండని, అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 2ను ఆయన ఏకంగా లిబరేషన్ డేగా ప్రకటించారు. అమెరికాను ఇది పునర్జన్మ వచ్చిన రోజుగా సైతం ప్రకటించారు. అమెరికాను తిరిగి సంపన్నంగా మార్చే ప్రక్రియకు తాను శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు.
అయితే ప్రపంచీకరణకు మొదటగా చెల్లుచీటి పాడిన దేశంగా బ్రిటన్ నే చెప్పవచ్చు. అంతకుముందు యూరోపియన్ యూనియన్ నుంచి లండన్ వైదొలగడానికి కారణం ఈ ప్రపంచీకరణ వల్ల తమకు ఎలాంటి లాభం లేదని భావించడమే. యూరప్ కు ప్రధాన సమస్యగా మారిన వలసలపై ఇతర దేశాలు అనుసరిస్తున్న వైఖరి ఇంగ్లీష్ వారికి నచ్చలేదు. దానితో వారు బ్రెగ్జిట్ అయ్యారు. 


Tags:    

Similar News